తల్లి తండ్రులు ఒక్కసారి మీ పిల్లల భవిషత్ పై ఆలోచించండి..| Parents think about your child's future

తల్లి తండ్రులు ఒక్కసారి మీ పిల్లల భవిషత్ పై ఆలోచించండి..

పిల్లలు చెడిపోవడానికి స్నేహితులు, ఉపాధ్యాయులు, ఫోన్లు, మీడియా 10 % కారకులు, కానీ 90% కారకులు తల్లిదండ్రులే..!

పిల్లల్ని గారాబం మరీ శృతిమించితే మొత్తానికే నష్టం వస్తుంది.. 

పిల్లల పట్ల మనం పాటిస్తున్న అజ్ఞానం, మూఢనమ్మకాలు, స్వార్థం, అతి  ప్రేమనే వారిని చాలా వరకు బద్దకస్తుల్ని చేస్తుంది,

వారిని నాశనం చేస్తున్నారు.

ఇప్పుటి తరం 70% పిల్లలు..

> తల్లిదండ్రులు కారు, 

> బండి తుడవమంటే తుడవరు..

> మంచి నీళ్ళు, పాలు, కిరాణా సరుకుల కోసం బయటికి వెళ్ళమంటే వెళ్లరు..

> లంచ్ బ్యాగ్ లు, స్కూల్ బ్యాగులు శుభ్రం చేసుకోరు..

> కనీసం ఇంటి దగ్గర చిన్న చిన్న పనులలో సహాయం చేయరు...

> రాత్రి 10 గంటలలోపు పడుకుని, ఉదయం ఆరు లేదా ఏడు గంటలలోపు నిద్ర లేవ మంటే లేవరు...

> గట్టిగా మాట్లాడితే ఎదురు తిరగబడి సమాధానం చెబుతారు..

> తిడితే వస్తువులను విసిరి కొడతారు..

> ఎప్పుడు అయినా దాచుకోమని డబ్బులు ఇస్తే మనకు తెలియకుండా ఐస్ క్రీమ్ లు, కూల్ డ్రింక్ లు, నూడుల్స్ ప్యాకెట్లు, ఫ్రెండ్స్ కి పార్టీలు, ఫ్రెండ్స్ కోసం గిఫ్ట్ లు కొనుగోలు చేస్తున్నారు..

> ఆడపిల్లలు అయితే తిన్న కంచం కూడా కడగటం లేదు..

> ఇల్లు ఊడ్చమంటే కోపాలు వచ్చేస్తున్నాయి..

> అతిథులు వస్తే కనీసం గ్లాసుడు మంచి నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచనలేని అమ్మాయిలు కూడా ఉన్నారు..

> 20 సంవత్సరాలు దాటినా చాలామంది ఆడపిల్లలకు వంట కూడా చేయడం రావటం లేదు..

> బట్టలు పద్ధతిగా ఉండాలి అంటే ఎక్కడలేని కోపం వీరికి.. 

> కల్చర్, ట్రెండ్, టెక్నాలజీ పేరిట వింత పోకడలు..

> వారిస్తే వెర్రి పనులు..

> మనమే పిల్లలచేత అవన్నీ చేయించడం లేదు,

కానీ కారణం మనమే..

ఎందుకంటే మనకు అహం, పరువు, ప్రతిష్టలు అడ్డొస్తున్నాయి..

చూసేవాళ్లకు మనం మంచి హోదాలో ఉండాలి, రిచ్ లుక్, స్టేటస్ మెయింటైన్ చేయాలి అని భ్రమలో ఉన్నాం..

గారాబంతో పెరిగిన వారు మధ్యలో మారమంటే మారడం అస్సలు జరగదు..

వారిని కష్ట పెట్టమని కాదు ఇక్కడ చెప్పేది.. 

కష్టం గురించి తెలిసేలా పెంచండి 

కష్టo, డబ్బు, సమయం, ఆరోగ్యం విలువ తెలియకపోతే.. వారికి జీవితం విలువ తెలియదు..

ప్రేమతో, గారాబంగా మనం చేస్తున్న తప్పుల వల్లే.. కొందరు యువత 15 ఏళ్లకే సిగరెట్స్, మందు, బెట్టింగ్, దొంగతనాలు, డ్రగ్స్, రేప్ లు, హత్యలు చేస్తున్నారు..

మరికొంతమంది సోమరిపోతులులా తయారు అవుతున్నారు..

అభినయాలు కనపడడం లేదు, అణకువగా ఉండటం రాదు, సంస్కృతి, సంప్రదాయాలు పట్టించుకోవడం లేదు..

ఇలాగే ఉంటే కొంత కాలానికి తల్లిదండ్రులను గౌరవించే పద్ధతి కూడా లేకుండా పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు..

భార్యకు వంట వండటం సరిగా రాదని నేటి యువత బిర్యానీలు, కర్రీ పాయింట్ ల వెంట పడుతూ చిన్న వయసులోనే గ్యాస్టిక్ అల్సర్, గాల్ బ్లాడర్ స్టోన్స్ , కిడ్నీ స్టోన్ ల బారిన పడుతున్నారు..

మరొక ఫ్యాషన్ ఏమిటంటే పెరుగు మజ్జిగ తీసుకుంటే వాంతులు చేసుకోవడం..

కొన్ని ఆహార పదార్థాలు ఎంత ఆరోగ్యకరమైన కూడా వాళ్లకు అనవసరం..

> కాలేజీ పిల్లలు అయితే సరిగ్గా ఒక పిడికిలి పట్టేంత టిఫెన్, లంచ్ చిన్న బాక్సు రైస్.. చాలామంది ఫ్రూట్స్ అసలు తినరు...

గర్భవతులు అయిన తరువాత వారి బాధలు వర్ణనా తీతం

టోటల్ మెడిసిన్ మీద డిపెండ్ అవడం, 100 లో 90 మంది సిజేరియన్ ద్వారా పిల్లల్ని కంటున్నారు అంటే వారి శారీరక పటుత్వం ఎంత పడిపోయిందో ఆలోచించండి..

అలా ఉంటే పుట్టే పిల్లలు కూడాఏదో ఒక జన్యులోపంతో పుడుతున్నారు..

3వ తరగతి పిల్లాడికి సోడాబుడ్డి లాంటి కళ్ళద్దాలు..

5వ తరగతి వారికి అల్సర్, బీపీలు..

10 వ తరగతి దాటేలోపు ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చేస్తున్నాయి..

వీటన్నికి కారణం మనం మన పిల్లలను సరైన పద్ధతిలో పెంచకపోవడమే..

అందుకే తల్లిదండ్రులు మారాలి..

రేపటి సమాజానికి ఏమి నేర్పుతున్నాం...?

ఒక్కసారి ఆలోచన చేయండి...

సంస్కృతి సాంప్రదాయం అంటే ఏమిటి...?

కేవలం గుడికి వెళ్లి

పూజలు, ప్రార్థనలు చేసి మన సంస్కృతి సాంప్రదాయం అని పిల్లలకు అలవాటు చేస్తున్నాము, అది మాత్రమే కాదు సాంప్రదాయం అంటే.. అలా అనుకోవడం కొంత పొరపాటు..

పిల్లలకు..

> బాధ్యత 

> మర్యాద

> గౌరవం 

> కష్టం 

> నష్టం 

> ఓర్పు

> సహనం

> దాతృత్వం

> ప్రేమ

> అనురాగం

> సహాయం

> సహకారం

> నాయకత్వం

> మానసిక ద్రృఢత్వం 

> కుటుంబ బంధాలు

> అనుబంధాలు    

> దైవ భక్తి

> దేశ భక్తి

ఈ భావనలు సంప్రదాయాలు అంటే..

కొంచెం కష్టమైనా సరే ఇవి తప్పక చిన్న వయసులోనే పిల్లలకు అలవాటు చేయాలి.. మంది కోసం బ్రతకద్దు మన ఆరోగ్యం, ఆనందం కోసం న్యాయంగా బ్రతుకుదాం.

ఇవన్ని అలవాటు అయితే ఆరోగ్యం, మానసిక పరిస్థితి, సామాజిక సృహ, ఉత్తమ జీవన విధానం వారికి అందించిన వారమవుతాం..

భావితరాల పిల్లల కోసం ,పిల్లలను మార్చే బాధ్యత మన అందరిపై కలదు.

Famous Posts:

రోజు రెండు యాలకులు తింటే ఇన్ని ప్రయోజనాలా ? 

నిమ్మరసం ఎక్కువగా తాగితే డేంజర్

నిద్రపట్టకపోవడానికి ఇవే కారణాలు

ఓక నెల పాటు ప్రతి రోజు 5 ఖర్జూరాలు తింటే చాలు 

బట్ట తల పై జుట్టు పెరుగుటకు ఉల్లిపాయను ఎలా ఉపయోగించాలి?  

childrens, parents, parents worry about their child, worried about my child's future

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS