సాధారణంగా డబ్బుంటే చాలు అని అందరూ అనుకుంటారు. డబ్బుతో ప్రపంచం ముడిపడి ఉందని భావిస్తారు. డబ్బుంటే ఏదైనా చేయొచ్చని అనుకుంటారు. మనకు వచ్చే ఎటువంటి సమస్య అయినా డబ్బు సులభంగా పరిష్కరించేస్తుందని అందరూ నమ్ముతారు. డబ్బుకంటే కూడా మూడు విషయలు ప్రపంచంలో చాలా గొప్పవని చాణుక్యుడు అంటారు.
Also Read : ఈ ఎనిమిది మందిని అవమానిస్తే దేవుని అవమాన పరిచినట్లే : చాణక్య నీతి
ఆ మూడు ముఖ్యమైన విషయాలకోసం డబ్బు మొత్తం ఖర్చు అయిపోయినా బాధ పడకూడదని ఆయన వివరిస్తారు. డబ్బు పొతే, కష్టపడి సంపాదించవచ్చు.. కానీ, ఈ మూడు విషయాలు కోల్పోతే మాత్రం ఎటువంటి పరిస్థితిలోనూ తిరిగి తీసుకురాలేమని ఆచార్య చాణక్య కచ్చితంగా చెప్పారు. మూడు విషయాలు ఏమిటో.. వాటి పాధాన్యత ఏమిటో తెలుసుకుందాం.
1) మతం: డబ్బు కంటే మతం పెద్దది. ఏదైనా పొందాలనే ముసుగులో ఎప్పుడూ మతాన్ని వదులుకోకూడదు. మన తప్పొప్పులను గుర్తించడానికి మతం మనకు సరైన దారిని బోధిస్తుంది. మతాన్ని అనుసరించడం ద్వారా, ఒక వ్యక్తికి సమాజంలో గౌరవం లభిస్తుంది. అటువంటి పరిస్థితిలో, మతం మార్గంలో డబ్బు వస్తే, అటువంటి డబ్బును తిరస్కరించడం మంచిది. మతం ఎప్పుడూ మంచే చేస్తుంది. కానీ డబ్బు చెడునూ మూటగట్టి ఇస్తుంది.
2) సంబంధాలు: నిజమైన సంబంధాలు కనుగొనడం ప్రపంచంలో చాలా కష్టం. ఒక వ్యక్తి మిమ్మల్ని హృదయం నుండి చాలా ప్రేమిస్తాడు. అతను మీ నిజమైన స్నేహితుడు అయితే, అలాంటి వ్యక్తుల ముందు డబ్బుకు విలువ ఉండదు. మీరు ప్రపంచంలోని అన్ని ఆనందాలను డబ్బుతో కొనుగోలు చేయవచ్చు, కానీ, మీరు ఒకరి ప్రేమను కొనలేరు. మిమ్మల్ని ప్రేమిస్తున్న వ్యక్తి మీ ఆనందంలోనూ.. దుఃఖంలోనూ మీకు మద్దతు ఇస్తాడు. మీకు డబ్బు లేనప్పుడు కూడా, ఆ వ్యక్తి ఎప్పటికీ మీకు అండగా నిలుస్తాడు. అటువంటి నిజమైన స్నేహితుడు, శ్రేయోభిలాషి లేదా బంధువు కోసం డబ్బును మీరు వదులుకోవాల్సి వస్తే వదిలేసుకోవాలి అని చెబుతారు చాణక్య. మానవ సంబంధాల ముందు డబ్బు ఎందుకూ పనికిరానిదని ఆయన చెప్పారు.
3) ఆత్మగౌరవం: ప్రపంచంలోని ఏ వ్యక్తికైనా, అతని ఆత్మగౌరవం కంటే గొప్పది ఏమీ ఉండకూడదు. ఆత్మగౌరవాన్ని కాపాడటానికి మీరు డబ్బును త్యాగం చేయవలసి వస్తే, అప్పుడు ఏ మాత్రం ఆలోచించకుండా డబ్బును వదిలేయాలి.. మీరు కోల్పోయిన డబ్బును మళ్ళీ సంపాదించవచ్చు, కాని విశ్వాసం.. మీ గౌరవం దెబ్బతిన్నట్లయితే దాన్ని తిరిగి తీసుకురావడం చాలా కష్టం అవుతుంది.
Famous Posts:
> హనుమ నామస్మరణం సర్వపాప నివారణం
> స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?
> సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము
> శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత
> తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?
చాణక్య నీతి, Chanakya, Acharya Chanakya, ethics of chanakya, chanakya real photo,
chanakya story Telugu, chanakya full name