కుండ పెంకు లో వెలసిన శివుడు హఠకేశ్వర స్వామి వారి ఆలయ రహస్యం | Hatakeswaram Temple, Srisailam

హటకేశ్వరం, కర్నూలు జిల్లా, శ్రీశైలం మండలానికి చెందిన గ్రామము. శ్రీశైలమల్లిఖార్జున దేవస్థానమునకు మూడు కిలోమీటర్ల దూరములో కల మరొక పుణ్యక్షేత్రం హటకేశ్వరం. ఇక్కడ హటకేశ్వరాలయము ఉంది. ఈ పరిసరాలలోని శ్రీ ఆది శంకరాచార్యులవారు నివసించారు.

శ్రీశైలంలో హాటకేశ్వరము అని ఒక దేవాలయం ఉంది. అది చిత్రమయిన దేవాలయం. ఒక బంగారు లింగం తనంత తాను కుండపెంకునందు ఆవిర్భవించిన హాటకేశ్వర దేవాలయము క్షేత్రము కనుక దానిని ‘హాటకేశ్వరము అని పిలుస్తారు.

ఒక చిన్న కథ 

హటకేశ్వరం క్షేత్రం గురించి చెప్పుకునేటప్పుడు ... మహాభక్తుడైన కుమ్మరి కేశప్ప గురించి కూడా తప్పని సరిగా చెప్పుకోవలసి వస్తుంది. నిస్వార్ధమైన సేవతో ... అనితర సాధ్యమైన భక్తితో సాక్షాత్తు సదాశివుడి అనుగ్రహాన్ని పొందిన కేశప్ప, శ్రీ శైలం సమీపంలోని ఒక గ్రామంలో నివసిస్తూ ఉండేవాడు. కుమ్మరి కులానికి చెందిన కేశప్ప ... తన వృత్తిని చేసుకుంటూనే, శ్రీశైల దర్శనానికి వచ్చే భక్తులకు భోజన వసతులు ఏర్పాటు చేసేవాడు.

శివయ్య దర్శనానికి వెళ్లే వారు అక్కడ భోజనాలు చేసి ఆయన సేవను కొనియాడుతూ ... దారి పొడవునా ఆయన గురించి చెప్పుకుంటూ వుండేవారు. దాంతో కుమ్మరి కేశప్ప పేరు అందరికీ సుపరిచితమైపోయింది. ఇది సహించలేకపోయిన ఇరుగుపొరుగువారు ... ఓ రాత్రి వేళ అతని కుండలను పగులగొట్టడమే కాకుండా, కుండలను తయారు చేసే 'అటికె'ను కూడా పాడు చేశారు.

తెల్లారగానే జరిగింది చూసిన కేశప్ప లబోదిబోమన్నాడు. శివరాత్రి పర్వదినం రావడంతో యాత్రికుల సంఖ్య పెరిగింది. అటికె పాడైపోయినందున ఏం చేయాలో పాలుపోక కేశప్ప దిగాలు పడిపోయాడు. ఎలాగైనా అటికెను బాగు చేయాలనే ఉద్దేశంతో నానా తంటాలు పడసాగాడు. అదే అదనుగా భావించిన ఇరుగు పొరుగు వారు కావాలని చెప్పేసి భోజనం కోసం అతని ఇంటికి యాత్రికులను పంపించారు.

అమ్మడానికి కుండలు లేవు ... తయారు చేయడానికి అటికె లేదు. యాత్రికులను సాదరంగా ఆహ్వానించిన కేశప్ప, ఎలా భోజనాలు ఏర్పాటు చేయాలో తెలియక పెరట్లో కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడు అటికె పై శివుడు ప్రత్యక్షమై, లోపలోకి వెళ్లి యాత్రికులకు భోజనాలు వడ్డించమని చెప్పాడు. శివుడికి నమస్కరించి లోపలి వెళ్ళిన కేశప్పకి అక్కడ కుండల నిండుగా వివిధ రకాల పదార్థాలతో కూడిన భోజనం కనిపించింది. దానిని యాత్రికులకు కడుపు నిండుగా ... సంతృప్తిగా వడ్డించాడు.

శివుడు అటికెలో ప్రత్యక్షమైన ఈ ప్రదేశమే 'అటికేశ్వరంగా' పిలవబడి కాలక్రమంలో 'హటకేశ్వరం'గా ప్రసిద్ధి చెందింది. సాక్షాత్తు సదాశివుడే ఆవిర్భవించేలా చేయగలిగిన మహా భక్తుడిగా కేశప్ప చరిత్రలో నిలిచిపోయాడు.

విశేషాలు 

అక్కడ మెట్లు బాగా క్రిందికి వస్తే ఫాల దారాలు, పంచ దారాలు అని అయిదు ధారలు పడుతుంటాయి. పరమశివుని లలాటమునకు తగిలి పడిన ధారా ఫాలధార. అనగా జ్ఞానాగ్ని నేత్రమయిన ఆ కంటినుండి, పైనుండి జ్ఞానగంగ మరింతగా తగిలి క్రింద పడిన ధార. ఇది శివుడి లలాటమును తగిలి వస్తున్నధార అని లోపలికి పుచ్చుకుంటే ఉత్తర క్షణం మీరు గొప్ప ఫలితమును పొందుతారు. ఎందుచేత ఇలా ఏర్పడింది? ఈశ్వరాలయంలో తీర్థం ఇవ్వరు కాబట్టి సాక్షాత్తు సాకార రూపుడయిన శంకరునికి తగిలి పడిన ధార ఫాలధార. పంచధారలు అయిదు రకములుగా ప్రకాశిస్తున్న భగవంతుని శిరస్సులకు తగిలి పడిన ధారలు. ఆ తీర్థం తీసుకునేటప్పుడు మర్యాద పాటించాలి. చెప్పులతో వెళ్ళకూడదు. శంకర భగవత్పాదుల వారు తపస్సు చేసి అక్కడే శివానందలహరి చెప్పారు. అక్కడ ఆయనకు భ్రమరాంబికా దేవి ప్రత్యక్షం అయింది. చంద్రశేఖర పరమాచార్య స్వామి తపస్సు చేసుకుంటూ ఉండిపోతాను అన్న ప్రదేశం అదే. అంత పరమమయిన ప్రదేశంలో పంచధారలు పడతాయి. అందులో ఒకటి బ్రహ్మధార. ఒకటి విష్ణు ధార, ఒకటి రుద్రధార, ఒకటి చంద్రధార, ఒకటి దేవధార. ఈ పంచధారలను స్వీకరించడం సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త లోక సాక్షులయిన సూర్యచంద్రులు ఈ అయిదు తీర్థములను అక్కడ తీసుకోవచ్చు. అంత పరమ పావనమయిన క్షేత్రం శ్రీశైల క్షేత్రం..

హటకేశ్వర ఆలయం ఎలా చేరుకోవాలి ? 

హటకేశ్వర ఆలయం శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానం నుండి మూడు కిలోమీటర్ల దూరంలో కలదు. రోడ్డు ప్రయాణం శ్రీశైలం దేశం లోని ప్రధాన పట్టణాల కు రోడ్ మార్గం లో చక్కగా కలుపబడి వుంది. అనేక ప్రభుత్వ బస్సులు కలవు. అయినప్పటికీ, మీరు బస్సు టికెట్ల ని ముందుగా రిజర్వు చేసుకోవటం సూచించ తగినది. 

రైలు ప్రయాణం శ్రీశైలం కు రైలు స్టేషన్ లేదు. సమీప రైలు స్టేషన్ గుంటూరు - హుబ్లి లైన్ పై కల మర్కాపూర్ లో కలదు. శ్రీశైలం కు ఇది సుమారు 85 కి. మీ.ల దూరం లో కలదు. బస్సు లేదా ప్రైవేటు టాక్సీ ల లో శ్రీశైలం చేరవచ్చు. బస్సు ప్రయాణం చవక.

విమాన ప్రయాణం శ్రీశైలం పట్టణానికి ఎయిర్ పోర్ట్ లేదు. సమీప విమానాశ్రయం 201 కి. మీ. ల దూరం లో హైదరాబాద్ లో కలదు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ దేశం లోని ఇతర ప్రధాన నగరాలకు, మరియు విదేశాలకు కూడా అనుసంధానించబడి వుంది. విమానాశ్రయం నుండి శ్రీశైలం కు టాక్సీ ల లో చేరవచ్చు.

Famous Posts:

మంగళ, శుక్రవారాల్లో ఎవరికీ డబ్బు ఇవ్వకూడదా? 

భర్త భార్య మాట వినాలంటే ఏమి చేయాలి ? 

వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.

శివుడు చెప్పిన ‘ఆదివిద్య’లు

శివ గుణాలు లోకానికి సందేశాలు

భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?

కూతురా కోడలా ఎవరు ప్రధానం...? 

సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు?

Hatakeswaram Temple, Hatakeswaram, Srisailam, mallikarjuna jyotirlinga, lord shiva, srisailam history

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS