కొత్తగా వారణాసి వెళ్లేవారికి సూచనలు : వారణాసి వెళ్ళే వాళ్ళు ట్రైన్ దిగిన తర్వాత ఆంధ్ర ఆశ్రమాలు చాలా ఉన్నాయి,సైకిల్ స్వామి ఆశ్రమంలో ఐతే మనిషికి 300నుంచి ఛార్జ్ చేస్తారు,తారక రామ ఆశ్రమంలో ఐతే రూం కి 150నుంచి మన కన్వీనెంట్ బట్టి ఛార్జ్ చేస్తారు ఎక్స్ట్రా మనిషికి 20ఛార్జ్ చేస్తారు మధ్యాహ్నం భోజనం,ఈవెనింగ్ అల్పాహారం ఉంటుంది.
ఆశ్రమానికి వెళ్లిన తర్వాత ఉదయం 6గ" మీరు బయటకి వచ్చి మొదటగా కాల భైరవ స్వామి దర్శనం చేసుకొని అక్కడ నుంచి వరహి అమ్మ దర్శనానికి వెళ్ళండి ఉదయం 9గంటలలోపే వారాహి అమ్మ దర్శనం ,ఆ తర్వాత అమ్మ దర్శనం ఉండదు ,వారాహి అమ్మ గ్రామ దేవత ,అక్కడ నుంచి విశాలాక్షి అమ్మ గుడి దగరలో ఉంటుంది అమ్మ దర్శనం చేసుకొని ,విశాలాక్షి అమ్మ గుడి దగర నుంచి విశ్వనాథుని గుడికి 2 నిముషాలలో కాలి నడకన వెళ్లొచ్చు ,1వ నంబర్ గేట్ నుంచి వెల్లినట్లైతే సాక్షి గణపతి నీ దర్శించుకోవచ్చు, డుంది గణపతి గుడి లోపల ఉంటుంది ,స్వామి వారి దర్శనం 4వ నంబర్ గేట్ నుంచి త్వరగా అవుతుంది ,స్వామి దర్శనం చేసుకొని వచ్చాక లోపల అన్నపూర్ణమ్మ అమ్మ దర్శన్ చేసుకోవచ్చు ,అక్కడ పూజారికి 100 ఇస్తే అమ్మ వారిని తకనిస్తారు,అన్నపూర్ణమ్మ గుడి లోపలి నుంచి అన్నప్రసదనికి దారి ఉంటుంది.
కచ్చితంగా అక్కడ భోజనం చేయాలి,గుడిలో మనకి అమ్మ ప్రసాదంగా ఒక కౌన్,కొంచెం బియ్యం ఇస్తారు ,100 ర్స్ ఇవమంతరు మన్న 50రస్ ఇచ్చిన కొందరు తీసుకుంటారు,ఆ కాసు మన ఇంట్లోనే బీరువాలో పెట్టుకోవాలి,బియ్యం మన ఇంట్లో మనం తెచుక్కున బియ్యం బస్తలలో కొంచ్ వేసుకొని మిగతాది బీరువాలో దాచుకోవాలి.ఫోన్స్,వాల్లెట్స్ అనుమతించరు ,ఒకవేళ తీసుకు వెళ్తే 4 వ నంబర్ గేట్ దగర దేవస్థానం వారి ఫ్రీ లాకర్ ఉంటుంది అక్కడ పెట్టుకోవచ్చు.సాయంత్రం 6తో7 స్పర్శ దర్శనం ఉంటుంది,7 కి హారతి సేవ ఉంటుంది,స్వామి దర్శనం ఆదివారాలు,సోమవారాలు బాగా రద్దీ గా ఉంటుంది .
దర్శనాలు ఐపోయాక మధ్యాహ్నం 1 నుంచి లోకల్ టెంపుల్స్ మాట్లాడుకొని అన్ని చూసుకోండి ,దుర్గ అమ్మ గుడి,గవ్వలమ్మ,మది మందిర,బెనారుస్ యూనివర్సిటీలో టెంపుల్స్,హనుమాన్ టెంపుల్ ఇవన్నీ లోకల్ టెంపుల్స్ కి మనం మాట్లాడుకునే ఆటో వాళ్ళు చూపిస్తారు మనిషికి 300వరకు ఛార్జ్ చేస్తారు.అవి అన్నీ మీరు చూసుకునే సరికి సాయంత్రం 6 అవ్తుంది,అక్కడ కు దగ్గర్లో ఉండే ఏదైనా ఘాట్ లలో గంగ హారతి చూసుకోండి ,దశాశ్వమేధ ఘాట్,కేదార్నాథ్ ఘాట్ ఆశ్రమానికి దగ్గర్లోనే ఉంటాయి.
రెండవ రోజు ఘాట్లలో స్నానాలు చేసి పడవలు మాట్లాడుకుంది 64 ఘాట్లు వెళ్ళటానికి,12గంటలకి మణికర్ణిక ఘాట్ లో స్నానాలు చేయండి,దయచేసి ఎవరు తల మెడ నీళ్ళు చిలకరించాలి రాకండి ,మణికర్ణిక ఘట్లో స్నానాలు చేస్తే మన పితృ దేవతలకి మోక్షం లభిస్తుంది అంటారు,స్నానం చేసే సమయంలో మనం మనసులోని కోరికలు నెరవేరుతాయి అంటారు.మణికర్ణిక ఘాట్ విశ్వనాథ గుడి 4వ నంబర్ గేట్ నుంచి కొంచెం ముందుకి నడుస్తూ వెళ్తే కుడి చేతి వైపు పెద్ద అర్చ్ కనిపిస్తుంది దనిలోనుంచి నడుచు కుంటు వెళ్తే ఘాట్ కి వెళ్తాం .దాదాపు ఘాట్ అన్ని పక్క పక్కనే ఉంటాయి.
వీలైతే కాలభైరవ టెంపుల్ నుంచి వచేపుడు మహా మృత్యుంజయ గుడి,ఓంకారేశ్వర మకరేశ్వర్,ఆకరేశ్వర గుడులు చూసుకోండి . జంగం బాడీ మఠం దాటాక తిలబందేశ్వర్ గుడి ఉంటుంది .
కుదిరితే లోలార్కు కుండ్ చూసుకోండి మన హిందువులు అక్కడ ఎక్కువగా పుణ్య స్నానాలు ఆచరిస్తారు ,సూర్య భగవానుడు గుడి చిన్న గుడులు అక్కడ పక్కనే ఉంటుంది దర్శనం చేసుకోండి తర్వాత శివుని దర్శనం చేసుకోండి.
Famous Posts:
> కాకికి అన్నం ఎందుకు పెట్టడం ?
> మీకు ఏదైనా సమస్య ఉందా అయితే వెంటనే ఈ స్వామి వారికి ఉత్తరం రాయండి
> సంతానం కోరుకునే వారికీ కచ్చితమైన పరిష్కార మార్గం
> మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి.
> భస్మధారణ అంటే ఏమిటి? దాని వల్ల కలిగే లాభాలు ఏంటి?
> మహాభారతం నుండి నేరచుకోవలసిన 12 ముఖ్యమైన విషయాలు.
> భారతీయులు ప్రతి ఒక్కరూ తెలుసుకోదగినవి అద్భుతమైన దేవాలయలు
కాశీ యాత్ర, కాశీ, Varanasi Tour Packages, Varanasi, about kashi in telugu, varanasi telugu guide, kasi yatra in telugu pdf, varanasi telugu satram, kashi yatra package