ఆరోగ్యం కోసం అగ్నిహోత్రం:
ప్రియమైన భారతీయులారా మీరంతా క్రింద చెప్పబోయే విషయాలను శ్రద్ధగా చదివి అగ్నిహోత్రంలోని శాస్ర్తీయత ను అర్థం చేసుకొని తక్షణమే ఆచరించి ఆరోగ్యంగా ఉండండి.
ఈ అగ్నిహోత్రం వైదికం ,ఆయుర్వేదం రెండింటి లో కలదు.
ప్రస్తుతం ఇక్కడ ఆయుర్వేదంకి సంబంధించిన అగ్నిహోత్రం తెలియజేస్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం
అగ్నిహోత్రంకి కావాల్సిన మూలికలు
1 తులసి
2 వేపాకులు,కాయలు ,కాడలు
3 అంజీర్ పండు
4 మర్రి
5 రావి
6 అక్కరకర్ర
7 అక్రోట్ పండు
8 ఉత్తరేణిసమూలం
9 ఉసిరికాయ
10 కరక్కాయ
11 గుంటగలగరసమూలం
12 జాజికాయ ,జాపత్రి
13 కలగందగుజ్జు
14 కానుగాకులు ,కాయలు
15 తుంగగడ్డలు
16 మేడి
17 దాల్చిన చెక్క
18 గుగ్గిలం
19 మోదుగ
20 చండ్రచెక్క
21 చిత్రమూలం
22 జిల్లేడు సమూలం
23 నేల ఉసిరిసమూలం
24 అతిబల సమూలం
25 తెల్లగల్లి జేరుసమూలం
26 నేలతాడి
27 తిప్పతీగ
28 పచ్చకర్పూరం
29 పుష్కర మూలం
30 మాచిపత్రి
31 మారేడు
32 లవంగాలు
33 గరికసమూలం
34 శంఖపుష్పిసమూలం
35 సొంఠి
36 సదాప సమూలం
37 కొండపిండి సమూలం
38 బాదంపప్పు
39 సోంపుగింజలు
40 బోడతరం సమూలం
41 నేరేడుఆకులు ,కాడలు
42 రెడ్డివారినానుబాలు సమూలం
43 బ్రహ్మదండి సమూలం
44 ఆకుపత్రి
45 అడ్డసరం సమూలం
46 వసకొమ్ములు
47 సీమ అవిసి గింజలు
48 త్రిఫలాలు
49 కామంచి సమూలం
50 కటుకరోహిణి
51 సరస్వతి
52 మిరియాలు
53 మందారపూలు
54 పాలసుగంధివేర్లు
55 గసగసాలు
56 అతిమధురం
57 పిప్పళ్ళు
58 పిప్పింటాకు సమూలం
59 మునగాకు ,పూలు ,కాడలు
60 ఆముదంచెట్టు సమూలం
61 నవధాన్యాలు
62 ధర్బ
63 గరిక
పైన 63 రకాలలో మీకు దొరికినవాటితో సరిపెట్టుకొని కచ్చాపచ్చాగా నలగ్గొట్టి ,ఆరబెట్టి ఆ తరువాత చూరలాగా దంచి ఒకడబ్బాలో నిలువచేసుకోండి.
రోజు ఉదయం సూర్యోదయానికి పావుగంట ముందు మరియు సాయంత్రం సూర్యాస్తమయానికి పావుగంట ముందు ఈ అగ్నిహోత్ర ప్రక్రియను ఆచరించాలి .రాగి లేదా మట్టితో చేయబడిన అగ్నిహోత్ర పాత్రలో ఒక ఆవుపిడకను నాలుగు ముక్కలుగా చేసి పెట్టి వాటి పైన కర్పూరముంచి వెలిగించి వుంచాలి.అదికొద్ది సేపటికి నిప్పుగా మారుతుంది.
అప్పుడు అగ్నిహోత్రం చుట్టూ కూర్చోని ఆ పాత్రలో ముందుగానే సిద్ధం చేసుకున్న పై మూలికల చూరపొడిని తగినంత వేసి దానిపైన రెండు మూడు చెంచాల ఆవునేతిని ఆహుతిగా ఇవ్వాలి .ఇలా ఐదు నిమిషాలు కు లేదా పదినిమిషాలకు ఒకసారి మూలికలపొడిని ,ఆవునేతిని అందులో వేస్తూ ఆ పాత్రనుండి వెలువడే ప్రాణశక్తిరూపమైన ధూపాన్ని పీల్చుకొంటూ ఉండాలి. ఈ ప్రక్రియ కనీసం అరగంట పాటు జరగాలి.
అగ్నిహోత్రం వల్ల ఉపయోగాలు:
ఆవుపిడకల నిప్పులో ఆవునేతిని ,మూలికలను వేసినప్పుడు ఆ మూలికల్లోని ఔషధ శక్తి ఆవునేతిలోని ప్రాణశక్తి ఈ రెండు కలగలిసి పొగరూపంలో ఒకేసారి బయటకు వచ్చి పరిసరాలనిండా పరచుకుంటాయ్.
ఆ ప్రాణధూపం ఆ ప్రాంతమంతా నిండివుండటంవల్ల అక్కడున్న మనుషులు సహజంగానే ఆ ప్రాణవాయువులను లోపలికి పీల్చుకోవడం జరుగుతుంది. రెప్పపాటుకాలంలో ఇన్నిరకాల మూలికలశక్తి శరీరంలో ప్రవేశించి ఆయా అవయవాలలోని వ్యర్థ్య పదార్థాలను తొలగించి శుద్ధి చేయడంద్వారా అన్నిరకాల వ్యాధులు క్రమంగా హరించిపోయి పూర్తి ఆరోగ్యం చేకూరుతుంది.
అగ్నిహోత్రం విద్యార్థులకు ఎన్నో_ప్రయోజనాలు :
చెప్పిన విధంగా అగ్నిహోత్రం కొనసాగిస్తుంటే విద్యార్థుల్లో బుద్ధి మాంద్యం ,బుద్ధి హీనత ,మొండి తనం ,మొరటుతనం ,మూర్ఖత్వం ,శారీరక బలహీనత ,చచ్చుదనం ,నిరాశనిస్పృహలు క్రమంగా హరించిపోయి అపారమైన ప్రజ్ఞ ,ధారణశక్తి ,దేహశక్తి ,సౌందర్యం ,సత్ప్రవర్తన, సౌజన్య స్వభావంసంతరించుకుంటయ్
అగ్నిమీళే పురోహితం ... ఋగ్వేదే ప్రథమం మండలమ్ - ప్రథమోஉష్టకః - ప్రథమోஉధ్యాయః అనువాకః -1 , సూక్తమ్ - 1
ఆర్యులారా! అగ్ని సూక్తమును వినండి, చదవండి, భావాన్ని తెలుసుకోండి.
ఋక్ అనే శబ్దానికి స్తుతి అని అర్ధము. దేనిచేత దేవత స్తుతింపబడునో అదియే ఋక్. యజ్ఞాల నిర్వహణము కోసము ఏర్పడిన ఋక్కులు అనేక చోట్ల ఉన్న వాటిని ఒకే చోట చేర్చి, కూర్చ బడిన కూర్పుల సమూహనే ఋక్సంహిత అందురు. ఋక్ అనగా వృత్త బంధం, పాద బంధముతో అర్ధ యుక్తముగా ఉన్నటువంటి ''మంత్రము'' అని అర్ధము.
ఋగ్వేదం యొక్క మొదటి మండల పరిచ్ఛేదం లో 191 శ్లోకాలు ఉన్నాయి. విదేశీయుల ప్రకారము 3,500 సం.లు పూర్వం ఈ ఋక్సంహిత రచింప బడినదని అభిప్రాయము. కాని భారతీయుల సంప్రదాయమును అనుసరించి, నిత్యము, సత్యము అయిన ఈ శబ్దరాశి మంత్రద్రష్ట లయిన మహర్షులకు దృగ్గోచరమయినది మాత్రమే కాని వారు మంత్ర రచయితలుగా ఉండి రచించినది మాత్రము కాదు. ఈ ఋక్సంహిత అగ్నిమీడే పురోహితం అను అగ్ని సూక్తం తో ప్రారంభమవుతుంది. మరియు సమానీవ ఆకూతి: అనే సంజ్ఞాన మంత్రముతో పూర్తి అవుతుంది.
చక్రబంధ అగ్నిసూక్తమ్.
ఋగ్వేదే ప్రథమం మండలమ్ - ప్రథమోஉష్టకః - ప్రథమోஉధ్యాయః అనువాకః -1 , సూక్తమ్ - 1
ఋషిః-మధుచ్ఛందా వైశ్వామిత్రః దేవతా : అగ్నిః, ఛన్దః గాయత్రీ ( ఈ అగ్ని సూక్తం ఋగ్వేదం సంబందించినది కావున స్వరాని బట్టి పలకాల్సి ఉంటుంది || దీర్ఘస్వరం _ దత్తం |అనుదత్తం )
౧. అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజమ్ | హోతారం రత్నధాతమమ్ ||
ప్రతిపదార్థము. అగ్నిం = అగ్నిని; పురోహితం = పురోహితుడిని; యజ్ఞస్యదేవం = (జీవన) యజ్ఞాన్ని ప్రకాశింపచేసేవానిని; ఋత్విజమ్ = ఋత్విక్కును; హోతారమ్ = హోతను ( దేవతాశక్తులను ఆహ్వానించే ఋత్విక్కును); రత్నధాతమమ్ = (జీవన యజ్ఞక్రియారూపం ద్వారా వచ్చే) ధర్మ, జ్ఞానరత్నాలతో పోషించేవాణ్ణి; ఈళే = నేను ప్రస్తుతిస్తాను, మనసా ప్రార్థిస్తాను.
భావము. అగ్నిని; పురోహితుడిని; (జీవన) యజ్ఞాన్ని ప్రకాశింపచేసేవానిని; ఋత్విక్కును; హోతను ( దేవతాశక్తులను ఆహ్వానించే ఋత్విక్కును); (జీవన యజ్ఞక్రియారూపం ద్వారా వచ్చే) ధర్మ, జ్ఞానరత్నాలతో పోషించేవానిని; నేను ప్రస్తుతిస్తాను, మనసా ప్రార్థిస్తాను.
ఆ. అగ్నిని, పురహితుని, యజ్ఞప్రకాశకు,
నసమ ఋత్విజుని విలసిత హోత
నఖిల ధర్మ జ్ఞాన మమరించి పోషించు
యనిలసఖుని గొలుతు ననుపమగతి.
౨. అగ్ని: పూర్వేభిర్ ఋషి భిరీడ్యో నూతనై రుత !
సదేవాన్ ఏమ వక్షతి !!
ప్రతిపదార్థము. అగ్ని: = అగ్ని; పూర్వేభి: ఋషిభీ: = పూర్వీకులైన ఋషులచేత; ఉత = అంతేగాక; నూతనై: = ఈ కాలపు ఋషులచేత కూడా; ఈడ్య: = పొగడ్తనంద దగినవాడు; స: = ఆ అగ్నిదేవుడు; దేవాన్ = (సృష్టిలోని) దేవతాశక్తులను; ఇహ = ఇక్కడకు (ఈ జీవన యజ్ఞానికి); ఆవక్షతి = తీసుకొని రావాలి (అని ఆకాంక్ష).
భావము. అగ్ని; పూర్వీకులైన ఋషులచేత; అంతేగాక; ఈ కాలపు ఋషులచేత కూడా; పొగడ్తనంద దగినవాడు; ఆ అగ్నిదేవుడ; (సృష్టిలోని) దేవతాశక్తులను; ఇక్కడకు (ఈ జీవన యజ్ఞానికి); తీసుకొని రావాలి (అని ఆకాంక్ష).
ఆ. అగ్నిపూర్వ ఋషులు నంతియె కాక యా
ధునిక ఋషుల చేత వినుతయోగ్యు
డట్టి యగ్ని యిచట నమర శక్తులనెల్ల
నమరఁజేయ వలతు యజ్ఞమునకు.
౩. అగ్ని నా రయిమశ్నవత్ పోషమేవ దివే దివే !
యశసం వీర వత్తమమ్ !!
ప్రతిపదార్థము. అగ్నినా = అగ్ని ద్వారా; దివే దివే = ప్రతిరోజూ; పోషం ఏవ = పుష్టినిస్తూ వికాసాన్ని అందించే, వీరవత్ తమం యశసం = విక్రాంతివంతమైన, లేక అతిశయ శక్తి వంతులకు తగిన కీర్తిని కలుఁగజేసే; రయిం = (పుష్టిరూప) యశోరూప ధనాన్ని, అశ్నవత్ = (సాధకుడు) పొందుతాడు.
భావము. అగ్ని ద్వారా; ప్రతిరోజూ; పుష్టినిస్తూ వికాసాన్ని అందించే, విక్రాంతివంతమైన, అతిశయ శక్తి వంతులకు తగిన కీర్తిని కలుఁగజేసే; (పుష్టిరూప) యశోరూప; ధనాన్ని, (సాధకుడు) పొందుతాడు;
గీ. దినదినంబున పుష్టినందించి వృద్ధి
నందఁజేయు విక్రాంతుల కధిక కీర్తి
కలుఁగ చేయు యశోధనములను బడయు
నగ్ని మూలాన సాధకుఁ డసదృశముగ .
౪. అగ్నేయం యజ్ఞ మధ్వరం విశ్వత: పరిభూరసి !
స ఇద్దేవేషు గచ్ఛతి !!
ప్రతిపదార్థము. అగ్నీ = హే అగ్నీ, యం యజ్ఞం, అధ్వరం విశ్వత: పరిభూ: అసి = జయాపజయ భావోద్యేగ హింసకు అతీతమైన ఏ సాధనా (క్రియా) యజ్ఞమార్గాన్ని నువ్వు అన్ని వైపులా, చుట్టూ ఉండి (అప్రమత్తంగా పర్యవేక్షిస్తూ) ఉంటావో; స: ఇత్ = ఆ క్రియా యజ్ఞమే; దేవేషు గచ్ఛతి = దేవతల పరిగణనలోనికి చేర గలదు. దానినే మహాత్ములు మెచ్చకుంటారు.
భావము. హే అగ్నీ, జయాపజయ భావోద్యేగ హింసకు అతీతమైన ఏ సాధనా (క్రియా) యజ్ఞమార్గాన్ని నువ్వు అన్ని వైపులా, చుట్టూ ఉండి (అప్రమత్తంగా పర్యవేక్షిస్తూ) ఉంటావో; ఆ క్రియా యజ్ఞమే; దేవతల పరిగణనలోనికి చేర గలదు, దానినే మహాత్ములు మెచ్చకుంటారు.
గీ. జయమునపజయంబను భావచయము మీరి,
సాధనా యజ్ఞ మార్గ సద్బోధ కలిగి
అన్నివైపులనుందువీ వప్రమత్త
తను నదియె యజ్ఞమనిమెత్తు రనిమిషులును.
౫. అగ్నిర్ హోతా కవిక్రతు: సత్యశ్చిత్ర శ్రవస్తమ: !
దేవో దేవేభి రాగమత్ !!
ప్రతిపదార్థము. హోతా = జ్ఞాన విజ్ఞాన దాతలైన దేవతాశక్తులను పిలిచేవాడు; కవిక్రతు: = కవిలాగా సృజనాత్మక శక్తితోనూ, ఉపజ్ఞతోనూ, సాధన క్రియలను నిర్వహించేవాడు; సత్య: = ఎల్లప్పుడూ మార్పుకు అతీతంగా వుండేవాడు; చిత్రశ్రవ: తమ: = కంటికి చిత్రమైన కాంతిశక్తినీ, చెవికి చిత్రమైన నాద శక్తినీ అతిశయంగా అందించేవాడు. వైవిధ్యమైన చిత్ర ధ్వని చిత్రాలకు గొప్ప నెలవు అని పేరెన్నిక గన్నవాడు; అగ్ని: దేవ: = అటువంటి అగ్నిదేవుడు; దేవేభి: ఆగమత్ = తనసాటి దైవీశక్తులతో సహా రావాలి.
భావము. జ్ఞానవిజ్ఞాన దాతలైన దేవతాశక్తులను పిలిచేవాడు; కవిలాగా సృజనాత్మక శక్తితోనూ, ఉపజ్ఞతోనూ, సాధన క్రియలను నిర్వహించేవాడు; ఎల్లప్పుడూ మార్పుకు అతీతంగా వుండేవాడు; కంటికి చిత్రమైన కాంతిశక్తినీ, చెవికి చిత్రమైన నాద శక్తినీ అతిశయంగా అందించేవాడు. వైవిధ్యమైన చిత్ర ధ్వని చిత్రాలకు గొప్ప నెలవు అని పేరెన్నిక గన్నవాడు; అటువంటి అగ్నిదేవుడు; తనసాటి దైవీశక్తులతో సహా రావాలి..
గీ. తలచి జ్ఞానద దేవాళిఁ బిలుచువాఁడు
విసృజనోపజ్ఞసాధనన్వెలుగు క్రియలు
చేయువాఁడును, మార్పులే చేరనతఁడు.
కనులకు విచిత్ర కాంతిని కలుగఁజేసి,
చెవులకు విచిత్ర నాద సచ్ఛ్రీ స్వశక్తి
కలుగఁ జేసెడి వాడును, ఘనతరమగు
వివిధ సచ్చిత్ర, ధ్వని చిత్ర నివహమనగ
పేరుఁ గన్నట్టి వాఁడగ్నిదేవుఁడిపుడు
తనకు సాటైన దేవతాతతులతోడ
వచ్చుగాత నా కడకు తా మెచ్చుగాను.
౬. యదఙ్గ దాశుషే త్వ మగ్నే భద్రం కరిష్యసి !
తవేత్తత్ సత్యమఙ్గిర: !!
ప్రతిపదార్థము. అంగ అగ్నే! అంగిర: = చూడు అగ్ని! (దావాగ్ని అంగారాల్లాగా కోరికలను కాల్చిశమింపజేసే) అంగిరుడా!; త్వం = నువ్వు; దాశుషే = తాను చేసే కర్మలనన్నింటినీ భగవత్సమర్పణం చేసేవాడికి; యత్ భద్రం కరిష్యసి = ఏ సుఖ కల్యాణాలను కలిగిస్తావో; తవ ఇత్ = అది నీదే, నీకు తగినదే; తత్ సత్యం = ఇది ముమ్మాటికీ నిజము.
భావము. చూడు అగ్నీ! ( దావాగ్ని అంగారాల్లాగా కోరికలను కాల్చిశమింపజేసే ) అంగిరుడా! నువ్వు ‘తాను చేసే కర్మలనన్నింటినీ భగవత్సమర్పణం చేసేవాడికి’ ఏ సుఖ కల్యాణాలను కలిగిస్తావో;
అది నీదే, నీకు తగినదే; ఇది ముమ్మాటికీ నిజము.
గీ. చూడుమగ్ని! యంగిరుఁడా! వసుంధరపయి
తాను చేసెడి కర్మలఁ దక్కు ఫలము
భగవదర్పణ చేసెడిభక్తులకిల
నెట్టి కల్యాణములుగూర్తు వట్టివెల్ల
నీవి. నీకిది తగునయ్య. నిజము నిజము.
౭. ఉపత్వాగ్నే దివే దివే దోషావస్తర్ ధియా వయం !
నమో భరన్త ఏమసి !!
ప్రతిపదార్థము. అగ్నే = హే అగ్నీ; వయం = సాధకులమైన మేము; దివే దివే దోషావస్త: = ప్రతీరోజూ రాత్రీ పగలూ; ధియా = బుద్ధిపూర్వకంగా చేసే కర్మలను; నమో భరన్త: = నమస్సులతో నింపుతూ (కర్మలను అణుకువతో చేస్తూ); ఉప, త్వా, ఆ ఇమసి = నీ దగ్గరకు చేరుతున్నాము.
భావము. హే అగ్నీ! సాధకులమైన మేము; ప్రతీరోజూ రాత్రీ పగలూ; బుద్ధిపూర్వకంగా చేసే కర్మలను; నమస్సులతో నింపుతూ (కర్మలను అణుకువతో చేస్తూ); నీ దగ్గరకు చేరుతున్నాము.
గీ. అగ్నిహోత్రుఁడ! రేబవలనితరమగు
సాధకులమైన మేము సద్బోధఁ జేసి
యోచనను చేయు కర్మలనొప్ప, వంద
నముల నింపుచు, నిన్ జేరుదుమయ! కనుమ!
౮. రాజన్త మధ్వరాణాం గోపామృతస్యదీదివిమ్ !
వర్ధమానంస్వే దమే !!
ప్రతిపదార్థము. (ఓ అగ్ని) రాజన్తం = దేదీప్యమానంగా వెలుగుతున్న; అధ్వరాణాం = ఫలాసక్తి అన్న హింసను బహిష్కరించిన యజ్ఞ మార్గాలను; గోపాం = సంరక్షిచేవాడివీ; ఋతస్య = విశ్వనియమాన్ని; దీదివిమ్ = బాగా ప్రకాశింపజేసేవాడివీ; స్వే, దమే, వర్ధమానం = నిగృహీతమైన, క్రమశిక్షణాయుక్తమైన, సాక్షాత్తూ తనదే అయిన సాధన శరీర గృహంలో వర్ధిల్లుతున్నవాడివీ; ( నువ్వు )
భావము. ఓ అగ్నీ! దేదీప్యమానంగా వెలుగుతున్న; ఫలాసక్తి అన్న హింసను బహిష్కరించిన యజ్ఞ మార్గాలను సంరక్షిచేవాడివీ; విశ్వనియమాన్ని బాగా ప్రకాశింపజేసేవాడివీ; నిగృహీతమైన, క్రమశిక్షణాయుక్తమైన, సాక్షాత్తూ తనదే అయిన సాధన శరీర గృహంలో వర్ధిల్లుతున్నవాడవీ నువ్వు.
గీ. పృథు! ఫలాసక్తియన్ హింస విడుచునట్టి
యజ్ఞ దేదీప్యమార్గాలు ప్రజ్ఞఁ గాచు
వాఁడవును, విశ్వనియమమ్మువరలఁ జేయు
వాడవు, నిగృహీతమయిన, వరలునట్టి
క్రమ సుశిక్షణాయుతమైన తమదెయైన
సాధనశరీర గృహమున మోదమొప్ప
వరలు చున్నట్టివాఁడవు నిరుపమముగ,
వందనము సేతు కృపతోడనందుకొనుము.
౯. స న: పితేవ సూనవేఁ గ్నే సూపాయనోభవ
సచస్వా న: స్వస్తయే !!
ప్రతిపదార్థము. పితా ఇవ = తండ్రి వలె (సులువుగా చేరదగిన వాడయినట్టు); సు ఉపాయనోభవ = సులువుగా దరిచేరనిచ్చే వాడివి అగుము; న: = మేము, మమ్మల్ని; స్వస్తయే సచస్వా = భద్రంగా వుండేలాగా మాతో కలిసి వుండుము.
భావము. తండ్రివలె సులువుగా దరిచేరనిచ్చే వాడివి అగుము. మేము భద్రంగా వుండేలాగా మాతో కలిసి వుండుము.
గీ. తండ్రివలె మమ్ము సులువుగా దరికిఁ జేర
నిమ్ము. మేము భద్రమ్ముగా యిమ్ముతోడ
నుండ మాతోడ నీవిల నుండుమయ్య.
రామకృష్ణను మన్నించి ప్రేమఁ గనుము.
Famous Posts:
> పంచముఖ ఆంజనేయ స్వామి వారి అవతార కథ
> హనుమ నామస్మరణం సర్వపాప నివారణం
> స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?
> సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము
> శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత
Agnihotra & Homa Therapy information, agnihotra mantra, agnihotra kit
how to perform agnihotra, agnihotra benefits, agnihotra timings, agnihotra side effects, agnihotra mantra pdf, who can perform agnihotra, health tips