నిజంగా జరిగిన సంఘటన..
తనని నమ్మిన భక్తులని కాచి రక్షించెందుకు ఆ పరమేశ్వరి ఎప్పుడు సిద్ధం గా ఉంటుంది..
అలా ఎన్నో సంఘటనలు జరిగాయి వాటిలో ఇదొకటి...
తిరుకడైవూర్ క్షేత్రం లొ అభిరామి అమ్మవారు సాత్విక రూపంలో వెలిసి ఉన్నారు అదే క్షేత్ర పరిధిలో అభిరామ భట్టు అనే భక్తుడు కూడా ఉండేవాడు ఈయన ప్రతి రోజు అమ్మవారి ఆలయంలొ ధ్యానంలోనే ఎక్కువ సమయం ఉండేవాడు..
ఆయన ధ్యానస్థితిలో ఉండగా అమ్మవారు ఆయనకి తరచూ దర్శనం ఇచ్చేది.
ఒక నాడు ఆలయం లొ ఆయన ధ్యానం చేసే సమయంలో తంజావూరు చక్రవర్తి అయిన తుందిరా మహారాజు అమ్మవారి దర్శనానికి వచ్చాడు.. అందరు లేచి నిలబడి స్వాగతం పలికారు ఒక్క అభిరామ భట్టు తప్ప అయన మౌనంగా లోపలకి వెళ్లిపోయాడు..
పూజా కార్యక్రమం ముగించుకొని బయటకు వస్తూ ఉండగా మళ్ళీ అందరు లేచి నిలబడ్డారు ఈయన తప్ప దాంతో మహారాజుకి కోపం వచ్చి ఎవరితను అనగా ఆలయ అర్చకులు పరుగు పరుగున వచ్చి ఈయనొక ఉన్మాది ప్రభూ మధిరా పానం వల్ల బాహ్య సృహ లేదు అన్నారు కానీ రాజుకి అనుమానం వచ్చింది.. కారణం ఆయన మొహం లో అమ్మవారి దర్శనం తాలూకా ఆనందం కళ రూపంలో మొహం వెలిగి పోతోంది వెంటనే ఆయన్ని లేపమని చెప్పాడు తుందిరా మహారాజు... భటుడు వెళ్లి కదపగా ధ్యానం నుండి బయటకి వచ్చాడు అభిరామ భట్టు...
వెంటనే మహారాజు ఆయన్ని ఇవాళ తిధి ఏంటి అన్నాడు దానికి అభిరామ భట్టు తడుముకోకుండా పౌర్ణమి అన్నాడు కారణం ఇప్పటి వరకు తను ధ్యానం లొ చంద్రబింబం లాంటి అమ్మవారి మోము చూడటమే చుట్టుపక్కల అందరు ఒక్కసారిగా తలలు పట్టుకున్నారు ఎందుకంటే ఆ రోజు అమావాస్య.. మహారాజు వెంటనే సరే నేను సాయంత్రం వస్తా నాకు చంద్ర దర్శనం చేయిస్తావా అన్నాడు దానికి ఒప్పుకున్నాడు అభిరాముడు.. ఒకవేళ సాయంత్రం చంద్ర దర్శనం నాకు కలుగక పోతే నిన్ను శిక్షిస్తాను అన్నాడు మహారాజు..
సాయంత్రం అయ్యింది అభిరామ భట్టు స్నానాధి కార్యక్రమాలు ముగించుకుని ఆలయంలోకీ వచ్చి అమ్మవారికి అంతాది రూపక ప్రార్ధన చేయటం మొదలెట్టాడు (అంటే ఒక శ్లోకం ఏ పదం తో ముగుస్తుందో తర్వాత శ్లోకం ఆ పదం తో మొదలెట్టడం అలా ఆయన ఎన్నో శ్లోకాలు రాసాడు వాటిని అభిరామ అంతాది అంటారు.
అలా శ్లోకాలు చెప్తూ ఉండగా చీకటి పడింది మహారాజు వచ్చాడు నాకు చంద్ర దర్శనం చేయించు అన్నాడు అభిరామ భట్టుతో..
అభిరామ భట్టు శ్లోకం చెప్పడం ఆపలేదు. రాజు మరొక్కసారి అడిగాడు కానీ అభిరామ భట్టు అలాగే చెప్పుకుంటూ పోతున్నాడు..
మహారాజుకి కోపం వచ్చి ఈ దూర్తుడిని శిక్షించండి అనబోతు ఉండగా ఆకాశం లొ ఒక ఆశ్చర్యం జరిగింది అప్పటి వరకు చిమ్మ చీకటిగా ఉన్న ఆకాశం ఒక్కసారిగా వెలుగులు సంతరించుకుంది అక్కడ నిండు చందమామ రూపం లొ అమ్మవారి చెవి తాటంకం ఉంది దాన్ని దర్శించిన తుందిరా మహారాజు,, ప్రజలు ఒక్కసారిగా అభిరామ భట్టుకు,, అభిరామి అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేసారు..
Famous Posts:
- మీ పుట్టిన తేది ప్రకారం ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంచితే శుభం
- ఈ రూల్స్ తప్పక పాటించండి
- కొత్త కోడలు రాగానే సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారు?
- మంగళ, శుక్రవారాల్లో ఎవరికీ డబ్బు ఇవ్వకూడదా?
- భర్త భార్య మాట వినాలంటే ఏమి చేయాలి ?
- వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.
- శివుడు చెప్పిన ‘ఆదివిద్య’లు
- శివ గుణాలు లోకానికి సందేశాలు
- భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?
- కూతురా కోడలా ఎవరు ప్రధానం...?