బదరీనాథ్, యమునోత్రీ, గంగోత్రి, కేథరీనాథ్ లను కలిపి మినీ ఛార్ ధామ్ యాత్ర అని పిలుస్తారు. వీటిని సందర్శించుకున్నా చేసిన తప్పులన్నీ పోయి నేరుగా స్వర్గానికి పోతామని చెబుతారు. ఆధ్యాత్మికతకు ప్రతీక అయిన ఈ యాత్ర సుమారు 12,000 అడుగుల ఎత్తులో ఇరుకైన దారుల వెంట సుమారు 10 రోజుల పాటు సాగుతుంది. ప్రతి ఏటా మే నుంచి దీపావళి మర్నాడు వచ్చే యమద్వితీయ వరకు ఆరు నెలలు మాత్రమే ఈ ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయి. మిగతా ఆరు నెలల కాలం అక్కడంతా మంచుకప్పేసి ఉంటుంది.
1. గంగోత్రి
భగీరథుడు శివుడి గురించి ఘోర తపస్సు చేసి గంగను భూమి పైకి దింపిన ప్రదేశాన్నే గంగోత్రి అని అంటారు. ఇక్కడ గంగానదిని భాగీరథి పేరుతో పిలుస్తారు. గంగానదిని భూమి పైకి తీసుకురావడానికి భాగీరథుడు కారణం కావున ఆ పేరు వచ్చింది. హరిద్వార్, రిషికేష్ తోపాటు డెహరడూన్ నుంచి ఒక రోజు ప్రయాణం చేసి గంగోత్రిని చేరుకోవచ్చు.
2. గోముఖ్
ఇక గంగోత్రికి 40 కిలోమీటర్ల దూరంలో గోముఖ్ అనే ప్రాంతం ఉంది. ఇక్కడే గంగాదేవి జన్మస్థలం అని చెబుతారు. ఇక్కడకు వెళ్లాలంటే భారత రక్షణశాఖ అనుమతి అవసరం. అందువల్ల చాలా మంది గంగోత్రి వద్దకు వెళ్లి అక్కడ నుంచే వెనుతిరుగుతారు.
3. భవిష్య బద్రీ దేవాలయం
ఇక్కడకు దగ్గర్లో భవిష్య బద్రీ దేవాలయం ఉంది. ఇది జోషి మఠానికి 17 కిలోమీటర్ల దూరంలో తపోవనం దగ్గరగా ఉంటుంది. ఇక్కడ నరసింహస్వామి కొలువై ఉంటాడు. భవిష్యత్తులో ఛార్ ధామ్ లో ఒకటైన బద్రీనాథ్ చేరుకోలేని పరిస్థితి వస్తుందని అప్పుడు విష్ణుమూర్తి ఈ దేవాలయంలోనే కొలువవుతాడని ఇక్కడి పూజారులు చెబుతున్నారు. అందువల్లే ఈ దేవాలయానికి భవిష్య బద్రీ దేవాలయం అనే పేరు వచ్చింది.
4. యమునోత్రీ
యమునా నది జన్మస్థలమే యమునోత్రి. ఇది కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. యమునోత్రీ జన్మించిన చోటునే యమునా దేవి ఆలయం ఉంది. ఆలయం చేరుకోవడానికి హనుమాన్ చెట్టి, జానకి చెట్టి వరకూ వ్యానులు వెలుతాయి. అక్కడి నుంచి గుర్రం, డోలీ, బుట్ట, లేదా కలినడకన సుమారు 12 కిలోమీటర్లు ప్రయాణం చేసి యమునోత్రీ చేరుకోవచ్చు.
5. 10 అడుగుల వెడల్పు మాత్రమే
నడక దారిలో ఒక్కోచోటు 10 అడుగుల వెడల్పు మాత్రమే ఉంటుంది. ఒక వైపు వందల అడుగుల ఎతైన పర్వతప్రాంతాలు, మరో వైపు ఐదారు వందల అడుగుల లోతైన లోయ ప్రాంతాలు ఉంటుంది. ఈ రెండింటి నడుమ ప్రవహించే యమునా నది అందాలను కన్నులతో చూడాల్సిందే తప్పిస్తే వర్ణించడానికి వీలు కాదు.
6. వేడి నీటి గుండాల్లోయమునా దేవి
గుడి ముందు ఉన్న వేడి నీటి గుండాల్లో యాత్రికులు స్నానం చేసి యమునా దేవిని దర్శించుకుంటారు. గర్భగుడిలో యమునా, సరస్వతి, గంగా దేవి మూర్తులు ఉంటాయి. దేవతల దర్శనం తర్వాత యాత్రికులు ఆలయం పక్కన ఉన్న చిన్న ఉష్ణ గుండాల్లో చిన్న బియ్యం, ఆలు మూడలను దారానికి కట్టి లోపలికి వదులుతారు.
7. నైవేద్యంగా
ఆ వేడికి అవి బాగా ఉడికి పోతాయి. వీటిని దేవతను నైవేద్యంగా పెడుతారు. తర్వాత యాత్రికులు నదీమతల్లికి పూజలు చేసి నదీ జలాన్నే తీర్థంగా తీసుకుంటారు. నదిలో పూలు, దీపం తదితరాలను వదిలి తమ మొక్కును తీర్చుకుంటారు.
8. నర నారాయణ కొండల మధ్య
బద్రీనాథ్ ఉత్తరాఖండ్ లోనే చమోలి జిల్లాలో ఉంది. నర నారాయణ కొండల వరుసల మధ్య నీలఖంఠ శిఖరానికి దిగువ భాగంలో ఉంది. బద్రీనాథ్ రుషికేష్కు ఉత్తర భాగంలో 301 కిలోమీర్ల దూరంలో ఉంటుంది. అదే విధంగా గౌరీ కుండ్ కు 233 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
9. అందుకే ఆ పేరు
బద్రీ అంటే రేగు పండు నాథ్ అంటే దేవుడు. ఇక్కడ రేగుపండ్లు విస్తారంగా పండటం వల్ల ఇక్కడ వెలిసిన దేవుడికి బద్రీనాథుడు అనే పేరు వచ్చినట్లు చెబుతారు. మరో కథనం ప్రకారం కృష్ణావతారానికి ముందు మహావిష్ణువు నారాయణ మునిగాను అర్జునుడు నర ముని గాను ఇక్కడే జన్మించి నట్లు స్థల పురాణం చెబుతుంది. అటు పై వారిరువురూ కృష్ణుడిగానూ అర్జునినిగానూ జన్మించినట్లు తెలుస్తోంది.
10. రెండు రోజుల పాటు ప్రయాణం
కేదరీనాథ్ నుంచి బద్రీనాథ్ కు సుమారు రెండు రోజుల పాటు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇక్కడకు సమీపంలో డెహరడూన్ వీమానాశ్రయం ఉంది. అదే విధంగా రైల్వే హరిద్వార్ లో రైల్వేస్టేషన్ కూడా ఉంది. ప్రతి రోజూ ఢిల్లీ, హరిద్వార్, రుషికేష్ ల నుంచి బస్సలు ఇక్కడకు బయలు దేరుతాయి.
బద్రినాథ్ దేవాలయం వరకూ మనం నేరుగా వాహనాల్లో వెళ్లవచ్చు. ఈ దేవాలయానికి ఒక కిలోమీటరు దూరంలో బ్రహ్మకపాలము ఉంది. ఇక్కడకు 8 కిలోమీటర్ల దూరంలో వసుధార ఉంది. ఈ వసుధారలోని నీరు పుణ్యాత్ముల పై మాత్రమే పడుతుందని చెబుతారు.
11. కేదార్ నాథ్ దేవాలయం
సాధారణంగా లింగం ఒవెల్ లేదా గుడ్డు ఆకారంలో ఉంటుంది. అయితే కేదారినాథ్ దేవాలయంలో మాత్రం త్రిభుజాకారంలో ఉంటుంది. పాండవుల్లో ఒకరైన భీముడు శివుడిన్ని ఆరాధించే సమయంలో ఈ లింగాన్ని ప్రతిష్టించారని ఒక కథనం.
12. జ్యోతిర్లింగాలు
మరో కథనం ప్రకారం ఆదిశంకరాచార్యులు దేశ పర్యటనలో భాగంగా జ్యోతిర్లింగాల స్థాపన జరిపే సమయంలో ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించారని చెబుతారు. ఏది ఏమైనా ప్రపంచంలో త్రిభుజాకారంలో ఉన్న శివలింగం ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది.
13. కాలి నడకన
అక్కడి నుంచి కేదార్ నాథ్ కు బయలు దేరుతారు. సుమారు 14 కిలోమీటర్లు కాలి నడకన లేదా డోలీల్లో గుర్రాల పై వెలుతుంటారు. ఈ మొత్తం నాలుగు క్షేత్రాల దర్శనంతో మినీ ఛార్ ధామ్ యాత్ర పూర్తయినట్లు భక్తులు భావిస్తుంటారు.
14. ముందుగా రిజిస్ట్రేషన్ తప్పని సరి
హరిద్వార్ లోని రైల్వేస్టేషన్, బస్ స్టేషన్, గురుద్వారా తదితర ప్రాంతాల్లో ఛార్ ధామ్ యాత్ర కోసం వెళ్లేవారు ముందుగా తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫోటో ఐడెంటిటీ కార్డులు రిజిస్ట్రేషన్ కోసం తప్పనిసరి. ఇందు కోసం రూ.50 చెల్లించాలి.
15. ఆన్ లైన్ లో కూడా
అదే విధంగా అన్ లైన్ లో కూడా తమ పేర్లను మనం నమోదు చేసుకోవచ్చు. ఇందుకోసం www.onlinechardhamyatra.com లో సంప్రదించాలి. అదే విధంగా ఛార్ ధామ్ యాత్రకు హెలికాప్టర్ ద్వారా కూడా వెళ్లవెచ్చు. ఇందు కోసం ఉత్తరాఖండ్ పర్యాటక శాఖ అధికారిక వెబ్ సైట్ www.uttarakhandtourism.gov.in లో సంప్రదించవచ్చు.
వార్షిక యాత్రల్లో భాగంగా,ఈ సంవత్సరం మా బృందం, యమునోత్రి,బదరీ,కేదార్,గంగోత్రికి యాత్రకు సిధ్ధమయ్యాం. చార్ధామ్ యాత్రలో ముందుగా,విజయవాడ నుంచి నిజాముద్దీన్(డెల్హి)చేరుకొని,బడలికలు తీర్చుకోని,మరలా డెల్హి నుంచి ట్రైన్ లో హరిద్వార్ చేరుకున్నాం. ముందుగా గౌతమిసత్రం అధిపతులు శ్రీ గంటేల వాసుదేవరావుగారు ఏర్పాటు చేసిన బసలలో విశ్రాంతి తీసుకొని,హరిద్వార్ ఘాట్ లలో సంకల్పస్నానమాచరించాము.ఆ తరువాత,ట్రావెలర్(14సీటర్) వ్యాన్ లో, మా బృందం ప్రయాణానికి సిధ్ధమయ్యాం. అంతకు ముందు ఒకసారి ఇక్కడకు రావడం అవగాహనవుండటంతో,అన్ని ఏర్పాట్లతో బయులుదేరాం. ముందుగా యమునోత్రి, గంగోత్రి, కేదార్, బదరీలను చూపిస్తారు.
ఈ చార్ధామ్ యాత్రలో ముందుగా దర్శించేది, యమునోత్రి. హరిద్వార్ నుంచి సుమారు 235 కి.మి. దూరమ్లో, వెలసివున్నది.పూర్వం 1892-93 సంవత్సరాలలో,జైపూరు మహారాణి గులారియా చేత నిర్మించబడ్డదని తెలుస్తోంది. 1923లో భూకంపం వలన ఆలయం ధ్వంసం కావడం వలన పునర్నిర్మాణం జరిగింది. ఉష్ణకుండాలకు ప్రక్కనవున్న ఆంజనేయస్వామి గుడి ఆనాటిదే!
యమునోత్రి ఆలయం సుమారు 8 కిలోమీటర్ల దూరంలో సముద్రమట్టానికి 3293 ఎత్తులో, బందర్పూంచ్ పర్వతంపై వున్నది. ఈ ఏడు కిలోమీటర్ల మార్గం ఎత్తుగా,మెట్ల మార్గంగా వుంటుంది. కర్రల సహాయంతో నడవ వలసిందే. లేదా డోలీలు,గుర్రాలను ఆశ్రయించాల్సిందే.100 గజాలదూరంలో వీటిని ఆపివేస్తారు.
యమునోత్రిఅంటే,యమున భూమికి దిగిన ప్రవేశమనే, భావించాలి. బండరాళ్ళమధ్య యమునానది ప్రవాహసొబగు చూడాల్సిందే!
వంతెన దాటి ప్రయాణం చేస్తే,20మెట్లు ఎక్కినతరువాత యమునాదేవి ఆలయం చూడవచ్చు. ఉష్ణకుండాలలో స్నానం,అవకాశమున్నవారు ప్రత్యక్ష యమునానదీ స్నానంతో పునీతులవుతారు.మహిళలకు,పురుషులకు ప్రత్యేక ఉష్ణకుండాలు వున్నాయి.అసలు యమున 3600 అడుగుల ఎత్తులో ,కాళింది శిఖరం వద్ద జన్మించింది. శిఖరం చేరే మార్గం లేనందువల్ల,శ్రీఆదిశంకారాచార్యస్వామి ఆలయాన్ని ఇక్కడే నిర్మించారని స్థలపురాణం.
సూర్యదేవుని ఇద్దరి సంతానంలో,యమున,యముడు.భార్య ఛాయాదేవి. ఒకరోజు తల్లి యమునమీద కోపంతో,భూలోకంలో పడిపొమ్మని శపించిందని,అందువల్ల యమున నదీ రూపంలో భూమిపై అవతరించిందని ఐతిహ్యం. ఆలయం ప్రక్క చిన్న ఉష్ణగుండంలో, బియ్యం మూటలుకట్టి,అన్నం తయారు చేసుకుంటారు.దీనిని ప్రసాదంగా స్వీకరించరాదు.ఆనీటి వేడిఎట్లావుందో తెలుసుకునే ప్రకియగా భావించాలి.
దివ్యశిల(సూర్యుడు ఒకకిరణాన్ని తనకుమార్తెకు బహుమతిగా ఇచ్చాడని,ఆ కిరణం కలిగిన ఆనీటిధార ఈ దివ్యశిల క్రిందుగా ప్రహించటం వలన ఆ దివ్యశికను దర్శించాలి)
దివ్యశిలను ఆనుకొని చిన్న ఉష్ణకుండముంటుంది అదే సూర్యకుండం గా పిలుస్తారు.
ఏ తీర్ధానికి వెళ్ళినా స్నానం చేసినంతమాత్రానే,దివ్యానుగ్రహం కలుగుతుంది. తప్పని సరిగా స్నానమాచరించాల్సిదే!
ఆకాశాన్ని తాకే శివాలిక్ పర్వతాల మధ్య,ప్రయాణం. నాకు హార్ట్ స్టంట్ వేయడం వలన ఎక్కలేమోనని,గుర్రాన్ని అధిరోహించాను కాని తగినంత శక్తి లేకపోవటం వలన, ఇక నడక ప్రారంభించాము. మధ్య,మధ్య ప్రకృతి సోయగాలు, ఎత్తైనవృక్షాలు, అదో లోకం.
సుమారు 8,9 కిలోమీటర్ల ప్రయాణం.పూర్తిగా నడకంతా ఎగువకే వుంటుంది.6 గంటలు సమయం పట్టింది.ప్రాయసమంతా ఉష్ణగుండం లో స్నానం తో ఎగిరిపోయింది. బంగాళాదుంపలు, బియ్యం కూడా ఆవేడికి ఉడికిపోతాయి.
మందిరాన్ని,ఇతర ఆలయాలను దర్శించి,గంగోత్రి ప్రయాణం. క్షణక్షణం వింతైన,భయాందోళన(వాతావరణానికి) కానీ, పరమాత్మ ఎల్లెడలా తానై వుండటం వలన,అలౌకిక ఆనందం.
స్వస్తి...
Famous Posts:
> ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు
> ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే
> అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం
> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి
> 100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం
> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం
> అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం
> ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే
చార్ధామ్ యాత్ర విశేషాలు, Char Dham Yatra, Char Dham, char dham yatra, chardham yatra package, char dham yatra family package, char dham yatra map, char dham name, 4 dham in india map, char dham yatra package cost, char dham yatra online registrations