రామ భజన మహిమ | Glory to Rama Bhajan - HREE RAM BHAJAN

   

రామ భజన మహిమ..

ఎక్కడ రామ భజన జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఉంటారు, గ్రహ దోషాలు, చెడు ప్రయోగాలు జరిగింది అని భయపడుతున్న వాళ్ళు, జిన్స్, గాలి,పిశాచ బాధలు ఉన్నాయి అని భయపడుతూ, ఏ పూజలు చేయాలి ఎవరి దగ్గరకు వెళ్ళాలి అని మానసికంగా కృంగిపోతూ చాలా కుటుంబాలు మనో వేదన అనుభవిస్తున్నారు..

అవి నిజంగా ఉన్నాయా లేక అపోహ అనేది పక్కన పెడితే అటువంటి ఆలోచనతో చాలా మానసిక క్షోభ అనుభవిస్తున్నారు..

Also Readజ్యోతిషశాస్త్రం ప్రకారం జాతకం ఎప్పుడు రాయించుకోవాలి?

ఏ రోజు ఏమీ చేయమని tv లో భక్తి ప్రసారంలో చెప్తే అవి చేస్తున్నారు, ఏ స్వామి జి ఏది చెప్తే అది చేస్తున్నారు, మీలాంటి అమాయకుల వల్ల దొంగబాబాలు, తాయత్తులు అమ్మే వాళ్ళు, యంత్రాలు అమ్ముకునే వాళ్ళు చాలా మందే హాయిగా బతుకు తున్నారు కానీ మీ సమస్య మటుకు తీరడం లేదు..

ఇంట్లో రామ భజన నిరంతరంగా అంటే ప్రతి రోజు రామ భజన ఇంట్లో చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళను పిలుచుకోండి, సంజీవిని తెస్తున్న హనుమంతుడు ఫోటో కానీ, రామ లక్ష్మణులను భుజాన మోస్తున్న హనుమంతుడి ఫోటో కానీ పెట్టుకోండి.. అలాగే సీతారామ పట్టాభిషేకం ఫోటో పెట్టుకోండి ఇది ప్రతి ఇంటా ఉండవలసిన ఫోటో, అంత పానకం. వడపప్పు నైవేద్యం పెట్టండి మంగళవారం గారెలు నైవేద్యం పెట్టండి... భక్తి పారవశ్యంతో  రామ భజన చేసి చివరిలో హనుమాన్ చాలీసా చదివి హారతి ఇవ్వండి... ఏ పిశాచాలు మీ ఇంట్లో ఉంటాయి చూద్దాము, గ్రహాలు అన్నీ హనుమకు అధీనం లో ఉంటుంది.. ఎందుకంటే ఆయన భక్తికి మరో రూపమ్ రుద్ర స్వరూపం.. శనిదోషాలు, రాహుగ్రహ దోషాలను పోగొట్టే సులభమైన మార్గం హనుమంతుడి గుడి ప్రదర్శన...ఆరాధన..

Also Readఎవరితో పెళ్లి జరగాలో ఈ స్వామి వారు నిర్ణయిస్తాడు.

ఇంట్లో గొడవలు తగ్గుతుంది, మన శాంతిగా ఉంటారు, దుష్ట గ్రహాలు అనగా మీకు చేడుచేసే వారు కూడా మీ ఇంట్లోకి రాలేరు ఇంటికి ఉన్న కనుదిష్టి పోతుంది..ఇంటి వాతావరణంలో లో మంచి మార్పు మీకే తెలుస్తుంది.. సంతోషంగా ఉంటారు.. రామ భజన గురించి మీకు ఇంతకన్నా నేను చెప్పాలా.."ఓ రామ నీ నామం ఎంతో రుచిరా" అంటూ అలవాటు పడితే అందులోని ఆనందం అనంతం , ఎంతో మందికి సుందరకాండ పారాయణం, శ్రవణం ఎంతో మేలు చేసింది..అలా పారాయణం చేయలేక పోయిన రామ భజన, ఇంట్లో పెట్టండి సంతోషంగా ఉండండి మీ వల్ల మీ పిల్లలు చిన్న తనం నుండి భక్తిని అలవాటు చేసుకుంటారు పాప బీతి ఉంటే తప్పులు చేయరు అపద్దం చెప్పరు.

శివుడి స్మరించే తారక మంత్రం రామ నామం ఈ మంత్రం నిరంతరం జపించండి.

" శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే |

సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే|"

Also Readపెళ్లి కావట్లేదా అయితే ఒక్క సారి ఈగుడిని దర్శించండి...

రామ భజన

రామ రామ రఘునందన రామరామ శ్రీరామ రామ భరతాగ్రజ రామరామ

శ్రీరామ రామ రణకర్కశ రామ రామ శ్రీరామ రామ శరణం భవ రామ రామ ॥

లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథమ్ 

కారుణ్యరూపం కరుణాకరం తం శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే ॥

♦️మనోజవం మారుతతుల్య వేగమ్ జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టమ్

వాతాత్మజం వానరయూథ ముఖ్యమ్ శ్రీరామదూతం శరణం ప్రపద్యే. ॥

(ఎన్నో లక్షల రాక్షస సంహారం చేసిన రాముడు సదా మంచిని రక్షించు గాక, శ్రీ రామ నీకు జయము నీ నామము మాకు శుభము).

Famous Posts:

మరణం తరువాత ఏం  జరుగుతుంది?


అన్నం తినే ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాలి.. 


నవగ్రహాలను పూజిస్తే బాధలు తీరుతాయా ? 


భార్య, భర్తల మధ్య మనస్పర్థలు వచ్చినప్పుడు ఈ స్తోత్రం పఠించండి. 


ఆదివారం అత్యంత శక్తివంతమైన రోజు.


అన్నం తినే ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాలి.


నవగ్రహాలను పూజిస్తే బాధలు తీరుతాయా ? 


భర్త భార్యను ఇలా పిలవడం మానేయండి.

best ram bhajan mp3 download, shri ram bhajan, ram ke bhajan, rama rama bhajan lyrics, ram bhajan list, ram bhajan mp3 download pagalworld, shri ram bhajan audio, ram ji ke bhajan, sri rama, hanuman, taraka mantram, rama slokas telugu, రామ భజన

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS