మహాదేవుడికి ఇష్టమైన పుష్పాలు ఏంటో తెలుసా.. ? మహాశివరాత్రి నాడు శివునికి ఈ పుష్పాలతో పూజిస్తే.. జన్మజన్మల పాపాలు తొలగుతాయి...
శివరాత్రి అంటే శివుడు లింగరూపంలో ఉద్భవించినట్లు ఇతిహాసాలు, పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ రోజును శివ భక్తులు అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. శివుడికి అభిషేకాలు, జాగారాలు చేసి ఆయన ఆశీస్సులు పొందుతారు. ప్రతి నెలా బహుళ చతుర్దశి నాడొచ్చేది మాస శివరాత్రి. అయితే.. మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే దానిని శివరాత్రి అంటారు. శివుడి అనుగ్రహం పొందాలంటే మాత్రం శివరాత్రి రోజు మాత్రమే సాధ్యమని భక్తులు భావిస్తారు. అయితే శివుడు అభిషేక ప్రియుడు అంతేకాకుండా ఆయనకు ఇష్టమైన పూలు, పత్రాలతో పూజ చేస్తే జన్మజన్మల పాపాలు తొలగుతాయి.
గరిక ,పారిజాత: గరిక వినాయకుడికి ప్రీతికరమైన పుష్పం , కీర్తిని పెంచుతుంది అని సాధారణంగా చెబుతారు. కానీ పారిజాత పుష్పాలను భోలానాథుడుకి సమర్పించడం ఆరోగ్యకరం.
మారేడు దళాలు : ఇందులో మొదటగా చెప్పుకోవాలంటే మారేడు దళాల గురించి.. ఇవి శివుడికి అత్యంత ప్రీతికరమైన పత్రాలు. వీటిని త్రిమూర్తులకు చిహ్నంగా భావిస్తారని పెద్దలు చెబుతారు. అందుకే శివరాత్రి రోజు తెలిసినవారు మారేడు దళాలతో పూజలు నిర్వహిస్తారు.
శంఖు పుష్పం : శంఖు పుష్పం దేవతల పుష్పంగా పేరు గడించింది. పూలలోనే దీనిని దేవతల పువ్వుగా భావిస్తారు. ఈ పుష్పంతో శివుడిని పూజిస్తే అనుగ్రహిస్తాడని అందరు నమ్ముతారు అందుకే శివరాత్రి రోజు దీనికి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఎంత ధరైనా సరే కొనుగోలు చేయడాని కి భక్తులు వెనుకాడరు.
జిల్లేడు పూలు : జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే తొందరగా కరుణిస్తాడని భక్తుల విశ్వాసం. ఆధ్యాత్మికంగాను ఈ పూలకు చాలా విశిష్టత ఉంటుంది. ఆంజనేయుడికి కూడా ఈ పూలంటే మహా ఇష్టం. శివుడిని పూజించిన ఈ పూలను మహిళలు తలలో పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుందని నమ్మకం.
గన్నేరు పూలు : గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఎందుకంటే గన్నేరు పూలు పసుపురంగులో ఉంటాయి. పసుపు త్యాగానికి చిహ్నం. అందుకే శివుడి ఈ పూలను ఇష్టపడతాడని పురాణాలు చెబుతున్నాయి.
మల్లె పూలు : మల్లెపూలు అందరికి తెలిసిన పూలు. వీటి వాసన మామూలుగా ఉండదు. మహిళలు ఎక్కువగా వీటిని ఇష్టపడతారు. అయితే మహాదేవుడు కూడా ఈ పూలను బాగా ఇష్టపడతాడు. వీటితో శివుడికి అభిషేకం చేస్తే సంతోషం, మానసిక ప్రశాంతత అనుభూతి కలుగుతుంది. ఈ పూల వాసన అంటే అందరికి ఇష్టమే.
సంపెంగ పూలు : ఈ పూలతో శివుడిని అభిషేకిస్తే వారు ఎల్లప్పుడు ఆనందంగా ఉంటారని చెబుతారు. సంపెంగ పూలను దేవతలు బాగా ఇష్టపడతారు. అందుకే మహా శివరాత్రి రోజు ఈ పూలతో శివుడిని పూజిస్తారు.
శమీ, అవిసె పువ్వులు: శమీ, అవిసె పువ్వులు విష్ణువుకి ఇష్టమైన పుష్పాలు. మహాశివరాత్రి రోజున శివలింగం మీద ఈ పూలను సమర్పించడం వ్లల మోక్షాన్ని పొందుతారు.
ఏస్, ధాతురా పువ్వు: ధాతురాపువ్వు శివునికి ప్రీతికరమైనది. అయితే ధాతురా కాకుండా అకండ పుష్పం శివుడిలా ఉంటుంది. దీనిని కిరీటం పుష్పం అంటారు. భక్తులు ఈ పుష్పాన్ని స్వామికి ప్రత్యేకంగా సమర్పిస్తారు. మహాశివరాత్రి రోజున శివలింగంపై ఈ పుష్పాలను సమర్పించడం వల్ల విష ప్రాణుల ఆపద నశిస్తుంది.
Also Read : మహాశివరాత్రి విశిష్టత తెలుగు పిడిఎఫ్ బుక్ ఫ్రీ డౌన్లోడ్.
Also Read : మహాశివరాత్రి రోజూ పూజా విధానంలో పాటించవలసిన నియమాలు…
మహాశివరాత్రి, maha shivaratri 2022, maha shivaratri 2022 in india, maha shivaratri 2021, maha shivaratri story in telugu, maha shivaratri story, maha shivaratri 2026, maha shivaratri story in hindi, maha shivaratri 2022 tamil calendar, shiva pooja