పూర్వము ఏడు వారాల నగలకు ఎంతో ప్రత్యేకత సంతరించుకున్నది. ఏడువారాల నగల గురించి ఎంతో గొప్పగా చెప్పుకునేవారు. ఈనాడు కూడా వాటి గురించి తెలుసుకోవడం ఆసక్తికరమే!
మన పూర్వీకులు గ్రహాల అనుగ్రహము కోసము, ఆరోగ్యరీత్య స్త్రీ పురుషులు బంగారు నగలను ధరించెడివారు. వారము రోజులు అనగా ఆదివారము మొదలు శనివారము వరకు రోజుకొక విధమైన బంగారు ఆభరణములను ధరించెడివారు. వీటినే ఏడు వారాల నగలు అంటారు. గ్రహాలకు అనుకూలముగా కంఠహారములు, గాజులు, కమ్మలు, ముక్కుపుడకలు, పాపిటబిల్ల, దండెకడెము (వంకీ), ఉంగరాలు మొదలగు ఆభరణాలను ధరించెడివారు.
ఏ రోజున ఏయే నగలు ధరించెడివారు
ఆదివారము - వారంలో మొదటి రోజు ఆదివారం కాబట్టి సూర్యుడిని ప్రసన్నం చేసుకోడానికి కెంపులు పొదిగిన కమ్మలు, హారాలను ధరించడం.
సోమవారము - సోమవారం ముత్యాలతో తయారు చేసిన గాజులు, హారాలను ధరిస్తే చంద్రుడి ప్రభావం పడకుండా ఉంటుందని భావించేవారు.
మంగళవారం - పగడాలు పొదిగిన ఉంగరాలు, దండలను మంగళవారం ధరిస్తే కుజ దోషం నుంచి ఉపశమనం పొందుతామని అనుకునేవారట.
బుధవారం - పచ్చల పతకాలు, గాజులు, చెవి దిద్దులను బుధవారం ధరిస్తే బుధుడు అనుగ్రహం ఉంటుందని నమ్మకం.
గురువారము - గురువారం కనక పుష్యరాగంతో తయారు చేసిన బంగారు కమ్మలు, ఉంగరాలు, హారాలతో అలంకరించుకుంటే బృహస్పతి ప్రసన్నమవుతాడని నమ్మేవారు.
శుక్రవారం - శుక్రవారం వజ్రాల హారాలు, ముక్కుపుడక, గాజులు ధరించుకుంటే శుక్రుడు శుభాలను కలిగిస్తాడని నమ్మేవారు.
శనివారము - శనివారం నాడు నీలమణి హారాలతో అలంకరించుకుంటే శని ప్రభావం మనపై పడకుండా ఉంటుందని నమ్మేవారు.
Famous Posts:
> పూరీ జగన్నాథ్ దేవాలయం యొక్క అంతుచిక్కని రహస్యాలు
> తిరిగి అతుక్కునే శివలింగం ఎక్కడ ఉందో తెలుసా?
> విచిత్ర వినాయక దేవాలయము ఓ అద్భుతమైన దేవాలయం ఉంది
> ఇంటి ఇల్లాలు చేయకూడని కొన్ని పనులు
> రాబోయే రోజుల్లో బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించిన ఈ నిజాలు మీకు తెలుసా ?
> ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలో మీకు తెలుసా ?
> తెలుగు సంవత్సరాలు 60 మాత్రమే ఎందుకు ఉంటాయో తెలుసా