సమస్యలకు సమాధానం శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి దీక్ష..| Meaning & Importance of Varahi Ammavari Navaratri Deeksha

సమస్యలకు సమాధానం శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి దీక్ష..

అత్యంత శుభ ఫలితాలను మనో అభీష్టాలను నెరవేర్చే శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు ఈ నెల జూన్30 వ తారీకు నుండి మొదలవుతున్నాయి జులై8th తారీకు తో ముగుస్తున్నాయి..

గుప్త నవరాత్రులు: ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి ఆషాడ శుద్ధ నవమి వరకు గల సమయం ఇవి ఎక్కువగా ప్రచారంలో లేవు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు మన సాంప్రదాయంలో ఉన్న నాలుగు నవరాత్రుల్లో అత్యంత మహిమాన్వితమైనవి శక్తివంతమైనవి శ్రేష్ఠమైనవి ఈ ఆషాడ మాస గుప్త నవరాత్రులు మొట్టమొదటిసారిగా తెలుగు రాష్ట్రాలలో ఈ నవరాత్రులు నేను నా అభిమానులు ఎక్కువ సంఖ్యలో ఆచరించడానికి ప్రయత్నం చేస్తున్నాం కారణం ప్రస్తుత సమయంలో అందరూ అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఇటువంటి సమస్యలను సులభంగా పరిష్కరించే వరాలిచ్చే తల్లి వారాహ..

ఎవరైతే ఈ నవరాత్రులు శ్రద్ధగా ఆచరిస్తారో వారి యొక్క అన్ని సమస్యలు అమ్మవారి అనుగ్రహం తో తప్పకుండా పరిష్కారం అవుతాయి.

శ్రీ వారాహి అమ్మవారి విశిష్టత: సప్త మాతృకల లో ఒక్కరు శ్రీ వారాహి పర దేవత లలితా పరమేశ్వరి సర్వ సైన్య అధ్యక్షురాలు శ్రీ వారాహి అమ్మవారు మహావిష్ణు మరో రూపం మహాలక్ష్మి ప్రతిరూపం సర్వ మంగళ స్వరూపం దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణ గావించుటకు పాశమును దండమును ధరించిన దండ నాథ వారాహి అమ్మవారు.

ఉగ్ర రూపంలో కనిపించే అపార కరుణామయి పరమ కృపా మయి వారాహి దేవత వారాహి ఆరాధన అందరూ చేయకూడదు అని కొన్ని అపోహల వలన అమ్మవారి ఆరాధన తక్కువ మందికి మాత్రమే తెలుసు అలాగే ఎవరికి తెలియకుండా గుప్తంగానే మిగిలిపోయాయి ఇది పూర్తిగా సత్యదూరం ప్రస్తుత కాలంలో అమ్మవారి ఆరాధన ప్రతి ఒక్కరికి అవసరం అమ్మవారి ఆరాధనతో అరిషడ్వర్గాలు  ఆధీనంలో ఉంటాయి కామ క్రోధ మద మోహ మద మాత్సర్యాల నుండి అమ్మవారు మనల్ని సంరక్షిస్తుంది మన మనసును నియంత్రిస్తుంది అమ్మవారు సమయ సమయ సంకేత ఏది ఎప్పుడు ఎలా చేయాలో ఎలా సాధించాలో తెలియజేస్తూ ఉంది అమ్మవారు సాక్షాత్ వసుంధర భూదేవి నాగలిని రోకలిని ధరించిన ధాన్య దేవత

పంటలు సరిగా పండాలన్న వ్యవసాయం అనుకూలించాలన్నా ప్రతి ఒక్క రైతు తప్పక వారాహి ఆరాధన చేయాలి శ్రీకరి శుభకరీ సర్వమంగళ కారిణి కళ్యాణ స్వరూపిణీ అమంగళం నాశిని సుమంగళి కారిని సౌభాగ్య ప్రదాయిని విశుక్ర ప్రాణ హరిని వారాహి అమ్మవారు వారాహి అమ్మవారి ఆరాధన అత్యంత శుభప్రదం సౌభాగ్య ప్రదం.

ఎటువంటి తీవ్ర సమస్యలైన అమ్మవారి ఆరాధన పరిష్కారం లభిస్తుంది అమ్మవారి ప్రీతిగా ఈ నవరాత్రులు శ్రద్ధగా నిష్ఠతో ఆచరిస్తే మన యొక్క మనో అభీష్టాలు తప్పకుండా తీరుతాయి భూమి పరమైన సమస్యలు ఉన్న భూ తగాదాలు ఉన్న కోర్టు కేసులు ఉన్న శత్రు సమస్యలు ఉన్న తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నా జీవితంలో స్థిరత్వం లేకపోయినా మనకంటూ రక్షణ లేకపోయినా ఇంట్లో తరచుగా అరిష్టాలు జరుగుతున్న ఆర్థిక స్థిరత్వం లేకపోయినా ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు ఎక్కువైనా అమ్మవారి నవరాత్రి దీక్ష చేస్తే ఈ సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి అమ్మవారి ఆరాధనతో ఫలానా సమస్య అంటూ ఉండదు ఎటువంటి సమస్య అయినా పరిష్కారం అవుతుంది కాబట్టి మిత్రులారా మహిమాన్విత నవరాత్రి దీక్ష అందరూ చేపట్టండి దీక్ష విధానం తెలియజేస్తాను

నవరాత్రి దీక్ష విధానం:

ఈ నెల 11 వ తారీకు తో నవరాత్రి ప్రారంభం అవుతుంది దీనికి ముందుగా ఒక రోజు అనగా రేపు మీ గృహాన్ని శుభ్రం చేసుకోండి పూజ కి కావాల్సిన ద్రవ్యాలు తెచ్చి పెట్టుకోండి.

అవకాశం ఉన్నవారు మీ పూజ గదిలో ఒక పీటను పెట్టి దాని మీద ఎర్రని వస్త్రం పరిచి వారాహి అమ్మవారి చిత్ర పటం కానీ విగ్రహం కానీ ఉంటే పెట్టండి ఒకవేళ ఇవి రెండు లేకపోతే లలిత అమ్మవారి చిత్రపటం కానీ దుర్గ అమ్మవారి చిత్ర పటం కానీ విగ్రహం కానీ పెట్టండి ఇది ఒక రోజు ముందుగా సిద్ధం చేసుకుని పెట్టండి నవరాత్రి దీక్ష ప్రారంభం అయ్యే  రోజు అనగా ఆదివారం రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి అవకాశం ఉన్నవారు దీక్ష వస్త్రాలు ధరించండి దీక్ష వస్త్రాలు ధరించడం వీలు కాని వ్యక్తులు మెడలో దీక్షగా ఒక కండువా తొమ్మిది రోజులు ధరించాలి.

ముందుగా సిద్ధం చేసుకున్న అమ్మవారి పీఠం దగ్గర దీపారాధన చేసి మీరు ఏ సంకల్పంతో నవరాత్రి దీక్ష చేస్తున్నారో ఆ సంకల్పాన్ని అమ్మవారికి మనస్ఫూర్తిగా తెలియజేయాలి పిమ్మట గణపతి ప్రార్థన చేసి పూజ ప్రారంభించాలి అవకాశం ఉన్నవారు అమ్మవారి విగ్రహానికి అభిషేకం చేయండి అభిషేకం అనునది తప్పనిసరికాదు అమ్మవారికి  స్త్రీ మూర్తులు ఎర్రటి చీర ఎర్రని గాజులు 9రోజులు పీఠం దగ్గర ఉంచండి అవకాశం ఉన్న మహిళలు ఆచరించండి వారాహి అష్టోత్తర నామాలు కానీ సహస్రనామాలు కానీ మీకు లభ్యమైతే వీటిని పఠిస్తూ అమ్మవారి ముందు కుంకుమార్చన చేయండి ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని అర్చించండి దానిమ్మ గింజలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఈ తొమ్మిది రోజులు పాదరక్షలు ధరించకూడదు మాంసానికి మద్యానికి దూరంగా ఉండండి బ్రహ్మచర్యం పాటించండి మంచం మీద పడుకోవద్దు నేల పైన చాప వేసి పడుకోండి.

ఈ తొమ్మిది రోజులు ఉదయం మరియు రాత్రి రెండు పూటలా స్నానం చేసి అమ్మవారికి దీపం ధూపం నైవేద్యం పెట్టాలి.

వారాహి అమ్మవారి సంబంధిత స్తోత్ర పఠనం ఈ తొమ్మిది రోజులు విశేషంగా చేయాలి.

ఇది ఆచరించడం కొంతమందికి ఇబ్బందికరంగా అయినప్పటికీ అమ్మవారి అనుగ్రహం పొందడానికి సులభ పరిష్కార మార్గం ఇది.

ఇది ఆచరించడం సాధ్యం కాని వారికి సులభంగా నవరాత్రి దీక్ష చేసే విధానం.

దీక్ష వస్త్రాలు లేకున్నా ఇబ్బంది లేదు కానీ మెడలో దీక్ష కండువా తొమ్మిది రోజులు ధరించాలి పీఠం పెట్టి అమ్మవారిని పూజించడం ఇబ్బందికరంగా ఉంటే మీ పూజ గదిలో అమ్మవారి చిత్రపటానికి ఉదయం సాయంత్రం రెండు పూటలా స్నానం చేసి దీపారాధన చేసి పూలు పండ్లు నైవేద్యంగా పెడితే సరిపోతుంది తొమ్మిది రోజులు చెప్పులు వేసుకో కూడదు మద్యానికి మాంసానికి దూరంగా ఉండాలి బ్రహ్మచర్యం పాటించాలి నేలమీద పడుకోవాలి స్తోత్ర పారాయణం చేయడం కుంకుమార్చన చేయడం ఇబ్బందికరంగా ఉన్న వ్యక్తులు వారాహి అమ్మవారి ద్వాదశనామాలు ఉదయం సాయంత్రం చదివితే సరిపోతుంది అత్యంత సులభంగా మీ వృత్తులు చేసుకుంటూ అమ్మవారి నవరాత్రి దీక్ష చేసే విధానాన్ని సులభంగా మీకు తెలియజేశాను అవకాశం ఉన్నవారు అమ్మ వారి దీక్ష చేయండి సకలశుభాలు అష్ట ఐశ్వర్యాలు సర్వ సుఖాలు పొందండి.

అమ్మవారి పీఠం ముందు సమర్పించే చీర గాజులు అనారోగ్య వ్యక్తులను ఆరోగ్యవంతులుగా చేస్తుంది కల్యాణం కానీ స్త్రీలకు శీఘ్రంగా కళ్యాణాన్ని చేస్తుంది సంతానానికి దూరంగా ఉన్న వ్యక్తులకు సంతానాన్ని సౌభాగ్యాన్ని ఏర్పరుస్తుంది.

అమ్మవారి ముందు చేసే కుంకుమార్చన ఆ యొక్క కుంకుమ ఎంతో మహిమాన్వితమైనది ఈ కుంకుమను భద్రంగా దాచుకోండి ప్రతిరోజు ఈ కుంకుమను ధరించడం వల్ల జయము విజయము వెంటే ఉంటాయి.

అవకాశం ఉన్నవారు తొమ్మిది రోజులు అమ్మవారి ముందు అఖండ దీపారాధన చేయండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషాలు విపరీత ప్రభావాలు తొలగిపోతాయి

 దీక్ష చేయడం సాధ్యం కాని వ్యక్తులు కనీసం తొమ్మిది రోజులు చెప్పులు వేసుకోకుండా ఉండండి.

Famous Posts:

సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు

ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు

ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే

అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం

> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి

100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం

> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

varahi devi mantra in telugu, varahi devi moola mantra, varahi stotram, varahi sadhana pdf, varahi amman miracles, varahi mantra pdf, varahi beej mantra, varahi gayatri mantra, varahi deeksha

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS