మనసును శుద్ధి చేసుకోవడం ఎలా...
భక్తో భక్తి గుణావృతే ముదమృతాపూర్ణే ప్రసన్నే మనః కుంభే సాంబ ! తవాంఘ్రి పల్లవ యుగం _ సంస్థాప్య సంవిత్ఫలం,సత్త్వం మంత్ర ముదీరయన్ నిజ శరీరాగార శుద్ధిం వహన పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం _ కల్యాణ మాపాదయన్ !!
----ఆదిశంకరుల శివానందలహరి నుండి...
విశేషం_ పుణ్యాహవాచనం :
ఇది యొక శుద్ధి కర్మ. ఇది చేసేటప్పుడు కలశము పెట్టి , దానికి దారముౘుట్టి
కలశములో నీళ్ళు పోసి మామిడి చిగుళ్ళూ, కొబ్బరికాయనూ దానిపై యుంచి
మంత్రములు ౘదువుతూ, ఆ నీటితో గృహమును శుద్ధి చేసి, మంగళాన్ని
పొందుతారు.
తాత్పర్యము :
ಓ సాంబమూర్తీ ! శివా ! నేను భక్తుడనై నా శరీరము అనే గృహాన్ని
నిర్దుష్టంగా శుద్ధి చేసుకొని , మనస్సునకు ఇష్టమైన మంగళమును చేయడానికి
పూనుకొని, దానికొఱకై భక్తి అనే నూలుపోగులను ౘుట్టి , సంతోషము అనే
నీటితో నింపిన నామనస్సు అనే కలశంలో నీ పాదములనే చిగుళ్ళనూ,
జ్ఞానము అనే కొబ్బరి కాయను ఉంచి , కలశస్థాపనము చేసి , సత్త్వగుణ
రూపమైన తారకమంత్రాన్ని ఉచ్ఛరిస్తూ, పుణ్యాహవాచనమును నెరవేరుస్తాను.
( అన్ని వేళలా మీ పాదపద్మములను స్మరిస్తానని భావం ).
వివరణ:
సామాన్యంగా మైలగానీ,పురుడుగానీ వచ్చి , ఇల్లూ ఇంట్లోని వారూ,
అశౌచంగా వుంటే , శుద్ధి రోజున తప్పకుండా గణపతి పూజ తోపాటు
పుణ్యాహవాచనం చేసి ఆ కలశాలలోని పవిత్ర జలాన్ని ఇల్లంతా
ౘల్లాలి. ఇంటిలోని వారి శిరస్సులపైనా ౘల్లాలి. అప్పుడు ఆ ఇల్లూ
ఇంటి యజమానీ , ఇంటిలోనివారూ నిర్మలులవుతారు. అలాగే భక్తుల
హృదయాలు అరిషడ్వర్గాలతో , అసూయాద్వేషాలతో , అపవిత్ర కార్య
క్రమాలతో మలినములైనపుడు ఏ విధంగా వారు తమ దేహాలను శుద్ధి
చేసుకోవాలో ఈ శ్లోకంలో శంకరులు చెప్పారు.
శంకరులు ఇలా చెప్పారు. ಓ ఈశ్వరా ! నా శరీరం పాడుపడిన కొంప.
దానిని శుద్ధి చేసుకోవాలి. తరువాత కల్యాణాన్ని ౘక్కగా సంపాదింౘాలి.
దానికై పుణ్యాహం అనే శుద్ధి కర్మను చేసుకోవాలి. పుణ్యాహవాచన
కర్మకు కావలసిన సామగ్రిని నేను ఇలా సంపాదింౘుకుంటాను. ముందుగా
కలశ స్థాపన చెయ్యాలి, నామనస్సే ఆ కలశం. నామనస్సనే కలశం ప్రసన్నంగా
స్వచ్ఛంగా వుంది. కలశానికి దారాలు ఛుట్టాలి. నేను నాభక్తి అనే దారాలు
ఆ కలశానికి ౘుడతాను. నా సంతోషమనే నీటితో కలశాన్ని నింపుతాను.
కలశంలో లేత మామిడి చిగుళ్ళు వేయాలి కదా ! నీ పాదపద్మాలే నాకు
దొరికిన ఆ చిగుళ్ళు. అందుచేత నామనస్సనే కలశంలో ఈశ్వరా !
నీ పాదాలనే చిగుళ్ళను వేస్తాను. ఇంక కలశంపై ఒక ఫలం ఉంౘాలి.
నేను ఙ్ఞానం అనేే కొబ్బరికాయను కలశంపై ఉంౘుతాను. తరువాత
మంత్రాలు ౘదవాలి. నేను సత్త్వగుణ ప్రధానమైన తారకమంత్రాన్ని
ౘదువుతాను. ఈ పుణ్యాహవాచనం వల్ల నా శరీరమూ, మనస్సూ,
వాక్కూ పవిత్రమవుతాయి.
ఉజ్జయినీ మహాకాలుని పంచామృత అభిషేకం
మనం కూడా మనశరీర శుద్ధి, ఇలాగే ఈశ్వర పాద ద్వంద్వాన్ని మన
చిత్తంలో నిలిపి వాక్కుతో శివనామాన్ని జపింౘాలని ఈ శ్లోకం ద్వారా
శంకరులు మనకు సూచించారని మనం గ్రహించాలి, ఆచరించాలి.
Famous Posts:
> ఎన్నో సమస్యలకి సుందరకాండ లోని వివిధ పరిష్కారాలు.
> గృహప్రవేశం ఇలా చేస్తే.. ఈ నియమాలు పాటిస్తే.. మీకంతా శుభమే..
> కనక దుర్గమ్మ దిగివచ్చిన మూడు అద్భుత సంఘటనలు.
> ఉదయం లేవగానే వీటిని చూస్తే మీ రోజంతా దరిద్రమే..
> ఈ పది లక్షణాలు కలిగియున్న వ్యక్తి జీవితంలో అన్నిటినీ జయించినట్టే
adi shankaracharya quotes, adi shankaracharya books pdf, adi shankaracharya movie, adi shankaracharya stotras, adi shankaracharya, Saundarya Lahari, soundarya lahari slokas