ఆగస్ట్ 8న వచ్చే ఆదివారం అలాంటిలాంటి రోజు కాదు. అరుదైనది, ప్రత్యేకమైనది, అద్భుతమైనది. ముఖ్యంగా ఈ ఆదివారం సూర్య భగవానుడు... పుష్యమి నక్షత్రంలో ఉదయం 9గంటల 30 నిమిషాల వరకు ఉంటారు. ఆ తర్వాత ఆశ్లేష నక్షత్రంలోకి వెళ్లిపోతారు. సూర్యుడు పుష్యమీ నక్షత్రంలో ఉండేంత వరకూ ఆదివారం అద్భుతమైన రోజుగా చెబుతున్నారు. దాన్నే రవి పుష్యయోగం అని పిలుస్తున్నారు. దానికితోడు ఆదివారం నాడు అమావాస్య కూడా. ఇలా సూర్య భగవానుడు... ఆదివారం వేళ పుష్యమీ నక్షత్రంలో ఉండటం అనేది అరుదైన, అద్భుతమైన రోజు అని పండితులు చెబుతున్నారు. పైగా అమావాస్యతో వచ్చిన రోజు ఇది. ఏదైనా మంచి పూజ చేసేటప్పుడు అమావాస్య వస్తే... అద్భుతంగా పనిచేస్తుందని వివరిస్తున్నారు.
ఈ ఆదివారం చేసే కార్యక్రమం ఆర్థిక వృద్ధిని కలిగిస్తుంది. వాస్తు దోషాలు పోగొడుతుంది. అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు పొందేలా చేస్తుంది. రాజయోగం పట్టిస్తుంది. కష్టాలు, దారిద్ర్యం పోగొడుతుంది. జీవితంలో బాగా ఎదిగేందుకు ఇది ఉపయోగపడుతుందని పండితులు చెబుతున్నారు.
సూర్యోదయం సమయంలో క్షిప్ర నక్షత్రం అయిన పుష్యమి తో ఉన్నది. ఇది ఎంతో అరుదైన..
విశేషమైన సమయం. ఈ సమయం లో చేసే జప, పూజాది క్రతువులు, దానాలు పరిహారాలు
ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తాయి.
ఆదివారం అమావాస్య ఆశ్లేష నక్షత్రము కలయిక ఎప్పుడో ఒకసారి వస్తాయి..
ఈ అద్భుతమైన రోజున దిష్టి బాధలు ఎక్కువగా కలవారు వ్యాపార స్థలం నకు, నివసించే గృహమునకు,ఆరోగ్యం బాగాలేని వారు దిష్టి తీసుకోండి.
బూడిద గుమ్మడికాయ తో కానీ మంచి గుమ్మడికాయతో కానీ కుంకుమ నింపి కర్పూరం వెలిగించి మీయొక్క ప్రాంతీయ ఆచారం ప్రకారం దిష్టి తీసి బయట దూరంగా పడవేయండి.
మీకు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి..
అలాగే సర్ప దోషం కలవారు, కాల సర్ప దోషం కలవారు, సర్ప శాపం కలవారు, వివాహం కాని వారు, సంతానం కోరువారు, ఉద్యోగం కోసం
ఈ రోజున నాగేంద్ర స్వామీకి అభిషేకం చేయండి. విగ్రహం ముందు దీపం వెలిగించి నీటితో కడిగి పాలతో అభిషేకం చేసి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి పువ్వులతో అలంకరణ చేసి..నైవేద్యం పెట్టే హారతి ఇచ్చి 41 ప్రదక్షణలు చేయండి. మీ సమస్యల నుండి నివారణ పొందండి.
మనదేశంలో గంగ, యమునా వంటి పుణ్య నదులు అనేకాలున్నాయి. రామేశ్వరం, కన్యాకుమారి వంటి ప్రాంతాల్లో పుణ్య సముద్ర తీర్థాలు కూడా ఉన్నాయి. అమావాస్య రోజుల్లో ఇలాంటి పుణ్య నదుల్లో, పుణ్య తీర్థాల్లో స్నానమాచరించి, పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలని.
అలాగే అమావాస్య రోజు అన్న, వస్త్ర, బియ్యం, కాయగూరలు దానం చేయాలి. ఇలా చేస్తే సిరిసంపదలు, సుఖసంతోషాలు చేకూరుతాయి. అలాగే పూర్తి అమావాస్యలో శుభకార్యాలు చేస్తే పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుందని పండితులు అంటున్నారు. అందుచేత పుష్య అమావాస్య నాడు పుణ్య తీర్థాల్లో పితృదేవతలకు అర్ఘ్యమిచ్చి వారి అనుగ్రహం పొందండి.
నియమ నిష్ఠలతో చేయండి..సకల శుభములు పొందండి.
Famous Posts:
> భర్త భార్య మాట వినాలంటే ఏమి చేయాలి ?
> వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.
> శివ గుణాలు లోకానికి సందేశాలు
>భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?
> కూతురా కోడలా ఎవరు ప్రధానం...?
> సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు?
> కాకికి అన్నం ఎందుకు పెట్టడం ?
> మీకు ఏదైనా సమస్య ఉందా అయితే వెంటనే ఈ స్వామి వారికి ఉత్తరం రాయండి
> సంతానం కోరుకునే వారికీ కచ్చితమైన పరిష్కార మార్గం
Paush Amavasya, Amavasya, amavasya 2021 date and time, ashada amavasya 2021, amavasya january, 2021 date and time, amavasya march 2021: date and time, amavasya july 2021 date, paush amavasya 2021, అమావాస్య