మొధెరా సూర్య దేవాలయం, గుజరాత్.
గుజరాత్ లో మహసానా జిల్లాలో కల మొధెరా ఒక చిన్న పల్లెటూరు. ఈ పల్లెకు కొద్ది దూరంలో పుష్పవతి నది ప్రవహిస్తుంది. ఇది ఉత్తర గుజరాత్ లో గల సరస్వతీ నదిలో కలిసి పడమరగా నున్న రణ్ ఆఫ్ కచ్ లోనికి పోయి కలుస్తుంది. ఇది మొహసానా కు 18 మైళ్ళ పడమరగా ఉన్నది. పాటన్ శివారుకు చెందినది. పాటన్ అసలు పేరు అంహిలవడి పాటన్. ఇది సోలంకి రాజుల ముఖ్య పట్టణం. వారి కాలంలో బంగారం, ముత్యాలు, రత్నాలు మొదలగునవి రోడ్డుమీద గుట్టలుగా పోసి అమ్మెడివారట. ఈ పట్టణానికి 8 మైళ్ళ దక్షిణంగా ఒక మహారణ్యం ఉండేదట. దాని పేరు ధర్మారణ్యం. సోలంకిరాజుల కాలములో పాటన్ లో రాజాదరణలో వున్న కొద్దిమంది బ్రాహ్మణులకు, ధర్మారణ్యంలొ కొంతభాగం బాగు చేయించి వసతులు కల్పించి దాన మిచ్చారట. పాటన్ నుంచి వచ్చిన బ్రాహ్మణులు మొధ్ లేదా యొఢ్ బ్రాహ్మణులట. వారికి ఇక్కడ వసతులు కల్పించబడినవి కావున దీనికి యొఢెరా లేదా మొధెరా అనే పేరు వచ్చినది.
Also Read : హనుమంతునికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి..? ఎలా చేయాలి?
అహ్మదాబాద్‌నుంచి వంద కిలోమీటర్ల దూరంలోనున్న 'పుష్పవతి' నది ఒడ్డున ఈ దేవాలయం ఉంది. ఈ ఆలయాన్ని క్రీస్తు పూర్వం 1022-1063లో చక్రవర్తి భీమ్‌దేవ్ సోలంకి-I నిర్మించారు.
క్రీస్తు పూర్వం 1025-1026 ప్రాంతంలో సోమనాథ్ మరియు చుట్టుప్రక్కలనున్న ప్రాంతాలను విదేశీ ఆక్రమణదారుడైన మహమూద్ హమద్ గజనీ తన ఆధీనంలోకి తీసుకున్నట్లు ఆ దేవాలయంలోని గర్భగుడిలో ఓ గోడపై లిఖించబడి ఉంది. గజనీ ఆ ప్రాంతాలను ఆక్రమించు కోవడంతో సోలంకీలు తమ పూర్వ వైభవాన్ని కోల్పోయారు.
సోలంకి సామ్రాజ్యానికి రాజధానిగా చెప్పుకునే ' అహిల్‌వాడ్ పాటణ్ ' కూడా తన గొప్పతనాన్ని, వైభవాన్ని పూర్తిగా కోల్పోనారంభించింది. తమ పూర్వవైభవాన్ని కాపాడు కునేందుకు సోలంకి రాచరికపు కుటుంబం మరియు వ్యాపారులు ఓ జట్టుగా ఏర్పడి అందమైన ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
సోలంకి కుటుంబీకులు సూర్య వంశస్థులు. వారు సూర్యుడ్ని తమ కులదేవతగా కొలిచేవారు. కాబట్టి వారి ఆరాధ్య దైవమైన సూర్యుడ్ని కొలిచేందుకు ఓ అందమైన సూర్య మందిరాన్ని నిర్మించాలనుకున్నారు. ఈ విధంగా మోఢేరా సూర్యదేవుని ఆలయం నిర్మితమైంది. భారతదేశంలో మూడు సూర్యదేవుని ఆలయాలు ఉన్నాయి. వీటిలో మొదటిది ఒరిస్సాలోని కోణార్క్ మందిరం, రెండవది జమ్మూలోనున్న మార్తాండ్ ఆలయం మరియు మూడవది మనం చెప్పుకుంటున్న గుజరాత్‌లోని మోఢేరాకు చెందిన సూర్య మందిరం.
శిల్పకళలకు కాణాచి అయిన ఈ ఆలయంలో ప్రపంచప్రసిద్ధి చెందిన ప్రత్యేకమైన విశేషం ఒకటుంది. అదేంటంటే ఈ ఆలయ నిర్మాణంలో సున్నం ఉపయోగించకపోవడం విశేషం. ఇరానీ శిల్పకళ శైలిలో రెండు భాగాలుగా ఈ ఆలయాన్ని భీమ్‌దేవ్ నిర్మించారు. ఇందులో తొలి భాగం గర్భగుడి కాగా రెండవది సభా మండపం. మందిర గర్భగుడి లోపల పొడవు 51 అడుగుల 9 అంగుళాలు. అలాగే వెడల్పు 25 అడుగుల 8 అంగుళాలుగా నిర్మించడం జరిగింది.
మందిరంలోని సభా మండపంలో మొత్తం 52 స్తంభాలున్నాయి. ఈ స్తంభాలపై అత్యద్భుతమైన కళాఖండాలు, పలు దేవతల చిత్రాలను చెక్కారు మరియు రామాయణం, మహాభారతం లోని ప్రధానమైన విషయాలను కూడా చెక్కారు. స్థంభాల కింది భాగంలో చూస్తే అష్టకోణాకారం లోను అదే పై భాగంలో చూస్తే గుండ్రంగాను కనపడతాయి.
సూర్యోదయం జరిగిన వెంటనే తొలి సూర్యకిరణం ఈ ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించేలా ఆలయ నిర్మాణం చేపట్టారు. సభామండపానికి ఎదురుగా విశాలమైన మడుగు ఉంది. దీనిని ప్రజలు సూర్యమడుగు లేదా రామమడుగు అని పిలుస్తారు.
అల్లా ఉద్దీన్ ఖిల్జీ ఈ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకునే సమయంలో సూర్యమందిరాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడు. మందిరంలోని విగ్రహాలను తునాతునకలు చేసేశాడు. ప్రస్తుతం భారతీయ పురావస్తు శాఖ ఈ ఆలయాన్ని తన ఆధీనంలోకి తీసుకుని సంరక్షిస్తోంది.
చరిత్రలో మోఢేరా మందిరం...
స్కందపురాణం మరియు బ్రహ్మపురాణాలననుసరించి ప్రాచీనకాలంలో మోఢేరా చుట్టుప్రక్కలనున్న ప్రాంతాలను 'ధర్మరన్య' అని పిలిచేవారు. శ్రీరామ చంద్రుడు రావణుడిని సంహరించిన తర్వాత తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు, బ్రహ్మ హత్యాపాపంనుంచి బయట పడేందుకు తగిన పవిత్రమైన స్థానం చూపించమని తన గురువైన వశిష్టుడిని అడిగాడని పురాణాలు చెపుతున్నాయి. అప్పుడు గురువైన వశిష్ట మహర్షి ' ధర్మరన్య' వెళ్ళమని శ్రీరామ చంద్రునికి సలహా ఇచ్చాడు. ఆ క్షేత్రమే ఇప్పుడు మోఢేరా పేరుతో పిలవబడుతోంది.
ఇక్కడికి ఎలా చేరుకోవాలి?
రోడ్డు మార్గం :
మోఢేరా సూర్యదేవుని ఆలయం అహ్మదాబాద్‌నుంచి 102 కిలోమీటర్ల దూరంలో ఉంది. అహ్మదాబాద్‌నుంచి ఈ ప్రాంతానికి చేరుకునేందుకు బస్సు మరియు టాక్సీల సౌకర్యం ఉంది.
రైలు మార్గం :
అహ్మదాబాద్ వరకు రైలు మార్గంగుండా ప్రయాణించి ఆ తర్వాత బస్సు లేదా టాక్సీలలో ప్రయాణించాలి.
వాయు మార్గం :
అహ్మదాబాద్ విమానాశ్రయం.
Also Read : కాశీలోని చాలా మంది కి తెలియని కొన్ని వింతలు..
సూర్యారాధన ప్రపంచ వ్యాప్తంగా, విభిన్న నామాలతో అనాది కాలం నుంచీ జరుగుతూనే వుందన్నది అక్షర సత్యం. సూర్య ఆత్మా జగత్ స్తస్థు షస్చ ...రుగ్వేదం సూర్యుణ్ణె జగదాత్మ అంటున్నది. పూష్ణ, భగ, మిత్ర, అర్యమన్, విస్వత్..రవి, సూర్య, ఇవన్నీ ఆ భాస్కరుని నామాలే. రామాయణ, మహాభారతాల్లో, సూర్య సంబంధమైన వివరణలనేకం ఉన్నాయి. సూర్యొపాసన గురించిన అనేక ప్రమాణాలూ పురాణల్లో చాలా ఉన్నాయి. విస్ణు పురాణం సూర్యుని రథ విస్తారమే, నూరు వేల యోజనాలంటున్నది. దీనికి రెండింతలు దీనీ ఈషా దండము. దీని ఇరుసు (ధుర) ఒకటిన్నర కోటీ, యేడు లక్షల యోజనాల పొడుగు అని పేర్కొన్నది. దీనికే ఈ రథ చక్రమున్నది. ఆ అక్షయ రూపమైన సంవత్సరాత్మక చక్రములో సంపూర్ణ కాలచక్రమున్నది. గాయత్రి, బృహతి, వుష్ణిక్, జగతి, త్రిష్టుప్, అనుష్టుప్, పంక్తి అన్న యేడూ సూర్య రధాశ్వాలు. మత్స్య, భవిష్య, విష్ణుధర్మోత్తర, అగ్ని పురాణదులలో సూర్య మూర్తికి సంబంధించిన అనేక విశేషాలు లభ్యాలు. భారతీయ శిల్ప కళల్లో, సూర్యుని రూపాలు ప్రాచీన కాలం నుంచే కనిపిస్తున్నాయి.
Famous Posts:
మొధెరా సూర్య దేవాలయం, Sun Temple, Modhera, modhera temple, modhera sun temple timings, modhera sun temple upsc, konark sun temple, places near modhera sun temple, modhera sun temple built by