కార్తికేయ2 సినిమాలో శ్రీకృష్ణుడి గురించి చెప్పిన అద్భుత విషయాలు..Wonderful things told about Lord Krishna in the movie Karthikeya 2

కార్తికేయ2 సినిమాలో శ్రీకృష్ణుడి గురించి చెప్పిన విషయాలు..

* కృష్ణుడిని దేవుడు అనే భక్తితో కన్నా ఒక గురువుగా స్వీకరిస్తే జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను దాటి అద్భుతాలు చూడొచ్చు.

* గీతతో కోట్లమందికి దారి చూపించిన అతనికన్నా గురువు ఎవ్వరు?

* రక్షణ కోసం సముద్రం మధ్యలో ద్వారకా నగరాన్ని కట్టిన అతనికన్నా గొప్ప ఆర్కిటెక్ట్ ఎవ్వరు ?

* నమ్మినవారి కోసం ఎంతటి వలయాన్నెనా ఛేదించే అతనికన్నా గొప్ప నమ్మకస్తుడు ఎవరు ?

* యుద్ధం చేస్తే ఇన్ని లక్షల మంది తెగటారిపోతారు, ఇన్ని లక్షల లీటర్ల రక్తం ఏరులై పారుతుంది, యుద్ధం వద్దు సంధి ముద్దు అని చెప్పి ఒప్పించాలని శతకోటి ప్రయత్నాలు చేసిన అతనికన్నా ముందుచూపున్న గొప్ప శాంతిదూత ఎవరు?

* చూపుతోనే మనసులోని మాటచెప్పే అతనికన్నా గొప్ప సైకాలజిస్ట్ ఎవరు ?

* వేణుగానంతోనే గోవుల్ని, గోపికల్ని కట్టిపడేసే అతనికన్నా గొప్ప మ్యూజిషియన్ ఎవరు ?

* నిత్యం ఆరోగ్యంతో ఉండే సూచనలు చెప్పిన అతనికి మించిన డాక్టర్ ఎవరు ?

* ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పిన అతన్నిమించిన వీరుడెవరు?

* నమ్ముకున్న వాళ్ళ వెంట ఉండి విజయమో వీర స్వర్గమో కర్తవం ముఖ్యం. ఫలితం దైవాధీనం అన్న గొప్ప దార్శనికుడు ఎవరు ?

* కరువూ కష్టం తెలియకుండా చూసుకున్న అతన్ని మించిన రాజెవ్వరు?

* హోమ యాగాలతో వర్షం తెప్పించిన అతనికన్నా ప్రకృతిని అర్థం చేసుకున్న అతన్ని మించిన కైమటాలజిస్ట్ ఎవరు ? 

* అన్ కంట్రోలబుల్ ఆర్.పి.యం.తో తిరిగే సుదర్శన చక్రాన్ని కంట్రోల్ చేసే అతన్ని మించిన కైనటిక్ ఇంజనీర్ ఎవరు ? 

* మరణం ఎప్పటికైనా తథ్యం అని గీత ద్వారా చెప్పి నడిపించే అతనికన్నా గొప్ప విరాగి ఎవరు ?

* అతనొక ఫైటర్, సింగర్, టీచర్, వారియర్, మ్యూజిషియన్, మేజిషియన్, దార్శనికుడు అనంతంలో నిండియున్న సృష్టి.

కృష్ణుడు అంటే సత్యం, ఆనందం, పరబ్రహ్మ స్వరూపం. అన్ని దైవ స్వరూపాలు ఆత్మ తత్వాన్ని బోధించేవే.

Famous Posts:

శనేశ్వరుడు శనివారాల నోము


శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత


శివదేవుని సోమవారపు నోము కథ


తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?


సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు


ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు

karthikeya, karthikeya 2, sri krishna, krishna quotes, sri krishna images, krishna story telugu, bhagavath geetha

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS