ఓ " చిదంబర రహస్యం " అంటారు చాలా మంది.
ఇంతకి...ఆ చిదంబర రహస్యం...అంటే...ఏమిటోతెలుసుకోండి..
తమిళనాడులోని చిదంబరంలో గొప్ప దేవాలయం ఉందనీ , అక్కడున్న నటరాజ విగ్రహం ప్రపంచ ప్రసిద్ధమైనదని మనలో చాలా మందికి తెలుసు.
చిదంబరం లో ఉన్న నటరాజ విగ్రహం యొక్క కాలి బొటన వేలు, భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువు అని 8 సంవత్సరాల పరిశోధన అనంతరం పాశ్చాత్య సైంటిస్టులు తేల్చి చెప్పేశారు .
ఈ విషయాన్ని తన గ్రంధం " తిరుమందిరం " లో ప్రసిద్ధ తమిళ స్కాలర్ తిరుమూలర్ చెప్పారు.
ఇపుడు ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాం !
ఈ ఆలయం ప్రపంచ అయస్కాంత క్షేత్ర మధ్య బిందువుగా ఉంది.
" పంచ భూతాలు అని మనం చెప్పుకునే భూమి , ఆకాశమూ , వాయువూ , నీరు , అగ్ని లలో చిదంబరం ఆకాశానికి ప్రతీక అనీ , కాళహస్తి వాయువుకు ప్రతీక అనీ , కంచిలోని ఏకాంబరేశ్వరుడు పృథ్వి ( భూమికి ) కి ప్రతీక అనీ అంటారు.
అయితే ఇక్కడ విచిత్రమైన అద్భుతం ఏమిటంటే.......!
ఈ మూడు దేవాలయాలూ ఒకే రేఖాంశం మీద ఉన్నాయి .
అవునండీ ! అవును ..... 79డిగ్రీల 41 నిముషాల రేఖాశం మీద ఉన్నాయి .
ఇది ఆశ్చర్యం కదూ !
చిదంబరం దేవాలయానికి 9 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి . మానవుడికి నవ ( 9 ) రంధ్రాలు ఉంటాయి
చిదంబరం దేవాలయంలో పైన 21600 బంగారపు రేకులు తాపడం చేశారు . మానవుడు రోజుకు 21600 సార్లు గాలి పీలుస్తాడు . ( 15 x 60x 24 = 21600 )
ఆ బంగారపు రేకులు తాపడం చేయడానికి 72000 బంగారపు మేకులు వాడారు . మన శరీరం లో ఉండే నాడులు 72000 అని ఆయుర్వేదం చెబుతుంది.
దేవాలయం లో " పొన్నాంబళం " కొంచెం ఎడమవైపుకు ఉంటుంది . అది మన హృదయ స్థానం . అక్కడకి వెళ్ళడానికి " పంచాక్షర పడి " ఎక్కాలి .
అది న + మ + శి + వ + య . పంచాక్షరి ని సూచిస్తుంది.
" కనక సభ " లో 4 స్తంబాలు 4 వేదాలకు ప్రతీకలు .
పొన్నాంబళం లో 28 స్థంబాలు 28 శైవ ఆగమాలకు ప్రతీకలు - శివారాధనా పద్ధతులు . ఇవి 64 ఇంటూ 64 దూలాలను సపోర్ట్ చేస్తున్నాయి. 64 కళలు ఉన్నాయని రుజువు ఇది . అంతే కాదు అడ్డు దూలాలు రక్త ప్రసరణ నాళాలు
9 కలశాలు 9 రకాల శక్తికి ప్రతీకలు .
అర్ధ మంటపం లోని 6 స్తంబాలూ 6 శాస్త్రాలకు ప్రతీకలు .
ప్రక్కన ఉన్న మంటపం లోని 18 స్తంబాలూ 18 పురాణాలకి ప్రతీకలు.
నటరాజు నృత్యాన్ని పాశ్చాత్య సైంటిస్ట్ లు కాస్మిక్ డాన్సు అని వర్ణించారు .
మూలవర్ చెప్పిన ఈ విషయాలు శాస్త్ర సమ్మతాలని నిరూపించడానికి పాశ్చాత్య పరిశోధకులకు 8 సంవత్సరాలు పట్టింది.
Famous Posts:
> హనుమ నామస్మరణం సర్వపాప నివారణం
> స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?
> సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము
> శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత
chidambaram temple timings, chidambaram temple timings today, chidambaram temple secret, chidambaram nataraja temple official website, chidambaram temple history in telugu, chidambaram temple contact number, chidambaram temple scientific facts, chidambaram temple history telugu