1 . గుజరాత్ రాష్ట్రం - సోమనాధ జోతిర్లింగం
సోమనాధ జ్యోతిర్లింగాలయం... గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర జిల్లాలో సోమనాథేశ్వర క్షేత్రం ఉంది. ఈ క్షేత్రాన్ని దర్శించిన శ్రీకృష్ణ పరమాత్ముడు తన లీలతో వెలిగించిన దీపం నేటికీ ప్రజ్వరిల్లుతుండడం ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడ ఉన్న చంద్రకుండంలో స్నానం చేసి సోమ నాథేశ్వరుడిని దర్శిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. చంద్రుడే స్వయంగా ఈ సోమనాథేశ్వరుడిని ప్రతిష్ఠించినట్లు పురాణాల్లో ఉంది.
సోమనాథ్ ఎలా చేరుకోవాలి?
విమాన మార్గం:
సోమనాథ్ కి 90 కి.మీ. దూరంలో ఉన్న డయ్యు విమానాశ్రయం సమీప విమానాశ్రయం. ఈ విమానాశ్రయం ముంబై విమానాశ్రయంచే అనుసంధానించబడింది. డయ్యు నుండి క్యాబ్, ఇతర రవాణా సాధనాలను ఉపయోగించి చేరుకోవచ్చు.
రైలు మార్గం:
సోమనాథ్ కి 5 కి.మీ. దూరంలో ఉన్న వేరవాల్ వద్ద రైల్వే స్టేషన్ ఉన్నది. వేరవాల్ నుండి ముంబై వరకు రైళ్లు అనుసంధానించడం జరిగింది. ముంబై నుండి దేశంలోని అన్ని నగరాలకు, పట్టణాలకు ప్రయాణించవచ్చు.
రోడ్డు మార్గం:
సోమనాథ్ కు రోడ్డు వ్యవస్థ బాగానే ఉంది. డయ్యు నుండి మరియు దగ్గరలోని ఇతర ప్రాంతాల నుండి బస్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రవేట్ మరియు ప్రభుత్వ రవాణా సాధనాల మీద సోమనాథ్ కు చేరుకోవచ్చు.
2. ఆంధ్రప్రదేశ్ - శ్రీశైలం మల్లికార్జున స్వామి జోతిర్లింగం
శ్రీశైలం మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం.. శ్రీశైలం మల్లికార్జునేశ్వరుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా దోర్నాల్ రైల్వేస్టేషన్ నుంచి 52 కిలోమీటర్ల, హైదరాబాద్‌కు 230 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రం అష్టాదశ శక్తి పీఠములలో ఒక్కటి. పరమేశ్వరుడు భార్య గౌరీదేవితో కలిసి స్వయంభువుగా శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జునుడుగా వెలిశాడు.
శ్రీశైలం ఎలా చేరుకోవాలి?
శ్రీశైలానికి నేరుగా రైలు కనెక్టివిటీ లేదు. సమీప రైల్వే స్టేషన్ శ్రీశైలం కుంబం జిల్లాలో ఉంది. శ్రీశైలం సమీప రైల్వే స్టేషన్ పేరు మార్కాపూర్ రైల్వే స్టేషన్. మార్కాపూర్ రైల్వే స్టేషన్ నుండి శ్రీశైలం దూరం సుమారు 60 కి.మీ. మీరు కుంబం రైల్వే స్టేషన్ నుండి శ్రీశైలం వరకు రెగ్యులర్ ప్యాసింజర్ రైళ్లు మరియు ఎక్స్‌ప్రెస్ రైళ్లు పొందవచ్చు.
హైదరాబాద్‌కు 214 కి.మీ, విజయవాడకు 263 కి.మీల, కర్నూలుకు 180 కి.మీల దూరంలో ఈ పుణ్యక్షేత్రం ఉంది. ఇక్కడికి బస్సులు అందుబాటులో ఉన్నాయి.
3.మధ్యప్రదేశ్ ఉజ్జయినీలోని - మహాకాళేశ్వర్ జోతిర్లింగం
మహాకాళేశ్వర జ్యోతిర్లింగం.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్జయినీ పట్టణంలో శ్రీ మహా కాళేశ్వరాలయం ఉంది. క్షిప్ర నది ఒడ్డున ఉంది. ఈ నగరంలో 7 సాగరతీర్థములు, 28 తీర్థంలు, 84 సిద్ధలింగాలు, 30 శివలింగాలు, అష్టభైరవులు, ఏకాదశరుద్రులు, వందలాది దేవతా మందిరాలు, జలకుండము ఉన్నాయి. మంత్రశక్తి వల్ల ఉద్భవించిన ఏకైక స్వయంభూ జ్యోతి ర్లింగం.
ఉజ్జయిని ఎలా చేరుకోవాలి?
మహాకాలేశ్వర్ దేవాలయానికి దగ్గరగా నాలుగు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఈ స్టేషన్లు: ఉజ్జయిని జంక్షన్, విక్రమ్ నగర్, చింతామన్ మరియు పింగళేశ్వర్. ఈ స్టేషన్లన్నీ దేశంలోని ప్రధాన నగరాలకు బాగా అనుసంధానించబడి ఉన్నాయి. రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తరువాత, పర్యాటకులు దేవాలయానికి చేరుకోవడానికి ఏదైనా స్థానిక రవాణాను తీసుకోవచ్చు.
4 .మధ్యప్రదేశ్ లో నర్మదా నది ద్వీపంలో ఉన్న ఓంకారేశ్వర్ జోతిర్లింగం
ఓంకారేశ్వర జ్యోతిర్లింగం.. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖాండ్వా జిల్లాలో ఈ పుణ్యక్షేత్రం ఉంది. శ్రీ ఓంకారేశ్వరుడు, అమలేశ్వరుడు-మామలేశ్వరము,శివపురి, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వింద్య పర్వత సానువుల్లో నర్మదానది తీరంలో ఓంకారేశ్వరుడు వెలిశాడు. ఇక్కడ ఓ లింగము రెండు భాగములుగా ఉండి, రెండు పేర్లతో పూజింపబడుతున్నాడు. ఇక్కడున్న అమ్మవారు అన్నపూర్ణదేవి.
ఓంకారేశ్వర దేవాలయం ఎలా వెళ్ళవచ్చు?
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నుంచి ఈ క్షేత్రం 77 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
ముంబయి, ఢిల్లీ, గ్వాలియర్, భోపాల్ నుంచి ఇండోర్ కు విమాన సర్వీసులను నడుపుతున్నారు. ఇండోర్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో రాట్లాం ఖాండ్వాకు రైలు మార్గం ఉంది. సికిందరాబాద్, ఢిల్లీ, ముంబయిల నుంచి కూడా రైలు సౌకర్యం ఉంది.
ఇండోర్ నుంచి ఉజ్జయిని, ఖాండ్వాకు బస్సు సర్వీసులను నడుపుతున్నారు. హైదరాబాద్ నుంచి అయితే 772 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నేరుగా భోపాల్ లేదా ఇండోర్ వెళ్లి అక్కడి నుంచి ఓంకారేశ్వర్ కు వెళ్లవచ్చు.
5. మహరాష్ట్రలోని - వైద్యనాథ్ జోతిర్లింగం
వైద్యనాధ్ జ్యోతిర్లింగం.. శ్రీవైద్యనాథేశ్వరుడు పాట్నా నుంచి సుమారు 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహారాష్ట్రలో కంతిపూర్ దగ్గర పెద్ద శివాలయాన్ని కూడా శ్రీవైద్యనాథ జ్యోతిర్లింగంగా పూజిస్తున్నారు. ఈ రెండింటి నేపథ్యమూ రామాయాణాంతర్గత రావణాసురిడి కథతో ముడిపడి ఉంది.
వైద్యనాధ్ జ్యోతిర్లింగం చేరుకోవడం ఎలా?
రైలు ద్వారా ఢిల్లీ నుండి వైద్యనాధ్ ధామ్ కోల్‌కతా రాజధాని లేదా పూర్వా ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లండి, జాసిడిహ్ jn వద్ద దిగండి. బాబా ధామ్ కోసం క్యాబ్ లేదా ఆటో తీసుకోండి.
6. మహారాష్ట్రలోని శ్రీనాగనాథేశ్వర జోతిర్లింగం
నాగ నాగేశ్వర జ్యోతిర్లింగం... శ్రీనాగనాథేశ్వరుడు లేదా నాగేశ్వరుడు .మహారాష్ట్ర ప్రభాస రైల్వేస్టేషన్‌కు సమీపంలో శ్రీనాగనాథేశ్వర ఆలయం ఉంది. ఈ జోతిర్గింగాన్ని భూమిపై పుట్టిన మొదటి జ్యోగిర్లింగంగా పరిగనిస్తారు. పాండవులు అరణ్యవాసంలో భాగంగా దారుకా వనంలో ఉన్నప్పుడు పాండవులే స్వయంగా ఆలయం నిర్మించినట్లు పురాణ గాథ.
ఎలా చేరుకోవాలి?
జామ్ నగర్ ఎయిర్ పోర్ట్ ద్వారకకు కేవలం 45 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. ఈ ఎయిర్ పోర్టు నుంచి ద్వారకకు ప్రైవేటు ట్యాక్సీల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. అదే విధంగా ద్వారకలో రైల్వేస్టేషన్ ఉంది. భారతదేశంలోని చాలా ప్రధాన నగరాల నుంచి ఇక్కడకు నేరుగా రైలు సదుపాయం ఉంది. అదే విధంగా ఉత్తర భారత దేశంలోని ప్రధాన నగరాల నుంచి కూడా ద్వారకకు నేరుగా బస్సు సౌకర్యం ఉంది.
7.తమిళనాడులోని రామేశ్వర జ్యోతిర్లింగం
రామేశ్వర జ్యోతిర్లింగం.. తమిళనాడు లోని రామేశ్వరంలో కల రామేశ్వర జ్యోతిర్లింగం దక్షిణాదిన ప్రసిద్ధ యాత్రా స్థలంగా పేరు పడింది.శ్రీరామేశ్వరుడు తమిళనాడు రాష్ట్రంలో శ్రీ రామేశ్వరాలయం ఉంది. రాముడు ప్రతిష్ఠించిన కారణంగా రామేశ్వరంగా ప్రసిద్ధి.
రామేశ్వరం ఎలా చేరుకోవాలి ?
వాయు మార్గం: రామేశ్వరము సమీపాన మదురై దేశీయ విమానాశ్రయం కలదు. టాక్సీ లేదా క్యాబ్ ఎక్కి రామేశ్వరం సులభంగా చేరుకోవచ్చు.
రైలు మార్గం : చెన్నై నుండి రామేశ్వరానికి ప్రతి రోజూ రెండు, మంగళ, శని వారాలలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం నాలుగు రైళ్ళు తిరుగుతుంటాయి. యాత్రికులు ముందుగానే టికెట్ రిజర్వ్ చేసుకోవటం సూచించదగినది.
రోడ్డు మార్గం : చెన్నై మరియు రాష్ట్రంలోని ఇతర ప్రధాన పట్టణాల నుండి రామేశ్వరం కు ప్రతి రోజూ ప్రభుత్వ/ప్రవేట్ బస్సులు నడుస్తాయి.
8. ఉత్తరాంచల్ - కేదార్నాథ్ జోతిర్లింగం
కేదార్నాద్ జ్యోతిర్లింగం.. శ్రీ కేధారేశ్వరుడు ఉత్తరాంచల్ రాష్ట్రంలో కేదారేశ్వలయం ఉంది. హిమాలయశిఖరం మందాకిని నదీతీరంలో సముద్ర మట్టానికి 3585 మీటర్ల ఎత్తులో ఎద్దుమూపుర ఆకారంలో ఈ జ్యోతిర్లింగం ఉంది. గౌరీకుండ్ నుంచి 14కిలోమీటర్ల దూరం గుర్రాలుపై గానీ, డోలీలో గానీ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ ఆలయంను సంవత్సరంలో 6నెలలు మాత్రమే తెరుస్తారు. విష్ణుమూర్తి నరనారాయణులుగా కొన్ని వేల సంవత్సరాలు శివుని ధ్యానించి తపస్సు చేసి లోక కల్యాణానికి ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణ కథలో ఉంది.
కేదార్‌నాథ్‌ని ఎలా చేరుకోవాలి?
By Air: సమీప దేశీయ విమానాశ్రయం కేదార్‌నాథ్ నుండి 239 కి.మీ దూరంలో ఉన్న డెహ్రాడూన్‌లోని జాలీ గ్రాంట్ విమానాశ్రయం మరియు ఢిల్లీకి రోజువారీ విమానాలను నడుపుతుంది. ...
By Train: సమీప రైల్వేహెడ్ 221 కి.మీ దూరంలో ఉన్న రిషికేష్ వద్ద ఉంది. ...గౌరీకుండ్ కు సమీప రైల్వే స్టేషన్ రిషికేష్.
By Bus: సందర్శకులు రిషికేష్ మరియు కోట్ద్వార్ నుండి కేదార్‌నాథ్‌కు సాధారణ బస్సులను ఎక్కవచ్చు.
9 . మహారాష్ట్ర నాసిక్ లోని త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం
త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం.. శ్రీత్రయంబకేశ్వరుడు మహారాష్ట్రలోని నాసిక్‌కు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో శ్రీ త్రయంబుకేశ్వరాలయం ఉంది. బ్రహ్మవిష్ణువుల ప్రార్థనలతో స్వయంభువుగా వెలసి బ్రాహ్మతో త్రయంబకేశ్వరుడిగా కీర్తనలందుకొన్న త్రయంబకేశ్వర క్షేత్రం గురించి రెండు కథనాలు ప్రచారంలో ఉన్నాయి.
త్రయంబకేశ్వర దేవాలయం చేరుకోవడం ఎలా?
ఇంతటి పవిత్రమైన పుణ్యక్షేత్రానికి ఎలా చేరుకోవాలి అంటే మహారాష్ట్రలోని నాసిక్ నుంచి త్రయంబకం చేరుకోవచ్చు షిరిడి యాత్రకు వెళ్లే భక్తులు తీర్థయాత్రలో భాగంగా ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించటం చాలా సులభం షిరిడి నుంచి చాలా దగ్గరగా ఈ క్షేత్రం ఉంటుంది దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి నాసిక్ రోడ్డు రైలు మార్గాలు ఉన్నాయి. ఎంతో పవిత్రమైన ఈ పుణ్యక్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ దర్శిస్తారు అని భావిస్తున్నాం.
10 . మహారాష్ట్ర - భీమశంకర్ జోతిర్లింగం
భీమశంకర జ్యోతిర్లింగం.. శ్రీభీమేశ్వరుడు డాకిని, భువనగిరి జిల్లా, మహారాష్ట్రలో సహ్యాద్రి పర్వతఘాట్‌లో పూణేకు సుమారు 110 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఉపనది భీమ నది ఉద్భవ ప్రాంతంలో భీమశంకర జ్యోతిర్లింగంగా వెలసింది. కుంభకర్ణుని కుమారుడు రాక్షస భీముని నాశనం చేసే ఈశ్వరుడి రూపంలో ఈ లింగం ఉంటుంది.
భీమశంకర జ్యోతిర్లింగం చేరుకోవడం ఎలా?
భీమశంకర్ మహారాష్ట్రలోని జ్యోతిర్లింగ దేవాలయాలలో ఒకటి. పూణే నుండి భీమశంకర్ కు రైలు అందుబాటులో లేదు. భీమశంకర్‌కు సమీప రైల్వే స్టేషన్ పూణే. భీమశంకర్ రహదారుల ద్వారా అనేక నగరాలకు అనుసంధానించబడి ఉంది. మీరు పూణే నుండి భీమశంకర్ వరకు బస్సులో ప్రయాణించవచ్చు. శివాజీనగర్ బస్టాండ్ నుండి బస్సులు అందుబాటులో ఉన్నాయి. పూణే (శివాజీనగర్ బస్టాండ్) నుండి ప్రతి 30 నిమిషాలకు ఉదయం 5:30 నుండి సాయంత్రం 4:00 వరకు బస్సు ఫ్రీక్వెన్సీ ఉంటుంది. భీమశంకర్ నుండి సమీప విమానాశ్రయం పూణే విమానాశ్రయం. పూణే నుండి భీమశంకర్‌కు క్యాబ్‌లో ప్రయాణించడం అత్యంత అనుకూలమైన మార్గం.
11.మహారాష్ట్ర ఔరంగబాద్ లోనిశ్రీ ఘృష్ణేశ్వర జోతిర్లింగం
శ్రీ ఘృష్ణేశ్వరుడు మహారాష్ట్ర ఔరంగబాద్ పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో శ్రీవిఘ్నేశ్వరాలయం ఉంది. అజంతా ఎల్లోరా గ్రామంలో ఘృష్ణేశ్వర ఆలయం ఉంది. అజంతా ఎల్లోరా గుహలు, ప్రపంచ ప్రసిద్ధి పొందిన దర్శనీయ పర్యాటక స్థలాలు, దేవగిరి కొండపై ఘృష్ణేశ్వరుని ఆలయం వెలిసింది.
ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఎలా చేరుకోవాలి ?
రైలు మార్గం ద్వారా అయితే ఔరంగాబాద్ నుంచి ఇక్కడికి నేరుగా చేరుకోవచ్చు. రోడ్డు మార్గం ద్వారా అయితే ప్రైవేట్, సొంత వాహనాల్లో ఔరంగాబాద్ నుంచి చేరుకోవచ్చు. వేరూల్ గ్రామం నుంచి ఔరంగాబాద్కు బస్సులు నడుస్తుంటాయి.
12. విశ్వేశర జోతిర్లింగం-వారణాసి-ఉత్తర్ ప్రదేశ్
విశ్వేశర జ్యోతిర్లింగం.. శ్రీవిశ్వనాథేశ్వరుడు జ్యోతిర్లింగం వారణాసిగా జగత్‌ప్రసిద్ధి చెందిన కాశీక్షేత్రంలో ఉంది. దేవతలు నివసించే పుణ్యక్షేత్రం కాశీపట్టణం. గంగానది తీరంలో బౌద్ధ, జైన మతాలవారు, హైందవులు అనేకమంది తీర్థయాత్రికులు కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుంటారు.
కాశి విశ్వనాథ చేరుకోవడం ఎలా?
కాశీ విశ్వనాథ ఆలయం వారణాసి రైల్వే స్టేషన్ నుండి కేవలం 5 కి.మీ దూరంలో ఉంది. మీరు నగరంలో ఎక్కడి నుంచైనా ప్రయాణిస్తుంటే, మీ గమ్యస్థానానికి చేరుకోవడానికి ఉత్తమ మార్గం టాక్సీ లేదా ఆటో రిక్షా. అయితే, అసలు ఆలయం విశ్వనాథ్ గాలీ లోపల ఉంది, ఇది సంచార రహదారి కాదు మరియు మీరు ఆలయం గుమ్మం వరకు నడవాలి.
మరియు వారణాసి వెళ్లాలనుకునే వారికి ఎన్నో ట్రావల్ ఏజన్సీలు ప్రయాణికులకు అనుకూలంగా తమ తమ ప్యాకేజీలను ఇస్తున్నాయి.
Famous Posts:
> సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు?
> కాకికి అన్నం ఎందుకు పెట్టడం ?
> మీకు ఏదైనా సమస్య ఉందా అయితే వెంటనే ఈ స్వామి వారికి ఉత్తరం రాయండి
> సంతానం కోరుకునే వారికీ కచ్చితమైన పరిష్కార మార్గం
> మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి.
> భస్మధారణ అంటే ఏమిటి? దాని వల్ల కలిగే లాభాలు ఏంటి?
> మహాభారతం నుండి నేరచుకోవలసిన 12 ముఖ్యమైన విషయాలు.
> భారతీయులు ప్రతి ఒక్కరూ తెలుసుకోదగినవి అద్భుతమైన దేవాలయలు
Tags: జ్యోతిర్లింగాలు ఎలా దర్శించాలి?, 12 జ్యోతిర్లింగాలు, 12 Jyotirlinga images with name and place, Jyotirlinga list in telugu, 12 jyotirlinga list, dwadasa jyotirlinga places,
Tags
Jyotirlingas