అన్నం' గురించి నలుగురు మంచి మనుషులు చెప్పిన నాలుగు గొప్ప మాటలు...| Annam Parabrahma Swaroopam

అన్నం' గురించి నలుగురు మంచి మనుషులు చెప్పిన నాలుగు గొప్ప మాటలు...

1. " నేను వంటింట్లోకి వేరే పనిమీదవెళ్ళినా కూడా , వంట చేస్తున్న మా అమ్మగారు.  " పెట్టేస్తా నాన్నా ఒక్క అయిదు నిముషాలు " అనేవారు నొచ్చుకుంటూ-   నేను అన్నం కోసం వచ్చాననుకుని !  ఎంతయినా అమ్మ అంటే అన్నం.  అన్నం అంటే అమ్మ ! అంతే !  - జంధ్యాలగారు.

2. మంచి భోజనం లేని పెళ్ళికి వెళ్ళటం - సంతాపసభకి వెళ్ళినదానితో సమానం !   -  విశ్వనాధ సత్యనారాయణ గారు.

3. రాళ్లు తిని అరిగించుకోగల వయసులో వున్నప్పుడు తినటానికి మరమరాలు కూడా దొరకలేదు !  వజ్రాలూ , వైడూర్యాలూ  పోగేసుకున్న ఈ వయసులో  మరమరాలు కూడా అరగట్లేదు ! అదే విధి !  - రేలంగి వెంకట్రామయ్య గారు.

4. ఆరురోజుల పస్తులవాడి ఆకలి కన్నా,   మూడురోజుల పస్తులవాడి ఆకలి మరీ ప్రమాదం ! ఆహారం దొరికినప్పుడు ముందు వాడ్నే తిననివ్వాలి !  -  ముళ్ళపూడి వెంకటరమణ గారు

5. ఏటా వందబస్తాల బియ్యం మాకు ఇంటికి వచ్చినా మా తండ్రిగారు " అన్నీ మనవికావు నాయనా " అని బీదసాదలకి చేటలతో పంచేసేవారు.  అన్నీ మనవికావు అనటంలో వున్న వేదార్ధం నాకు పెద్దయితేనేగానీ  అర్ధం కాలేదు !  - ఆత్రేయ గారు

6. అమ్మ చేతి  అన్నం తింటున్నాను అని చెప్పగలిగినవాడు ధన్యుడు !   - చాగంటి కోటే శ్వర రావుగారు7.  ఆకలితో వున్న వాని మాటలకు ఆగ్రహించవద్దు ! - గౌతమ బుద్దుడు

8. ఆత్మీయులతో కలసి తినే భోజనానికి రుచి ఎక్కువ ! చారుకూడా అమృతంలా రుచిస్తుంది ! - మాతా అమృతానందమయి

9. మీ పిల్లలు ఎంతదూరంలో,  ఎక్కడవున్నా , వేళపట్టున ఇంత అన్నం తినగలుగుతున్నారంటే అది వాళ్ళ గొప్పాకాదూ , మీ గొప్పాకాదు  మీ పూర్వీకుల పుణ్యఫలమే అని  గుర్తించు.   " అన్ని దానము లలో  అన్నదానము మిన్న "

Famous Posts:

పంచముఖ ఆంజనేయ స్వామి వారి అవతార కథ


హనుమ నామస్మరణం సర్వపాప నివారణం


స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?


సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము


శనేశ్వరుడు శనివారాల నోము


శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత

Annam, Parabrahma Swaroopam, annam parabrahma swaroopam meaning, annam parabrahma swaroopam slokam in telugu, annam parabrahma swaroopam in sanskrit, annam parabrahma swaroopam pronunciation, annam parabrahma swaroopam meaning in hindi, annam parabrahma swaroopam meaning in kannada

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS