బట్టలుతికిన నీళ్ళు కాళ్ళ మీద పోసుకుంటే పుట్టింటికి అరిష్టమా ?
అవుననే చెప్పాలి. మురికి పట్టిన బట్టలు నీటిని అనాలోచితంగా కాళ్ళ మీద పోసుకుంటారు ఆడవాళ్ళు కొందరు. అలా చేయటం పల్ల పుట్టింటికి అరిష్టము. ఎందుకంటే ఆడవాళ్ళు ఎక్కువ సమాయన్ని నీటి ఉంటూ పని చేయటం ద్వారా కాళ్ళకూ, చేతులకూ పగుళ్లొస్తాయి. వందలో తొంభై మధ్య తరగతి వారూ ఆ క్రింద తరగతి స్త్రీలలో ఖచ్చితంగా కాళ్ళలో పగుళ్ళు ఏర్పడతాయి.
వారిలో పదిశాతం చదువుకున్న, లేదా అందం పట్ల, ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్న వాళ్ళు మాత్రమే. తగు జాగ్రత్తలు తీసుకుంటారు.
Also Read : సంసార సుఖాన్ని ఏ విధంగా పొందాలి ?
అలా జాగ్రత్తలు తీసుకోని మహిళలు గుడ్డలుతికిన నీటిని, మలినమైనవీ, క్రిములున్న నీటిని కాళ్ళపై పోసుకోవటం ద్వారా అనేక క్రిములు శరీరంలోకి ప్రవేశించి, అనారోగ్యాన్ని కలగ చేస్తాయి. అప్పుడు అడ్డం పడితే భర్త పుట్టింటికి పంపిస్తాడు. ఆపై పడేదే పుట్టింటి వాళ్ళేగా బాధలు.
కూతురు సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా పుట్టింటికి వస్తే ఆనందించాలని తల్లీ, తండ్రీ కోరుకుంటారు.
అలా కాళ్ళ మీద గుడ్డలుతికిన నీరు పోసుకుంటే పుట్టింటికి అరిష్టమని చెప్తే, ఆడపిల్ల పుట్టింటి మీద ప్రేమతో చెయ్యకుండా ఆరోగ్యంగా ఉంటుందని పెద్దలు అలా చెబుతారు.
Famous Posts:
> భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఇల్లెందుకు కట్టుకోకూడదు?
> సంతానం కోరుకునే వారికీ కచ్చితమైన పరిష్కార మార్గం
> మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి.
> భస్మధారణ అంటే ఏమిటి? దాని వల్ల కలిగే లాభాలు ఏంటి?
> మహాభారతం నుండి నేరచుకోవలసిన 12 ముఖ్యమైన విషయాలు.
dharma sandehalu telugu pdf, dharma sandehalu, washing dress, women, water