డబ్బు లెక్కించేటప్పుడు చేయకూడని పనులు..ఇలా చేస్తే సంపద ఆవిరి అవ్వటం ఖాయం ! Things not to do when counting money

డబ్బు లెక్కించేటప్పుడు చెయ్యకూడని పనులివే..

లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉంటే ఆ ఇంట్లో వారికి ఎప్పుడూ ఆర్థిక సమస్యలు రావు. అయితే ధనాన్ని లెక్కించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే, లక్ష్మీ దేవికి కోపం వస్తుంది. లక్ష్మీదేవి ఆగ్రహిస్తే మనం సంపాదించిన ధనం లో ఒక్క రూపాయి కూడా మిగలకుండా పోతుంది. అందుకే డబ్బు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

అలవాటులో పొరబాటుగా డబ్బులు లెక్కించేటప్పుడు చేసే తప్పులు

డబ్బులు లెక్కించేటప్పుడు, డబ్బులు ఇచ్చేటప్పుడు చాలామంది అలవాటులో పొరపాటు గా కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ఇక ఆ తప్పులు చేస్తే డబ్బులు మన దగ్గర నిలవవని శాస్త్రం చెబుతోంది. అసలు డబ్బులు లెక్కించేటప్పుడు చేసే తప్పులు ఏంటి? ఎలాంటి తప్పులు చేయకూడదు అనేది ఇక్కడ తెలుసుకుందాం.

డబ్బులు ఎక్కడ పడితే అక్కడ పెట్టరాదు

చాలామంది డబ్బుల విషయంలో చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు. డబ్బులను ఎక్కడపడితే అక్కడ పెడుతూ ఉంటారు. అలా డబ్బులు ఎక్కడపడితే అక్కడ పెట్టడం లక్ష్మీదేవి ఆగ్రహానికి కారణం అవుతుంది. డబ్బులను సరైన స్థానంలో పెడితే అది నిలబడుతుంది. ఎక్కడపడితే అక్కడ పెడితే డబ్బు పట్ల మన నిర్లక్ష్యానికి అది అద్దం పడుతుంది. డబ్బులను, కొద్దిపాటి మొత్తం అయితే పర్సులలో, ఎక్కువ మొత్తం అయితే అల్మరాలలో పెట్టడం మంచిది. వంట గదిలో పోపు డబ్బాలలో, ఎక్కడ పడితే అక్కడ డబ్బులు పెట్టడం మంచిది కాదని తెలుసుకోవాలి.

నోట్లో ఉమ్మి తడి చేస్తూ డబ్బులను లెక్కించరాదు

డబ్బులు లెక్కించేటప్పుడు చాలామంది నోట్లో ఉమ్ము తడి చేస్తూ లెక్కిస్తూ ఉంటారు. అలా లెక్కించుట లక్ష్మీదేవి ఆగ్రహానికి కారణం అవుతుందని శాస్త్రం చెబుతుంది. డబ్బులు లెక్కించేటప్పుడు నోట్లో అంటుకున్నట్టు అనిపిస్తే నీళ్ళతో కానీ, ఏదైనా పొడిని గానీ చేతి వేళ్లకు రాసుకుని డబ్బులను లెక్కించాలి. అంతే తప్ప నోట్లో ఉమ్మిని వేళ్లకు రాసుకుని డబ్బులను లెక్కించడం లక్ష్మీదేవిని అవమానించడమే అవుతుంది.

ఎవరికి డబ్బులు ఇచ్చినా విసిరినట్టు వెయ్యరాదు 

అంతేకాదు చాలామంది పర్సులో డబ్బులను పెట్టుకునేటప్పుడు వాటితో పాటు కొన్ని ఆహార పదార్థాలను కూడా పెడుతూ ఉంటారు. చాక్లెట్లు, సోంపు వంటి వాటిని పర్సులో డబ్బులతో పాటు పెట్టకూడదు. అలా ఏ వస్తువుతో పడితే ఆ వస్తువుతో డబ్బులను పెట్టడం డబ్బును అవమానించడమేనని చెబుతున్నారు. అంతేకాదు ఎవరైనా పెద్దవారు యాచకులకు డబ్బులు దానం చేసేటప్పుడు కొంతమంది ఆ డబ్బులను విసిరినట్లుగా పడేస్తూ ఉంటారు. అది ఏమాత్రం మంచిది కాదని పెద్దలు చెబుతున్నారు.

రాత్రి వేళల్లో మంచాలపై డబ్బులు ఉంచరాదు 

ఎవరికి డబ్బులు ఇచ్చినా సరే విసిరినట్లు కాకుండా వారి చేతికి ఇవ్వాలి. అలాకాకుండా డబ్బులను విసిరేస్తే మహా పాపం చేసినట్లేనని చెబుతున్నారు. అలాంటి వాళ్లను లక్ష్మీదేవి కరుణించదు అని చెబుతున్నారు. అంతేకాదు రాత్రివేళల్లో నిద్రించే సమయంలో మంచంపై డబ్బులను పెట్టకూడదని, నగదును ఎప్పుడూ శుభ్రమైన ప్రదేశాలలో, వాటికి కేటాయించిన స్థానాలలోనే పెట్టాలని చెబుతున్నారు.

డబ్బు క్రిందపడితే కళ్ళకు అద్దుకుని జాగ్రత్త చెయ్యాలి.. నిర్లక్ష్యం తగదు 

పొరపాటున డబ్బు చేతిలో నుంచి జారి కింద పడిపోతే ఆ డబ్బులు తీసుకునేటప్పుడు ముందు కళ్ళకద్దుకుని, మనసులో లక్ష్మీదేవిని స్మరించుకుని, ఆ డబ్బును జాగ్రత్త చేసుకోవాలని చెబుతున్నారు. అలా కాకుండా ఇష్టమొచ్చినట్టు డబ్బులు పడేయడం, డబ్బంటే లెక్క లేనట్లుగా ప్రవర్తించడం, డబ్బుని లెక్కించేటప్పుడు తెలియకుండానే రకరకాలుగా తప్పులు చేయడం మంచిది కాదని శాస్త్రం చెబుతోంది. అందుకే ధనలక్ష్మి విషయంలో జాగ్రత్తగా మసలుకోవాలని సూచించబడింది. అలా జాగ్రత్తగా ఉండకుంటే మనం సంపాదించిన రూపాయి మనదగ్గర మిగలకుండా పోతుంది.

Famous Posts:

> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి

100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం

> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?

శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి

astrology, wealth, money mistakes, జ్యోతిష్యం, సంపద, డబ్బు, lakshmi, kubera, counting money

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS