శ్రీరాముడు రావణుడిని చంపి బ్రాహ్మణహత్య చేసాననే దిగులుతో పాపపరిహారనిమిత్తం ఎన్నోచోట్ల శివలింగాలకి ప్రాణ ప్రతిష్ట చేసాడు..
అలాగే పరశురాముడు కార్తవీర్యార్జునుడితో సైతం ఎంతోమంది క్షత్రియులని హత్యచేసిన బాధతో ఆయనకూడా క్రౌంచ పర్వతం మీద తపస్సు చేసి అక్కడ పూజ చేసిన శివలింగాన్నీ ఎక్కడ ప్రతిష్టించాలా అని అనుకుంటూ ఉండగా…
Also Read : మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి.
శ్రీరాముడు సీతామహాదేవితో కలిసి గోస్తనీ నదితీరం దగ్గరికి చేరుకోగానే అక్కడ శివలింగాన్ని ప్రతిష్టించాలని అనుకున్నదే తడవుగా అక్కడున్న ఇసుక,నత్తలతో సీతాదేవి సహాయం తో ఒక శివలింగాన్ని తయారుచేసి ప్రతిష్ట చేసాడు.. ఆశివలింగాన్ని నత్తారామలింగేశ్వరస్వామి అని పిలుస్తారు..శ్రీరాముడు ,సీతామాహాదేవి కలిసి లింగాన్ని తయారు చేసాకా మిగిలిన ఇసుకముద్దని ని కుడా అక్కడే ఉంచేసారు.. అలా నత్తలు,ఇసుకతో శివలింగాన్ని తయారుచేసి ప్రతిష్టచేసారని పురాణ కధనం అలాగే పరశురాముడు కూడా తను పూజ చేసిన శివలింగాన్నీ తీసుకొచ్చి అదే గోస్తనీ నది తీరం లో ఈ రాముడు ప్రతిష్టించిన శివలింగం పక్కనే ప్రతిష్ట చేసాడు..
అయితే పరశురాముడు మహాకోపిష్టి కదా అందుకని అగ్నిలింగం లా కనపడేసరికి అయ్యో నా అహంకారం ఇంకా తగ్గలేదా అని బాధపడి శివలింగం చుట్టూ ఒక చెరువులా తవ్వి దానిని గోస్తనీ నది నీటితో నింపేసాడు.. స్వామి చల్లబడ్డాకా.. అయ్యోస్వామీ నీకు పూజలెలా అని బాధపడుతుంటే..
అప్పుడు స్వామి బాధపడకు పరశురామా.. నేను 11 నెలలు నీళ్ళతో ఉంటాను ఒక్క ఫాల్గుణమాసం లో అందరికీ కనిపిస్తూ ఉంటాను అని అభయమిచ్చాడు..అలా పరశురాముడు కూడా గోస్తనీ నది తీరంలో శివలింగాన్ని ప్రతిష్టించాడు. ఈ శివలింగాన్ని పరశురామలింగేశ్వరస్వామీ అని అంటారని పురాణ కధనం
Also Read : పూజ గదిలో చనిపోయిన వారి ఫోటోలు ఉండవచ్చా?
ఇలా రెండు శివలింగాలు ఒకే ప్రాంగణం లో ఉన్న క్షేత్రం పశ్చిమగోదావరిజిల్లా పెనుమంట్ర మండలం లో ని “నత్తారామేశ్వరం ” లో ఉంది..
తాడేపల్లిగూడేం నుండి 20 కిలోమీటర్ల దూరం..
ఒక శివలింగం నీటిలోనూ,ఒక శివలింగం గర్భగుడిలోనూ కనిపిస్తూ ఉంటాయి.. తప్పకచూడవలసిన క్షేత్రం..నత్తారామలింగేశ్వరం..
Famous Posts:
నత్తారామేశ్వరం, Natta Rameswaram Temple, Natta Rameswaram Village, Natta Rameswaram, Natta Rameswaram Temple Hisoty in Telugu, Natta Rameswaram Temple Timings,