ఈ దేవుణ్ణి దర్శిస్తే దారిద్ర బాధలుండవు - Mayukh Aditya - Varanasi TemplesE

దారిద్ర్యాన్ని నివారించే మయూఖాదిత్యుడు

కాశీ క్షేత్రంలో చూడదగిన ప్రదేశాలలో మయూఖాదిత్యుడి ఆలయం ఒకటిగా కనిపిస్తుంది. పంచగంగ రేవు సమీపంలో ఈ స్వామి దర్శనమిస్తుంటాడు. పూర్వం ఇక్కడ శివలింగాన్ని .. మంగళగౌరిదేవిని ప్రతిష్ఠించి సూర్యభగవానుడు పూజించాడట. ఆయన తపస్సుకు మెచ్చిన పరమశివుడు అమ్మవారితో పాటు ప్రత్యక్షమై, 'మయూఖాదిత్యుడు' అనే వరాన్ని ప్రసాదించాడట.

శివుడిని పూజిస్తూ సూర్యభగవానుడు కాశీ క్షేత్రంలోనే ఉండిపోయినప్పుడు, ఆయన మయూఖాలు (కిరణాలు) మాత్రమే లోకంలో వెలుగులు విరజిమ్మాయట. అందువలన పరమశివుడు ఆయనకి ఆ వరాన్ని ఇచ్చాడట. మయూఖాదిత్యుడిని దర్శించుకున్నవారిని దారిద్య్రం దరిచేరదని సెలవిచ్చాడు. చైత్ర శుద్ధ తదియనాడు తననీ .. మంగళగౌరీ దేవిని ఆరాధించినవారికి సకల శుభాలు కలుగుతాయని చెప్పాడట. అందువలన కాశీ క్షేత్రానికి వెళ్లినవారు, మయూఖాదిత్యుడిని దర్శించుకోవడం మరిచిపోవద్దు. 

సూర్యునిచే స్తుతింపబడిన "శివ గౌరి అష్టకము" పఠించినవారు జన్మ రహితులై పుత్ర పౌత్ర సంపదలు పొందెదరు. ఈ కధను విన్న చదివిన నరకము పొందరు. ఇచట వెలసిన ఆదిత్య సాక్షాత్కార మహిమ అంత గొప్పది.

Famous Posts:

సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు


ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు


ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే


అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం


> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి


100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం


> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

Mayukh Aditya, Mayukhaditya Temple, aditya mayukh, Varanasi

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS