రోజాంతా ఉత్సాహాంగా ఉండాలనుకుంటారు చాలా మంది. అయితే కొన్ని సందర్భాల్లో రోజులో అనుకోని ఘటనలు జరిగి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోంటారు.
అయితే ఉదయం లేవగానే కొన్ని వస్తువులను చూడడం వలన మీ రోజుపై ప్రతికూల ప్రభావం చూపించనుంది. ఇప్పటికీ చాలా వరకు వాస్తును విశ్వాసిస్తుంటారు. అలాగే ఉదయం లేవగానే కొన్ని వస్తువులు చూస్తే..రోజంతా మంచిది కాదని.. ఏ పని తలపెట్టిన జరగదని అంటుంటారు. ఇవి మీ మానసిక పరిస్థితిపై ప్రభావం చూపిస్తుంది. అందుకే ఉదయం లేవగానే చూడకూడని వస్తువులు ఎంటో తెలుసుకుందామా.
Also Read : సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు..
1. వాస్తు శాస్త్రం ప్రకారం.. విరిగిన పాత్రలు, పనిచేయని గడియారం చూడడం మంచిది కాదు. ఉదయాన్నే వీటిని చూడడం వలన మీ రోజంతా సరిగ్గా పనిచేయదు. అందువలన వీటిని ఇంట్లో పెట్టుకోకపోవడం మంచిది.
2. కొందరికి ఉదయం లేవగానే తమ ముఖాన్ని చూసుకుంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. ఉదయాన్నే వారి ముఖం చూసుకోకుండా.. అరచేతులను చూసుకోవడం మంచిది. అరచేతులలో అదృష్టం ఉంటుంది అంటారు. అందుకే ఉదయాన్నే అరచేతులను చూసి రోజును ప్రారంభించాలి.
3. అలాగే ఉదయాన్నే సూది, దారాలు, నూనె పాత్రలు చూడకూడదు. వీటిని అపశకునంగా భావిస్తారు.
4. అంతేకాదు.. ఉదయం మీ నీడను కూడా చూసుకోవడం మంచిది కాదు. పడమటి దిశ నుంచి నీడను చూస్తే.. రాహు ప్రభావాన్ని చూపిస్తుంది. ఒకవేళ ఆకస్మాత్తుగా నీడను చూస్తే.. తులసి ఆకులను తినాలి.
5. ఉదయాన్నే రాత్రి వంట చేసిన వస్తువులను చూడకూడదు. ఒకవేళ చూస్తే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి.
Famous Posts:
> మీ పుట్టిన తేది ప్రకారం ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంచితే శుభం
> కొత్త కోడలు రాగానే సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారు?
> మంగళ, శుక్రవారాల్లో ఎవరికీ డబ్బు ఇవ్వకూడదా?
> భర్త భార్య మాట వినాలంటే ఏమి చేయాలి ?
> వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.
> శివ గుణాలు లోకానికి సందేశాలు
ఉదయం లేవగానే, దరిద్రమే, wake up, sleep, morning, see these in the morning