ఈ ప్రయోగాన్ని పౌర్ణమి తిధి నాడు మొదలుపెట్టి, ప్రతి శుక్రవారం నాడు ఆచరించాలి. ఈ ప్రయోగాన్ని చేయడానికి మీరు ఒక చిన్న తెల్ల మట్టి కుండ, రాళ్ల ఉప్పు, ఒక నిమ్మకాయ, 7 ముఖాల రుద్రాక్ష ఒకటి, ఒక రూపాయి నాణెం, 6 మట్టి ప్రమిదలు, మల్లెపూలు లేక సన్నజాజులు కొన్ని, ఆవు నేయిలో ముంచిన 6 పత్తి వత్తులు, తేనే చుక్కలు వేసిన నల్ల నువ్వుల నూనె, ఒక తామర ఆకు, నివేదన కొరకు మీ శక్తానుసారం పరమాన్నం లేక చక్కర పొంగలి లేక ఖండ శక్కర, బెల్లం ముక్కలు, తాజా పళ్ళు వంటివి మరియు పూజకు ఉపయోగించే ఇతర పూజ సామగ్రి సిద్దం చేసుకోవాలి.
మీ పూజ మందిరంలో తెలుపు రంగు వేసిన మట్టి కుండను ఒక ప్లేటు లో పెట్టి దానిని పూర్తిగా ఉప్పుతో నింపాలి. దీపై ఒక నిమ్మకాయ, 7 ముఖాల రుద్రాక్ష ఒకటి, ఒక రూపాయి నాణెం పెట్టి పువ్వులతో అలంకరించుకోవాలి. ఈ మట్టి కుండ ముందు శుభ్రం చేసిన తామరాకు పెట్టి, దాని మధ్యలో మల్లెపూలు లేక సన్నజాజులు పెట్టి, దాని చుట్టూ గుండ్రంగా (క్రింద చిత్ర పటం లో చూపిన విధంగా) ప్రమిధలను అమర్చాలి. ప్రమిదలు ఒక దానికి మరొక దానికి మధ్య కూడా మల్లెపూలు లేక సన్నజాజులు పెట్టాలి.
అన్నింటిని పైన ఇచ్చిన చిత్ర పటం లో చూపిన ప్రకారం అమర్చుకున్న తరువాత, ఆవు నేయిలో ముంచిన 6 పత్తి వత్తులను ప్రమిదలలో వేసి, తేనే చుక్కలు వేసిన నల్ల నువ్వుల నూనె ను ప్రమిదలలో పోసి, దీపాలు వెలిగించాలి. కొబ్బరి కాయను, నివేదనలను సమర్పించాలి. క్రింద ఇచ్చిన మంత్రాన్ని 9 సార్లు జపించాలి.
ఓం శ్రీం శ్రీం శ్రీం ధనలక్ష్మియే నమో నమః
ఓం శ్రీం శ్రీం శ్రీం ధనలక్ష్మియే నమః
వ ర వ ర వ ర వ ర వ
ధిమిధిమి ధింధిమి ధింధిమి-దింధిమి, దుంధుభి నాద సుపూర్ణమయే
ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ, శంఖ నినాద సువాద్యనుతే |
వేద పూరాణేతి హాస సుపూజిత, వైదిక మార్గ ప్రదర్శయుతే
జయ జయహే మధుసూదన కామిని, ధనలక్ష్మి రూపేణా పాలయ మామ్ ||
ఓం శ్రీం శ్రీం శ్రీం
ఓం శాంతి శాంతి శాంతిః
పైన ఇచ్చిన మంత్రంలో ధనలక్ష్మి మంత్రము, అష్ట లక్ష్మి స్తోత్రం లోని ధనలక్ష్మి శ్లోకము, శాంతి మంత్రము మూడు కలసి వున్నాయి. ఈ ప్రయోగాన్ని చేయడం ద్వారా శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని మీరు మీ ఇంటిలోకి ఆహ్వానిస్తారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మీ ఇంట స్థిర నివాసం వుండి, మీకు ధన ప్రాప్తిని, ఐశ్వర్య ప్రాప్తిని, కుటుంబ-వ్యాపార అభివృద్దిని, సుఖ సంతోషాలను ఆయురారోగ్యాలను మరియు మీ ఉన్నతికి కావలసిన వాటన్నింటిని అనుగ్రహిస్తారు.
ఈ ప్రయోగాన్నిమీరు సాయంత్రం సూర్యాస్తమయం అయ్యాక, దీపాలు పెట్టె వేళ చేయాలి. ప్రతి శుక్రవారం కుండలో పెట్టిన నిమ్మకాయను మార్చాలి. ప్రతి శుక్రవారం పైన తెలిపిన ప్రకారం తామరాకు పై పూలు, దీపాలు పెట్టి, నివేదనలు సమర్పించి పూర్తి పూజ చేయాలి. ప్రతి రోజు సాయం సంధ్యలో బెల్లం ముక్కలు నివేదనగా పెట్టి మంత్ర జపం మాత్రం చేస్తీ చాలు.
ప్రతి పౌర్ణమి రోజు మరియు ప్రతి శుక్రవారం పూర్తి పూజ చేయాలి. ప్రతి 3 వారాలకు ఒక సారి కుండలోని ఉప్పును మార్చి కొత్త ఉప్పును నింపాలి, అలాగే రూపాయి నాణం కూడా మార్చాలి. పాత ఉప్పును నీళ్ళలో కలిపి కొబ్బరి చెట్టుకు పోయాలి. పాత నాణెం ను, బీరువాలో కాని, పర్సు లో కాని, కాష్ బాక్స్ లో కాని పెట్టుకోవచ్చు. ఈ తంత్ర ప్రయోగం లో పైన తెలిపిన ప్రతి ఒక్క వస్తువును తప్పక ఉపయోగించాలి. అన్ని వస్తువులను సమకూర్చుకున్న తరువాతే ప్రయోగాన్ని మొదలుపెట్టాలి.
ఈ ప్రయోగాన్నిచేస్తూ ఎంతో మంది లక్షాదికారులుగా, కోటీశ్వరులుగా ఎదిగారు. మీరు కూడా ఈ ప్రయోగాన్ని నిత్యమూ ఆచరిస్తూ అఖండ ధనప్రాప్తిని స్వంతం చేసుకోవచ్చు.
Famous Posts:
> ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే
> అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం
> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి
> 100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం
> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం
> అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం
> ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే
> గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?
Shri Mahalakshmi Tantram, mahalakshmi tantra, lakshmi tantra pdf, Sri Maha Lakshmi, maha lakshmi pooja telugu, sri maha lakshmi yantram