శాస్త్రాల ప్రకారం, ఇలాంటి ఆహారం పొరపాటున కూడా తినకూడదట.. ఎందుకో తెలుసా...
మన పురాణాల్లో ఎన్నో విలువైన విషయాలు, వాస్తవాలు దాగున్నాయి. అందుకే పెద్దలు వాటిని ఫాలో అవ్వమని పదే పదే చెబుతుంటారు.
పెద్దలు చెప్పే చాలా విషయాల్లో శాస్త్రీయత కూడా ఉంటుంది. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. 'కోటి విద్యలు కూటి కోసమే' మనలో ఎవ్వరు ఎంత కష్టపడి పని చేసినా మన నోట్లోకి ఐదు వేళ్లు ఆనందంగా.. మన కడుపు నింపుకోవడానికి తొలి ప్రాధాన్యత ఇస్తుంటాం. కరోనా వంటి కష్టకాలంలో ఆరోగ్యానికి కూడా అధిక ప్రాముఖ్యత ఇవ్వాలి. అయితే మంచి ఆహారం తీసుకున్నప్పుడే ఆరోగ్యం మెరుగువుతుంది.
Also Read : మీ ఇంటి నిర్మాణంలో ఈ తప్పులు ఎప్పటికీ చేయకండి..
మీరు తీసుకునే భోజనం సరిగ్గా లేకపోతే మీరు అనారోగ్యం బారిన పడుతుంది. 'అన్నం పరబ్రహ్మ స్వరూపం'.. అంటే అన్నం దేవుడితో సమానమని, దాన్ని ఊరికే వ్రుథా చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో భోజనం చేసే సమయంలో మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. కొన్నిసార్లు పొరపాటున ఈ ఆహారాన్ని తినకూడదు. అవేంటో మీరే చూడండి...
ధర్మ శాస్త్రం ప్రకారం, మనం భోజనం చేసే సమయంలో, ఎవరైనా మీరు భోజనం చేసే ప్లేటు నుండి దాటితే.. పొరపాటున కూడా ఆ ఆహారాన్ని తినకూడదు. అలాంటి ఆహారాన్ని తీసుకుంటే.. పాపం వస్తుందని పెద్దలు చెబుతారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు ఎప్పటికీ మరచిపోవద్దు. ఒకవేళ మీరు అలాంటి ఆహారం తీసుకుంటే, అనారోగ్యం బారిన పడే అవకాశం కూడా ఉంటుందట.
మీరు తినే ఆహారంలో బల్లి లేదా ఇతర కీటకాలు ఏవైనా పడితే.. పొరపాటున కూడా అలాంటి ఆహారాన్ని తీసుకోకూడదట. అలాంటి భోజనం చేయడం వల్ల మీరు అనారోగ్యం బారిన పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు శాస్త్రాల ప్రకారం, మీకు దరిద్రం కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే వంట చేసే సమయంలో మరియు భోజనం చేసే సమయంలో అంతా పరిశుభ్రంగా ఉందో లేదో చూసుకోవాలి. లేకుంటే మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
మనలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయంపై గొడవలు జరగడం సహజమే. అయితే ఇలాంటి సమయంలో ఇంట్లో వండిన ఆహారాన్ని తినాలని అనిపించదు. కాబట్టి ఇలాంటి సమయంలో అన్నం తినకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే అలాంటి సమయంలో భోజనం చేయడం వల్ల జీర్ణక్రియ చెడిపోతుంది. అంతేకాదు మీరు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వండేవారు మరియు భోజనం చేసే వారు మనస్సు పెట్టి చేయాలి.
మనలో చాలా మందికి వెంట్రుకలు సాధారణంగానే ఊడిపోతూ ఉంటాయి. పాకశాస్త్రం ప్రకారం, భోజనంలో వెంట్రుకలు వస్తే ఆ ఇంట్లో రోగాలు ఎక్కువ అవుతాయట. చాలా మంది ఆహారంలో వెంట్రుకలు వస్తే వాటిని తీసేసి మిగిలిన దాన్ని తినేస్తుంటారు. అయితే అలా వెంట్రుకలు కనిపించినప్పుడు వాటిని తీసేసి తినడానికి బదులు ఆ భోజనాన్ని జంతువులకు దానం చేయడం మంచిదట. శాస్త్రాల ప్రకారం అలాంటి భోజనం చేయడం వల్ల దుష్ప్రభావాలు ఎక్కువగా వస్తాయట.
మీరు తినే ఆహారంలో ఎవరైనా ఉమ్మి వేసినా లేదా పొరపాటున ఉమ్ము పడినా అలాంటి భోజనాన్ని అస్సలు తినకూడదు. అలాంటి భోజనం తినడం వల్ల శరీరంలో బలహీనత ఏర్పడుతుంది. అంతేకాకుండా మీరు కలత చెందుతారు. ఒకవేళ మీరు ఇలా చేయకపోతే.. వైద్యుడి వద్దకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలి.
Also Read : ఈ మూడు విషయాలు పాటిస్తే.. పట్టిందల్లా బంగారమే..
మీరు భోజనం చేసే సమయంలో, శునకాలు మీ దగ్గర్లో ఉంటే, వాటికి కూడా తినిపించాలి. ఎందుకంటే శునకాలను యమధర్మరాజు దూతగా భావిస్తారు. ఒకవేళ కుక్కలకు అన్నం పెట్టకుండా తింటే, మీ ఆయుషు తగ్గిపోతుంది. అంతేకాదు అనారోగ్యం బారిన పడతారు. కాబట్టి వీలైనంత వరకు శునకాలు కనిపిస్తే వాటికి తప్పకుండా తినిపించడం అలవర్చుకోండి. లేదంటే మీ జీవితంలో ఇబ్బందులు తప్పవు.
మీరు తినే సమయంలో ఇలాంటి విషయాలను అస్సలు మరచిపోవద్దు. వేరే వాళ్లు తిన్న ఆహారాన్ని మీరు పొరపాటున తింటే.. మీ ఇంట్లో ప్రతికూల శక్తులు తాండవిస్తాయి. అంతేకాదు అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి మీరు తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే మీ సమస్యలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
Famous Posts:
> స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?
> సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము
> శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత
> తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?
food rules in hinduism, religion and food restrictions, buddhism food restrictions, hindu diet plan, hindu food recipes, hindu food menu, ఆహారం