ఈ అలవాట్లు ఉంటే వెంటనే మానుకోండి.. పొరపాటున కూడా ఇంట్లో ఇవి చేయకూడదు..
మంచం మీద తినడం, బాత్రూమ్ మురికిగా ఉంచుకోవడం లాంటి చిన్న తప్పులే జీవితంలో పెద్ద ప్రభావం చూపుతాయి. దాదాపు ప్రతి ఇంట్లో ఈ తప్పులు చేసే అలవాట్లు ఉంటాయి.వీటి వల్ల మన పురోగతి ఆగిపోతుందని వాస్తు నమ్మకం.
ఇంట్లో మనం సాధారణంగా కొన్ని పనులు చేస్తాం. అయితే వాటిని పెద్దగా పట్టించుకోం. కానీ వీటి వల్ల భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే మన శాస్త్రాల ప్రకారం ఇవి శుభకరంగా పరిగణించరు. ముఖ్యంగా మంచం మీద తినడం, బాత్రూమ్ మురికిగా ఉంచుకోవడం లాంటి తప్పులే జీవితంలో పెద్ద ప్రభావం చూపుతాయి. దాదాపు ప్రతి ఇంట్లో ఈ తప్పులు చేసే అలవాట్లు ఉంటాయి. అయితే ఈ చెడు అలవాట్లు మన జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తాయో మీకు తెలుసా? వీటి వల్ల మన పురోగతి ఆగిపోతుందని వాస్తు నమ్మకం. ఈ అలవాట్లు, వాటి నష్టాలు ఏంటో ఈ రోజు మీకు తెలియజేయనున్నాం.
మంచం మీదు కూర్చొని తినడం..
శాస్త్రాల ప్రకారం మంచం మీద కూర్చొని భోజనం చేయడం వల్ల ఇల్లు వ్యాధుల నిలయంగా మారుతుంది. వాస్తు ప్రకారం మంచం మీదు కూర్చొని ఎప్పుడూ తినకూడదు. ఇది మీ ఇంట్లో అశాంతిని కలిగిస్తుంది. అంతేకాకుండా ఇంట్లో నివసించే సభ్యులపై అప్పును కూడా పెంచుతుంది. మంచం మీద కూర్చొని భోజనం చేయడం వల్ల అనేక వ్యాధులు వస్తాయని విశ్వసిస్తారు. మీరు కూడా ఇలా చేస్తుంటే వెంటనే ఈ అలవాటును మానుకోండి.
వంటగదిలో ఈ పొరపాటు చేయవద్దు..
కొంత మంది వంటగదిలో పాత్రలను కడగకుండా అలాగే ఉంచుతారు. లేదా వంట పాత్రల్లో ఆహారాన్ని అలాగే ఉంచుతారు. మీరు కూడా ఇలా చేస్తుంటే మీకు సొంత హాని కలుగుతుందని అర్థం చేసుకోండి. రాత్రి పూట మీరు పాత్రలను శుభ్రం చేయలేకపోతే వాటిని నీటితో కడగాలి. వంటగదిలో మురికి పాత్రలను కడగకుండా వదిలేయడం అన్నపూర్ణా తల్లిని అవమానించినట్లే. దీంతో పాటు పాత్రల నుంచి ఓ రకమైన ప్రతికూల శక్తి బయటకు వస్తుంది. మీ జీవితంలో ఉద్రిక్తతను సృష్టిస్తుంది. కాబట్టి రాత్రి నిద్రించే ముందు పాత్రలు శుభ్రం చేసుకోవడం మర్చిపోవద్దు.
రాత్రి పడుకునే ముందు ఈ పని చేయండి..
రాత్రి పడుకునే ముందు ఇంటి కిచెన్ లో ఓ బకెట్ నిండా నీళ్లు ఉంచడం ద్వారా అద్భుత ప్రయోజనాలు లభిస్తాయి. అంతేకాకుండా మీరు రుణ బాధల నుంచి బయపడతారు. మరోవైపు బకెట్ ను బాత్రూంలో నిండుగా ఉంచడం మీ జీవితంలో పురోగతికి మార్గం తెరుస్తుంది. మీరు బాత్రూంలో బకెట్ నిండుగా నీరు ఉంచుకుంటే లక్ష్మీదేవి సంతృప్తి చెందుతుందని, మీ ఇంట్లోకి చాలా డబ్బు వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఇంట్లో పూజించే ప్రతి ప్రదేశంలో ఈ పని చేయండి..
ఇంటి ఈశాన్య మూల అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణిస్తారు. అంతేకాకుండా ఈ మూలలో ప్రార్థనా స్థలాన్ని తయారు చేయడం చాలా సముచితమైందిగా పరిగణిస్తారు. ఎల్లప్పుడూ ఈశాన్యంలో ఓ డబ్బాలో లేదా చిన్న పాత్రలో నీటిని ఉంచండి. ఇలా చేయడం ద్వారా ఇంట్లో నివసించే వ్యక్తులకు శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా వారి పనులన్నీ పూర్తవుతాయి. ప్రతి ఈ నీటిని మొక్కలకు పోయాలి.
ప్రధాన ద్వారం వద్ద మర్చిపోయి కూడా ఈ విధంగా చేయవద్దు..
డస్ట్ బిన్ ఇంటి ప్రధాన ద్వారా వద్ద ఉంచకూడదు. ఇంటి బయట దీన్ని ఉంచడం వల్ల పొరుగువారితో మీ సంబంధాలు దెబ్బతింటాయని అంటారు. ఇలా చేయడం ద్వారా ఇరుగుపొరుగున శత్రువులవుతారు. ఫలితంగా అనవసర ఇబ్బందులను సృష్టించుకున్నవారవుతారు. అందువల్ల మర్చిపోయి కూడా చెత్త లేదా డస్ట్ బిన్ ను ఇంటి బయట ఉంచకూడదు.
సూర్యాస్తమయం తర్వాత ఇలా చేయవద్దు..
సూర్యాస్తమయం ఎవరికైనా మర్చిపోయి కూడా పాలు, పెరుగు, ఉల్లిపాయ, ఉప్పు ఇవ్వకూడదు. ఈ వస్తువులను ఎవ్వరికైనా ఇవ్వడం వల్ల మీ ఇల్లు నాశనమవుతుందని, లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందని విశ్వసిస్తారు. అంతేకాకుండా మీ జీవితంలో సంతోషం కూడా ముగుస్తుందని చెబుతారు. కాబట్టి మర్చిపోయి కూడా సంధ్యా సమయం తర్వాత ఈ వస్తువులను ఎవ్వరికి ఇవ్వకండి.
Famous Posts:
> మంగళ, శుక్రవారాల్లో ఎవరికీ డబ్బు ఇవ్వకూడదా?
> భర్త భార్య మాట వినాలంటే ఏమి చేయాలి ?
> వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.
> శివ గుణాలు లోకానికి సందేశాలు
> భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?
> కూతురా కోడలా ఎవరు ప్రధానం...?
> సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు?
> కాకికి అన్నం ఎందుకు పెట్టడం ?
Vastu Tips, free vastu tips for home telugu, vastu tips for kitchen, vastu tips for happy home, easy vastu tips, vastu tips in telugu, vastu for home entrance, vastu tips for money luck, vastu tips for bedroom,