తిరుకల్యాణం, ఆర్జిత కల్యాణం, నిత్య కల్యాణంలో తేడా ఏమిటి ?
తిరు శబ్దం - సంస్కృతంలోని శ్రీ అదే దానికి సమానమైన తమిళ పదం.
శ్రీ అంటే శుభ ప్రదమైన అని అర్ధం.
మనం వ్యక్తుల నామములకు ముందు శ్రీ ఉంచుతాం. శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు అని.
అదే తమిళంలో తిరు రాముడు, తిరు కృష్ణుడు ఇలా వాడతారు.
తిరుపతి - శ్రీపతి, తిరుమల - శ్రీమల.
వైష్ణవాలయాలలో స్వామివారి కల్యాణ మహోత్సవం నిర్వహించేటప్పుడు బ్రహ్మాండ నాయకస్య - శ్రీ వేంకటేశ్వరస్య తిరుక్కల్యాణ సమయే అని చదువుతుంటారు.
దీనికి, శుభ ప్రదమైన లక్ష్మీ సంబంధమైన కల్యాణమని అర్థం.
ఇక ఆర్జిత కల్యాణ మంటే మనమేదైనా పవిత్ర దేవాలయానికి వెళ్లినప్పుడు మన పేర శ్రీ స్వామి వారి కల్యాణం చేయించాలని అనుకొంటాం.
దానికి దేవస్థానం చేత నిర్ణయింపబడిన రుసుం చెల్లించి, స్వామి కల్యాణం చేయిస్తాం.
దానినే ఆర్జిత కల్యాణం అంటారు.
ఇంకా స్వామికి అనేక సేవలు చేయించటానికి రుసం నిర్ణయింపబడింది.
అలా జరిగే సేవా కార్యక్రమాలలో రుసుం చెల్లించి స్వామి వారికి చేసే క్రతువులను ఆర్జిత సేవలంటాం.
లోక కల్యాణం నిర్వర్తిస్తే దానిని నిత్య కల్యాణ ఒక సామెత ఉన్నది.
నిత్య కల్యాణం పచ్చ తోరణంగా అని.
పెండ్లికి పచ్చని ఆకులతో తోరణాలు కడతారు.
అంటే పెండ్లి జరుగుతుంటే ఎంత శుభప్రదంగా ఆనంద దాయకంగా కాలం గడుస్తుందో, అలా ప్రతి నిత్యం సుఖంగా శుభంగా సాగే జీవితాలను గురించి అలా అంటుంటారు.
Famous Posts:
> బియ్యపు గింజతో ఇలా చేస్తే ధన లాభం కలుగుతుంది ఎలాగో తెలుసా ?
> గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనంగా ఎలా మారిందో తెలుసా ?
> ఎంతటి కష్టాన్ని అయిన పోగొట్టే అత్యంత శక్తివంతమైన హనుమ లాంగూల స్తోత్రమ్
> మీ పుట్టిన తేది ప్రకారం ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంచితే శుభం
> కొత్త కోడలు రాగానే సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారు?
> మంగళ, శుక్రవారాల్లో ఎవరికీ డబ్బు ఇవ్వకూడదా?
tiru kalyanam, arjitha kalyanam, nitya kalyanam, srivari kalyanam, tirumala, ttd