అన్నవరం కొండపై ఉచిత కల్యాణ మండపం పైసా ఖర్చు లేకుండా పెళ్లికి ఏర్పాటు
ఇల్లు కట్టి చూడు... పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. గతంలో ఇల్లు కట్టాలన్నా... పెళ్లి చేయాలన్నా కూడా అదో పెద్ద ప్రస్తానం. ప్రతి చిన్న పని స్వయంగా దగ్గర ఉండి చూసుకోవాల్సిందే. అయితే డబ్బు ఉంటే అదేం పెద్ద కష్టం కాదనేది నేటి మాట. డబ్బులుంటే... వారం రోజుల్లో పెళ్లి.. నెల రోజుల్లో ఇల్లు పూర్తవుతుంది. కానీ డబ్బు లేని నిరుపేదలకు మాత్రం ఇంట్లో శుభకార్యం అంటే అదో పెద్ద కలగానే ఉండిపోతుంది. ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా కనిపిస్తోంది. చివరికి గుడిలో వివాహానికి కూడా ఎంతో కొంత ఖర్చు పెట్టాల్సిందే. అలాంటి వారి కోసమే అన్నవరం దేవస్థానం వినూత్న ఆలోచన చేసింది. పైసా ఖర్చు లేకుండా కొండపై వివాహతంతు ముగించుకునేందుకు ఉచిత కల్యాణ మండపాన్ని ఏర్పాటు చేసిన అన్నవరం దేవస్థానం.
సత్యదేవుని సన్నిధిన పేదలు ఉచితంగా పెళ్లి చేసుకునేందుకు ‘శ్రీ సత్య శ్రీనివాస ఉచిత కల్యాణ మండపం’ వేదిక కానుంది. దేవస్థానం అధికారులు ఇందుకు అనుమతిచ్చారు. ఆధునిక వసతులతో ఒకేసారి 12 వివాహాలకు వీలుగా ఇక్కడ వేదికలు నిర్మించిన సంగతి తెలిసిందే. శ్రావణ మాసంలో జరిగే పెళ్లిళ్లకు అప్పుడే రిజర్వేషన్లు మొదలయ్యాయి.
అన్నవరంలో పెళ్లి అదో ‘వరం’
రత్నగిరిపై పెళ్లి చేసుకున్న వారి బతుకులు బాగుంటాయన్నది భక్తుల విశ్వాసం. ఈ కారణంతోనే ఉభయ గోదావరి జిల్లాల వారే కాదు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ వివాహాలకు ఆసక్తి చూపిస్తుంటారు. ఆర్థిక స్తోమతను బట్టి ఇక్కడ కల్యాణ మండపాలను అద్దెకు తీసుకుంటారు. ఏటా ఐదు వేలు పైగా పెళ్లిళ్లు జరుగుతాయి. తక్కువ ఖర్చుతో వివాహం చేసుకోవాలనుకునేవారు ఇప్పటి వరకూ ఆరుబయట చేసుకునేవారు. వర్షం వస్తే వీరు చాలా ఇబ్బంది పడేవారు. పెళ్లి మధ్యలో వర్షం వస్తే షెల్టర్ కిందకు పరుగులు పెట్టిన సందర్భాలెన్నో.
శ్రీసత్య శ్రీనివాస ఉచిత కల్యాణ మంటపం
3.5 కోట్లతో కల్యాణ మండపం
కొండపై పెళ్లిళ్లకు పేదలు పడుతున్న ఇబ్బందులకు స్పందించి శ్రీ లలితా రైస్ ఇండస్ట్రీస్ అధినేతల్లో ఒకరైన మట్టే శ్రీనివాస్, విద్యుల్లత దంపతులు పెద్ద మనసు చాటుకున్నారు. రూ.3.5 కోట్లతో శ్రీసత్య శ్రీనివాస ఉచిత కల్యాణ మంటపం (ఏసీ) నిర్మించారు. ఈ నెల 16న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు దీనిని ప్రారంభించారు. మంటపం కేటాయింపులో పేదలకే అగ్రాసనమని ఆలయ ఈఓ త్రినాథరావు తెలిపారు.
కల్యాణ మంటపంలో వివాహ వేదికలు
సదుపాయాలివీ..
► వివాహానికి 50 కుర్చీలు, జంబుఖానా, పెళ్లిపీటలు, కాడి, ఇతర వివాహ సామగ్రి. వధూవరులకు రెండు గదులు, బాత్‌రూం సౌకర్యం.
► వివాహ వేదికలు కావాలంటే వధూవరుల ఆధార్ కార్డులు, శుభలేఖ లేదా పురోహితుని లగ్నపత్రిక, అవసరం.
► నెల రోజులు ముందుగా రిజర్వ్ చేసుకోవాలి.
Temple Contact Details:
The Executive Office, Sri S V V S S Devasthanam Annavaram-533406, East Godavari District
Phone : 08868-238121,238125,238163
Famous Posts:
> మంగళ, శుక్రవారాల్లో ఎవరికీ డబ్బు ఇవ్వకూడదా?
> భర్త భార్య మాట వినాలంటే ఏమి చేయాలి ?
> వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.
> శివ గుణాలు లోకానికి సందేశాలు
> భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?
> కూతురా కోడలా ఎవరు ప్రధానం...?
> సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు?
Annavaram, Annavaram Temple, Annavaram Latest Kalyana Mandapam, Annavaram Marriage Function hall, Annavaram Contact Number, Annavaram Accommodation.