ఆలయ సమీపంలో ఇల్లు కట్టొచ్చా..? వాస్తు శాస్త్రం ప్రకారం దేవాలయ నీడ ఇంటి మీద పడితే మంచిదా? కాదా?
మనలో చాలా మంది వాస్తుశాస్తాన్ని ఫాలో అవుతారు. అయితే ప్రస్తుత ఆధునిక కాలంలో కేవలం కొందరు మాత్రమే వీటిని నమ్ముతున్నారు. కానీ కొత్తగా ఇల్లు కట్టించేవారు మాత్రం వాస్తు శాస్త్రం నియమాలను, పద్ధతులను తూచ తప్పకుండా పాటిస్తారు.
వాస్తు ప్రకారమే.. ఇల్లు నిర్మించడం.. ఇంట్లో వస్తువులను సెట్ చేసుకోవడం వంటివి చేస్తుంటారు. ఇలా చేస్తే ఆర్థిక పరంగా.. ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలు ఉండవని నమ్ముతారు.
మన పెద్దలు గృహాన్ని దేవాలయంతో, మందిరంతో పోల్చారు. స్నానాల గదిని స్నానమందిరం అని.. పడక గదిని శయన మందిరం అని..
వంటగదిని పాకమందిరం అని.. పశువుల గదిని పశుమందిరం అని పిలుస్తారు. కానీ దేవాలయానికి సమీపంలో అంటే.. దేవాలయం నీడ, ధ్వజస్తంభం నీడ పడే చోట ఇంటి నిర్మాణం చేపట్టొద్దని అని శాస్త్రం చెబుతోంది. దేవాలయాల నీడ ఇంటిపై ఎందుకు పడొద్దు? అసలు దేవాయాలు ఎన్ని రకాలో తెలుసుకుందాం.
మన చుట్టుపక్కల ఏ దేవాలయాన్ని చూసినా.. దేవాలయం లోపల చూసినా దైవిక వాతావరణం, ఆలయంలో గంట మరియు భజనల యొక్క శ్రవ్యమైన శబ్దం, ధూపదీపాలు, కర్రల తాజా సుగంధ వాసన ఈ ఆహ్లాదకరమైన కారకాలన్నీ మనలో సానుకూల శక్తిని పెంపొందిస్తాయి.
వాస్తు శాస్త్రం ప్రకారం దేవాలయం నీడ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటిపై పడొద్దు. ఒకవేళ ఆలయ నీడ ఇంటిపై పడితే ఐశ్వర్యం అడుగంటిపోతుంది. రోగాలు చుట్టుముడతాయి, ఆయువు క్షీణిస్తుంది. అసలు దేవాలయానికి ఎంత దూరం వరకు ఇంటి నిర్మాణం చేపట్టొద్దంటే.. గృహ నిర్మాణం చేపట్టే యజమాని తన కుడిచేతిని ముందుకు చాచి.. ఎడమ భుజం చివరి భాగం వరకు ఒక హస్త ప్రమాణం తీసుకోవాలి. దీన్ని బార (యజమాని బార) అంటాం.
మూడు రకాల దేవాలయాలు ఉన్నాయి. అవి 1. వైష్ణవ దేవాలయం 2. శైవ దేవాలయం 3. శక్తి దేవాలయం. అలాగే దేవాలయంలోని విగ్రహాలు నాలుగు రకాలుంటాయి. అవి 1. సౌమ్యం 2. భోగం 3. యోగం 4. ఉగ్రం.
శివాలయం విషయానికి వస్తే.. 100 బారల లోపు గృహం ఉండొద్దు. ఎందుకంటే.. శివుడు ముక్కంటి, ప్రళయకారకడు. ఆయనకు సమయం లేదు. భక్తుడు పిలిస్తేనే పరిగెత్తే శివుడు.. మూడో కన్ను తెరిస్తే భస్మమే. అందుకే శివాలయానికి నూరు బారల లోపు ఇంటిని నిర్మించొద్దు.
ఇక రెండోది.. విష్ణు ఆలయానికి వెనక భాగాన గృహ నిర్మాణం చేయరాదు. కారణం విష్ణువు అలంకార ప్రియుడు.
విష్ణువు సూర్యనారాయణుడి అవతారం అయినప్పటికీ.. సూర్యుడి వృత్తకార కిరణాలు సామ్య రూపములో ఎప్పుడూ నారాయణుడి శిరస్సు వెనక చక్రాకారంలో తిరుగుతూ ఉంటాయి. అదే చక్రం వెనక భాగాన రాక్షసులతో యుద్ధంలో పాల్గొంటుంది. కాబట్టి వైష్ణవ ఆలయానికి వెనుక భాగాన ఇల్లు కట్టరాదని వాస్తు శాస్త్రం చెబుతోంది. వైష్ణవ ఆలయానికి వెనుక 100 బారలు, ముందు 50 బారలు వదిలేయాలి. లేదంటే కనీసం 20 బారలు వదిలేయాలి.
ఇక శక్తి ఆలయానికి కుడి, ఎడమ వైపులా గృహ నిర్మాణం చేపట్టొద్దు. అమ్మ చేతి రెండు వైపులా పదునైన ఆయుధం ఉంటుంది. అమ్మ రెండు చేతులతో శత్రు సంహారం చేస్తుంది. కాబట్టి శక్తి ఆలయానికి 120 బారల వరకు గృహ నిర్మాణం చేయరాదు.
ఇక ఆంజనేయస్వామి ఆలయానికి ఎనిమిది బారల వరకు గృహ నిర్మాణం చేయరాదు. షాఖిని, డాఖిని, గాలి దెయ్యాలను హనుమంతుడు తన 8 అడుగుల వాలంతో చుట్టి బండకేసి కొట్టి హతమొందిస్తాడు.
దేవాలయం కోసం అనుకొని పారు చేసి గృహ నిర్మాణం చేయరాదు. ఆ గృహము శోభించదు. ఇంటిపై ధ్వజస్తంభం నీడ కూడా పడరాదు. దేవుడి ధ్వజము శక్తి సంపన్నం, ఉగ్రరూపం. అందుకే ధ్వజస్తంభం ధ్వజము దేవుడి వైపు తిరిగి ఉంటుంది. ఇక గరుడ స్తంభాన్నే దీపపు స్తంభం అని అంటాం.
ఆకాశంలో విహరించే దేవతలకు దారి చూపడానికి దీపం వెలిగిస్తాం. ఆ సమయంలో దేవుడు దేవేరితో కలిసి విహరిస్తూ ఉంటాడు. దీన్ని మానవులు చూడకూడదు కాబట్టి.. దానికి సమీపంలోనూ ఇల్లు నిర్మించొద్దు.
పూర్వకాలంలో పర్వతాలు, నదీతీరంలో మాత్రమే దేవాలయాలు ఉండేవి. పర్వతంపై దేవాలయాన్ని నిర్మించడం ఉత్తమం. నదుల వద్ద నిర్మిస్తే ఫలితం మధ్యమం. గ్రామం, నగరంలో అధమం అని మహర్షులు శ్లోక రూపంలో చెప్పారు. కాబట్టి ఆలయ సమీపంలో ఇంటి నిర్మాణం చేపట్టే ముందు పైన పేర్కొన్న అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
మీరు మీ ఇంటిని భైరవ్/కార్తికేయ/ బలి దేవుని ఆలయం లేదా దేవత ఆలయం సమీపంలో నిర్మిస్తే, కుటుంబ సభ్యుల మధ్య ఊహించని వివాదాలు తలెత్తడం వల్ల మీరు మీ కుటుంబ జీవితం బాగా దెబ్బతింటుంది. కాబట్టి వీలైనంత మేరకు దేవాలయం నుండి దూరంగా ఉండాలి మరియు ఇల్లు నిర్మించేటప్పుడు దేవాలయ సముదాయం నుండి ఎలాంటి రాళ్లు లేదా నిర్మాణ సామగ్రిని ఉపయోగించకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
Famous Posts:
> శివ గుణాలు లోకానికి సందేశాలు
> భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?
> కూతురా కోడలా ఎవరు ప్రధానం...?
> సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు?
> కాకికి అన్నం ఎందుకు పెట్టడం ?
> మీకు ఏదైనా సమస్య ఉందా అయితే వెంటనే ఈ స్వామి వారికి ఉత్తరం రాయండి
> సంతానం కోరుకునే వారికీ కచ్చితమైన పరిష్కార మార్గం
> మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి.
వాస్తు శాస్త్రం, దేవాలయం నీడ, vastu tips in telugu, house near temple vastu, vastu tips for mandir in flat, where to put mandir at home, pooja room vastu, house near temple vastu telugu, dharma sandesalu telugu, house near temple vastu,