మహాశివరాత్రి ఎందుకు జరుపుకోవాలి?
హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలలో మహాశివరాత్రి ఒకటి. ఈ రోజే ఆ పరమేశ్వరుడు లింగరూపధారిగా ఆవిర్భవించాడని పురాణాలు, ఇతిహాసాలు పేర్కొంటున్నాయి.
హిందూ క్యాలెండర్ ప్రకారం ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి నాడు మహాశివరాత్రి జరుపుకుంటారు. ఈ ఏడాది మార్చి 1న మహాశివరాత్రి జరుపుకోనున్నారు. అంటే కొన్ని నియమాల్ని మనసులో సంకల్పించుకునే పాటించాలి. ‘హే మహాదేవా! నేను చతుర్దశి రోజు జాగరణ చేస్తాను. నా భక్తి సామర్ధ్యాన్ని బట్టి దాన, తప, హోమాన్ని చేయగలను. నేను ఆ రోజు నిరాహారిగా ఉంటాను. రెండో రోజు మాత్రమే తింటాను. ఆనంద, మోక్షాలను అనుగ్రహించు శివా!’ అని సంకల్పం చేసుకోవాలి.
Also Read : మహాశివరాత్రి విశిష్టత తెలుగు పిడిఎఫ్ బుక్ ఫ్రీ డౌన్లోడ్.
అభిషేక ప్రియుడు శివుడికి ఇష్టమైన రోజు మహాశివరాత్రి. మహాశివుడు లింగాకృతిని పొందిన రోజునే శివరాత్రిగా జరుపుకుంటాం. ఈ పర్వదినం రోజున భక్తి శ్రద్దలతో పరమేశ్వరుడిని పూజిస్తే జీవితంలో సమస్యలు రావని విశ్వసిస్తుంటారు. శివరాత్రి రోజున తెలిసీ తెలియక చేసే కొన్ని పొరపాట్లు దోషాలని కలుగజేస్తాయి. మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండడం, జాగరణ చేయడం అందరికి తెలిసిన విషయాలే. అయితే పూజా చేసే సమయంలో ఏఏ నియమాలను పాటించాలి.. పరమేశ్వరునికి పూజా ఎలా చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం.
"మహాశివరాత్రి" పర్వదినాన ఉదయం ఐదు గంటలకే నిద్రలేచి, శుచిగా తలస్నానం చేసి, పూజా మందిరమును, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గుమ్మానికి తోరణాలు, పూజామందిరాన్ని ముగ్గులు, రకరకాల పుష్పాలతో అలంకరించుకోవాలి. తెలుపు రంగు బట్టలను ధరించి, శివుని పటాలు, లింగాకార ప్రతిమలకు పసుపు కుంకుమలు పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలి.
మహాశివరాత్రి రోజూ పూజా విధానంలో పాటించవలసిన నియమాలు…
> మహా శివరాత్రి రోజున ప్రాతఃకాలాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసి శివాలయాన్ని దర్శించుకోవాలి.
> ముఖ్యంగా శివుడికి పంచామృతాలు, ఆవు పేడ, ఆవు పంచకం, పాలు, పెరుగు, నెయ్యితో అభిషేకం చేయాలి.
> ఈ అభిషేకాలు చేస్తున్నంతసేపు ఓం నమః శివాయ పంచాక్షరీ మంత్రం ఉచ్చరిస్తూనే ఉండాలి.
> ముందుగా చందన లేపనంతో ప్రారంభించి అన్ని ఉపాచారలాతో శివుడిని పూజించి అగ్నిలో నువ్వులు, బియ్యం, నెయ్యితో కలిపిన అన్నం వేయాలి. ఇలా చేసి పుర్ణాహుతి నిర్వహించాలి.
> శివకథలు వింటూ జాగరణ చేయాలి. అలాగే రథరాత్రి మూడు, నాలుగో జాములో మరోసారి ఆహుతులను సమర్పించాలి.
> తెల్లవారి శివ భక్తులకు అన్న వస్త్రాలు, ఛత్రం ధానం చేయాలి. లింగోద్భవం జరిగిన అర్థరాత్రి రోజూ వస్తుంది కాబట్టి ప్రతిరోజూ శివరాత్రే.
> కృష్ణపక్ష చతుర్ధశి శివుడికి ఇష్టమైన రోజు కాబట్టి ప్రతి నెలా వచ్చే రోజును మాస శివరాత్రి అంటారు.
అలాగే మాఘ బహుళ చతుర్ధశినే మహాశివరాత్రిగా జరపుకుంటాం.
> ఇంటి దగ్గరే శివపార్వతులను పుష్పాలు, బిల్వదళాలు, పంచామృతాలతో అభిషేకం చేయాలి.
> ఉపవాస, జాగరణ శివస్మరణలతో ఉండాలి. ఆ మరుసటి రోజు ఉత్తమ విప్రులు, శివభక్తులకు అన్నదానం చేయాలి.
> సూర్యోదయం వరకూ మౌనవ్రతం చేయదలచినవారు ‘ఓం నమః శివాయ’ మంత్రాన్ని మనసులో స్మరిస్తూ ఉండాలి.
మహాశివరాత్రి పూజ మంత్రాలు:
ఈ రోజున మహామృత్న్యుజ్య ,శివ మంత్రాన్ని పఠిస్తారు.
మహామృత్న్యుజయ మంత్రం: 'ఓం త్రయంబకం యజామహే సుగన్ధిం పుష్టివర్ధనమ్.
శివ మంత్రం: ఓం నమః శివాయ'
మీరు అన్ని ఆచారాలతో పూజ చేస్తే, భగవంతుడు మీరు కోరుకున్న కోరికలన్నింటినీ నెరవేరుస్తాడని నమ్ముతారు.
Tags: మహాశివరాత్రి, maha shivaratri 2022, date maha Shivaratri Pooja mahashivratri 2022, india shivratri puja 2022, maha sivaratri