ఈ ఎనిమిది మందిని అవమానిస్తే దేవుని అవమాన పరిచినట్లే : చాణక్య నీతి | Insulting these eight people is like insulting God: Chanakya nithi

ఈ ఎనిమిది మందిని అవమానిస్తే దేవుని అవమాన పరిచినట్లే : చాణక్య నీతి

అర్థశాస్త్ర పితామహుడు ఆచార్య చాణిక్యుడు ఒక వ్యక్తి భౌతికంగా కలిగినటువంటి  సంపద ద్వారా పూర్తి ఉత్తముడు కాలేడని మరియు కేవలం సంపద హోదా అతని ఖ్యాతిని  పెంచలేవని వివరిస్తారు.

ఈ సంపద కన్నా ఎన్ని చేతులు ఆవ్యక్తిని ఆశీర్వదించాయన్నదాని మీదే ఆ వ్యక్తి యొక్క ఔన్నత్యం బయటపడుతుందని తన అర్థశాస్త్రంలో చెబుతారు. దేవుడు భూమ్మీద అన్ని చోట్లా లేడు కాబట్టి తల్లిదండ్రులను సృష్టించాడు. మీరు ఎంతగా ఎవరిని ప్రేమించిన తల్లిదండ్రుల ప్రేమను మాత్రం భర్తీ చెయ్యలేరు అని చెబుతారు.

Also Readచాణక్య సూత్రం ప్రకారం ఇలాంటి వారు ఎప్పటికీ ధనవంతులు కాలేరు

ఈ ఎనిమిది మంది వ్యక్తులలో తల్లిదండ్రులతో పాటు ప్రతి వ్యక్తి  జీవితంలో మారువేషంలో అనగా రకరకాలుగా ఏడుగురు ప్రభావవంతమైన వ్యక్తులు కూడా ఉంటారు. వీరు ఆపదలో మిమ్ములను ఆదుకుంటూ ప్రతి విషయంలోనూ ఏదో ఒక రీతిలో మనకు వెన్ను దండగా ఉంటారు. కాబట్టి ఇంతలా మనకోసం ఆలోచిస్తూ మనతో ఉన్న వారిని కించపరచడం లేదా అవమాన పరచడం అనేది ఒక హీనమైన చర్య గా మారుతుంది. అంతేకాదు ఇలా చేయడం అనేది దేవున్నే అవమానినించినంతటి పాయం. మరి తల్లిదండ్రులతోపాటు మనము జీవితంలో మనం అవమానించ కూడని వ్యక్తులు ఎవరు? వారితో ఎలా ఉండకూడదు? ఎలా ఉండాలి వంటి విషయాలు సంబంధించిన సమాచారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.

చాణక్య నీతి ప్రకారం ఈ ఎనిమిది మందిని అవమానపరచడం దేవున్ని అగౌరపరచడంతో సమానం. కావున  మీ జీవితంలో ఎన్నడు వీరిని కించపరిచే వద్దు.

అందులో మొదటిగా అమ్మ:

అమ్మ విలువ తెలిసి ఆ విలువను బట్టి తీసుకునే వాళ్ళు కాకుండా దేవున్ని  అమితంగా ఆర్థిస్తూ తల్లిని పట్టించుకోని వారికి కచ్చితంగా ఈ విషయం తెలియల్సిందే.  9 నెలలు మిమ్మల్ని తన కడుపులో భద్రంగా దాచుకొని మరియు బాహ్య ప్రపంచంలో మీ క్షేమం కోసం నిరంతరం  పాకులాడే నిస్వార్థ జీవి అమ్మ. ఈ ప్రపంచంలో తల్లి కోసం ఎన్ని త్యాగాలు చేసినా రుణం మాత్రం తీరదు అన్నది నిజం. చావు అంచుల దాకా వెళ్లి చావుతో సైతం పోరాడి ఒక బిడ్డకు జన్మనిచ్చిన తల్లి రుణం తీర్చుకోవడం ఎన్నటికీ అసాధ్యమే. అమ్మ ప్రేమకు బదులు అనేదే లేదు విశ్వంలో కాబట్టి తల్లిని దైవంతో సమానంగా చూసుకుంటే దైవాన్ని పరోక్షంగా పూజిస్తున్నట్టె లెక్క. అలా కాకుండా ఆమెని పట్టించుకోకుండా దేవుడా దేవుడా అంటూ గుడి చుట్టూ తిరిగినంతమాత్రాన పుణ్యం కాదు కదా అంటున్న పాపం కూడా వదలదు.

రెండు తండ్రి:

చాణిక్య ని ప్రకారం బిడ్డ పుట్టక ముందు నుంచి బాధ్యతలను కలిగి ఉంటాడు తండ్రి. వారిని పెంచి పెద్ద చేయడంతో అహర్నిశలు కష్టించిపనిచేయడం వంటివి తండ్రి గొప్పతనానికి నిదర్శనం. దేవుడు అందరి బాగోగులు చూడలేక తన బాధ్యతను తల్లిదండ్రులకు ఇచ్చాడు. వారిని అవమానపరచడం కన్నా పాపం మరొకటిలేదు. తండ్రి లేకపోతే నీకు జన్మ అర్థం లేదు తండ్రిని పోషించలేని వాడు పట్టించుకోలేని వాడు ఎప్పటికి కూడా దేవునికి ఇష్టకరం అవ్వలేడు. కాబట్టి జీవితంలో మీ లక్ష్యాన్ని చేరుకునే వరకు తండ్రి చాటు నుండి రెక్కలు వచ్చాక ఎగిరిపోయి బతుకునిచ్చిన తండ్రిని పట్టించుకోలేకపోతే కచ్చితంగా దానికి ప్రతిఫలం ఉంటుందని అంటారు చాణిక్యుడు.

ముడు మీరు నైతిక విలువలు అనుక్షణం కాపాడేవాడు:

చాణక్యుని ప్రకారం మీ తల్లిదండ్రులే  కాకుండా జీవితంలో విలువను నేర్పించిన వ్యక్తులు కొందరు ఉంటారు. నైతిక విలువలు అంటే తెలియకపోవచ్చు నువ్వు సమాజం తోనూ నీ వాళ్లతోనూ ఎలా నడుచుకోవాలో ఏది మంచి ఏది చెడు అని చెప్పే వాళ్ళు ఉంటారు. వారి మాటలను ఆచరిస్తే జీవితంలో సమస్యల వైపు ప్రయాణం ఉండదు. కాబట్టి ఆ వ్యక్తికి గౌరవంతో కట్టుబడి ఉండాలి. వారు మీ స్నేహితులు, తాతలు ఇరుగుపొరుగు వాళ్లు  బంధువులు శ్రేయోభిలాషి ఇలా ఎవరైనా కావచ్చు. ప్రస్తుతం మనిషి తనవారి గురించే పట్టించుకోవడం లేదు ఇక నైతిక విలువలు నేర్పిన వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు అని అనుకుంటారేమో. అలా చేయటం అనేది దేవున్ని ధిక్కరించి   నాశనానికి బాటలు వేసుకోవడమే అంటారు చాణిక్యుడు.

నాలుగు నీకు విద్యను బోధించిన వ్యక్తి:

చాణక్యుడి ప్రకారం విద్య సమాజ ఉద్ధరణకు ఆయుధం వంటివి. తల్లిదండ్రుల తర్వాత జీవితంలో ఒక గురువే  ముఖ్యమైన స్థానాన్ని పొందుతాడు. ఒక వ్యక్తికి ఆహారం ఎంత విలువైనదో విద్య కూడా అంతే విలువైనది. కావున మిమ్మల్ని విద్యావంతుడుగా మార్చి మీ భవిష్యత్తును నిర్మించే వ్యక్తి ఎవరైనా సరే అంటే మీ గురువు ఎలాంటి వాడైనా సరే అతను మీ జీవితంలో ఒక భాగమని గుర్తించాలి. అతను గురువే కావాల్సిన అవసరం లేదు. మీ అస్తవ్యస్త మార్గాన్ని సక్రమంగా మార్చగలిగే ఎవరైనా సరే మీకు గురువే. నిస్వార్థంగా మీ జీవితంలో మీ విజయానికిమార్గ నిర్దేశకులుగా ఉంటాడు కాబట్టి ఆ వ్యక్తికి తగిన విలువనిచ్చి మీరు తగిన గుర్తింపు పొందాలి.

ఐదు  మీకు భోజనం పెట్టిన వ్యక్తి:

ఈ ప్రపంచంలో మనిషి నిరంతరం డబ్బు భూమి ఆయుధం బంగారం ఆహారం ప్రతిష్ట ఉనికి వంటి మొదలైన అంశాల నడుమ కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. అనేక మంది మిత్రులతో పాటు శత్రువులను కూడా జీవితంలో భాగంగా చేసుకుంటూ ఉంటాడు. ఏదిఏమైనా మీరు ఆకలిగా ఉన్న సమయంలో మీ కడుపు నింపడానికి ప్రయత్నించే ఎవరైనా సరే దేవుడితో సమానం. ఎట్టి పరిస్థితుల్లో వాళ్లని విస్మరించకూడదు. బంగారు పళ్లెంలో భోజనం చేసే వాడికి కూడా పట్టెడు అన్నం దొరకని పరిస్థితి రావచ్చు. అలాగని ఆకలిగొన్న సమయంలో కడుపునిండా తిని ఆకలి తీరాక మీరెవరు అని చూసేవారు బ్రతికి ఉన్న నిర్జీవులు అంటారు చాణిక్య. కాబట్టి భోజనం పెట్టే వారిని గుర్తు పెట్టుకుంటే ప్రబుద్ధుడు అని పిలవబడతారు లేదు అని విస్మరిస్తే దేవుడు ముందు కుడా అఇస్టుడుగా మిగిలిపోతావు.

ఆరు స్నేహితుడు:

ఎటువంటి ఇబ్బందులు లోనైనా కష్టకాలంలో మీవెన్నుంటి నడిచే తండ్రి లాంటి వ్యక్తి స్నేహితుడు. అందరూ స్నేహితులు అలా లేకపోయినప్పటికీ అలా నిస్వార్థంతో ఉన్నటువంటి నిజమైన స్నేహితుడుని నిర్లక్ష్యం చేయడం అనేది ముమ్మాటికీ చేయకూడదు.

Also Read ; చాణుక్యుడు మహిళల గురించి చెప్పిన విషయాలు తెలిస్తే షాక్ అవ్వుతారు

ఏడు భార్య తల్లిదండ్రులు:

చాలామంది వివాహితులు తమ భాగస్వామి యొక్క తల్లిదండ్రులకు సరైన గౌరవం ఇవ్వరు. కానీ  ఆచారి చాణిక్యుడు మీ భాగస్వామి యొక్క తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులతో పాటు సమాన గౌరవాన్ని పొందగలిగే అర్హత కలిగిన వారిగా భావించారు. మీ భాగస్వామి మీద మీకు  ప్రేమ ఉంటే అంత గొప్ప భాగస్వామిని మీకు  ప్రసాదించిన మీ అత్తమామలు కూడా గొప్పవారే కదా. అందుకని మీ తల్లిదండ్రులతో పాటు మీ భార్య తల్లిదండ్రులను గౌరవించి పుజ్యనీయులుగా అలవరుచుకుంటే మీరు పరోక్ష దైవపూజ చేస్తున్నట్టే అని చెబుతారు చాణిక్య.

ఎనిమిది  సంరక్షణ ఇస్తున్న వ్యక్తి:

తల్లితో సమానంగా కొందరు తమ జీవితంలో తల్లివంటి ప్రేమను సంరక్షణను చూపుతుంటారు. భార్య స్నేహితులు మీ ప్రియమైన ప్రియమైన వారు ఎవరైనా సరే వీరి పట్ల ఎప్పుడూ విధేయతను కలిగి ఉండాలి.

పైన చెప్పిన ఈ ఎనిమిది మంది వ్యక్తులు సాక్షాత్తు దేవుళ్ళతో సమానం. వీరి పట్ల నిర్లక్ష్యం అవిధేయత శతృత్వం అవమానించడం కించపరచడం అశ్రద్ధ చూపడం హేళ భావం వంటి చర్యలకు పూనుకోవడమంటే  క్షమించరాని నేరం మరియు పాపం అని చాణిక్యుడు వివరించారు.

Famous Posts:

ఈ రూల్స్ తప్పక పాటించండి 

కొత్త కోడలు రాగానే సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారు?

మంగళ, శుక్రవారాల్లో ఎవరికీ డబ్బు ఇవ్వకూడదా? 

భర్త భార్య మాట వినాలంటే ఏమి చేయాలి ? 

వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.

శివుడు చెప్పిన ‘ఆదివిద్య’లు

శివ గుణాలు లోకానికి సందేశాలు

భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?

చాణక్య నీతి, చాణక్య నీతి సూత్రాలు pdf, chanakya niti telugu, chanakya niti pdf, Chanakya, 

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS