ఆరోగ్యం భాగ్యం పొందాలంటే శ్రీ సూర్య భగవానుని దీక్ష ఉత్తమ మార్గం | Sri Surya Bhagavan Deeksha - Sri Suryanarayana Swamy

ఆరోగ్యం భాగ్యం పొందాలంటే శ్రీ సూర్య భగవానుని దీక్ష ఉత్తమ మార్గం 

శ్రీ సూర్య నారాయణుని దీక్ష సంపూర్ణ వివరణ

శ్రీ సూర్య భాగానుని దీక్ష సమయం :  స్త్రీలు 21 లేదా 27 రోజులు, పురుషులు 27 లేదా 41 మండలరోజులు చేయడం ఉత్తమం )

ఈ జగత్తును రక్షించి, కాపాడి సర్వ జీవులను పోషించే శక్తిని ఆరోగ్యాన్ని ఇచ్చేదీ ప్రత్యక్ష దైవం సూర్యుడు. ప్రతీ జీవికి నిద్ర లేచింది మొదలు సూర్యుని కిరణాలు ప్రసరించకపోతే జీవితమే ఉండదు. అటువంటి ప్రత్యక్ష దైవం సూర్య భగవానుని అనుగ్రహానికి సూర్య దీక్ష చాలా అవసరం. లోకంలో అనేక దీక్షలు, వ్రతాలు ఉన్నాయి. కానీ ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, పాడి పంటలను,శ్రీ మహాలక్ష్మి అమ్మ వారి కటాక్షములను , శాంతి సౌఖ్యములను ఇచ్చే ఏకైక దీక్ష సూర్యదీక్షమాత్రమే.

Also Read : గర్భవతులు విన్నా, చదివినా కీర్తి ప్రతిష్ఠలు కలిగిన పుత్రులు కలుగుతారు.

సర్వ దేవి దేవతలను పూజిస్తే వచ్చే ఫలం ఒక్క సూర్య దీక్ష వలన మాత్రమే వస్తుంది. అటువంటి ఈ దీక్షను కుల బేధం లేకుండా అందరూ చేయవచ్చు. ఈ కాలానికి సూర్య దీక్ష అందరూ పాటించవలసిన అవసరం ఎంతో ఉంది. మనిషి ఆరోగ్యం కన్నా భాగ్యం ఏమి ఉంది ?

శ్రీ సూర్య దీక్ష ఎందుకు పాటించాలి..

శ్రీ సూర్య భగవానుని దీక్ష చేయటం అంటే అన్నీ మంత్రాలకు, సర్వ దేవతలకు మూలమైన శ్రీ గాయత్రి ఉపాసన చేయడమే అని మనం గుర్తుంచుకోవాలి. పూర్వమూ నిత్యమూ మూడు కాలాలలో

సంధ్యావందనం , అంటే సూర్య దీక్ష చేసేవారు. శ్రీ రాముని విశ్వామిత్రుల వారు "కౌసల్యా, సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే " అని, శ్రీ వేంకటేశ్వర స్వామి సుప్రభాత సేవలో శ్రీ సూర్య భగవానుని ప్రార్థించడంతోనే మొదలు అవుతుంది.

అంటే సోర్ర్య భగవానుని ఆరాధించకుండా ఎటువంటి దేవుని ప్రార్థించినా సత్ఫలితాన్ని ఇవ్వదని మనకు తెలుస్తోంది. ఆరోగ్యం ఇచ్చేదీ సూర్య భగవానుడు అని మన వేదాలు, పురాణాలు చెప్తునై. ఆరోగ్యంగా ఉంది ఎటువంటి రోగాలు లేకుండా జీవించాలని మనిషి కోరుకుంటాడు.

సూర్య భగవానుని దీక్ష చేసి అనేక మంది రోగాలను పోగొట్టుకుని,స్వామి వారి కృపతో సంపూర్ణ ఆరోగ్యం, పొందటం, పురాణాల నుండి ఇప్పటికీ మనం చూస్తున్నాం. అందుచేత సూర్యదీక్ష వలన ఆరోగ్యం,

ఐశ్వర్యం, పాడి పంటలు, శాంతి సౌఖ్యాలు, లక్ష్మి కటాక్షం, సిరి సంపదలు, ధన ధాన్యాలు లభిస్తాయి.

శ్రీ సూర్య దీక్ష వలన ఉపయోగాలు :

పాశ్చ్యాత్యులు ఈ రోజున సన్ గెజింగ్ అని ఉదయించే సూర్యుని కొద్ది సేపు చూడటం వలన కంటికి, సూర్య కిరణాలు తాకడం వలన శరీరానికి ఎంతో ఉపకారమని, దాని వలన సూర్య మండలంలోని కొన్ని శక్తులు మన శరీరాన్ని తాకి ఎంతో మేలును, హాయిని ఇస్తాయని, చెప్తున్నారు. కానీ మనం ఈ విధానం ఆదిత్య హృదయం ద్వారా మన పూర్వీకులు పెద్దలు మనకు ఏనాడో చెప్పారు. అందుచేత శ్రీ సూర్య దీక్ష అందరమూ చేసి ఆరోగ్యవంతులు కావాలి. సూర్య దీక్ష వలన ఆరోగ్యమే కాకుండా సర్వ భాగ్యాలు వస్తాయి.

ఆదివారం చేయకూడనివి : శాస్త్రాలు వద్దని చెప్పిన స్త్రీ సంపర్కం, తైల మర్ధనం సూర్యుని ఎదురుగా పళ్ళు తోముకోవడం, మాల మూత్ర విసర్జన, త్రాగుడు, మాంసము, ఈ రోజు కలి ప్రభావం వలన ఆదివారం నాడు చేస్తున్నారు. దాని వలన

వింత రోగాల బారిన పడి సూర్య ప్రదక్షిణ మానేసి, ఆసుపత్రి చుట్టూ ప్రదక్షిణ, దక్షిణ ఇచ్చి, ఇల్లు, ఒళ్ళు, గుల్ల చేసుకుంటున్నాం. అందువలనే ఈ అనార్ధాలు 

ఆదివారం చేయవలసినవి : రోజు, కనీసం ఆదివారం నాడు అయినా సూర్యుని కన్నా ముందే కాల కృత్యాలు తీర్చుకుని సూర్యుని ఎదురుగా ఆర్ఘ్యం, సూర్య నమస్కారం వీలైతే ఆదిత్య హృదయం చదువుకోవటం చేయటం ఎంతో మంచిది.

ప్రత్యక్ష భగవానుడైన సూర్యుని ఎదుట ఎల్లప్పుడూ మనం వినయంగా, భయ భక్తులతో ఉండటం ఎంతో అవసరం. నమస్కారం చేస్తేనే ఎంతో సంతోషిస్తారు స్వామి. 

Also Readజ్యోతిషశాస్త్రం ప్రకారం జాతకం ఎప్పుడు రాయించుకోవాలి?

శ్రీ సూర్య దీక్ష ఎలా చేయాలి ?

ప్రతీ రోజు సూర్యుడు ఉదయించకముందే అంటే ఉదయం 5 నుండి 6 లోపున సూర్యునికి ఆర్ఘ్యం అంటే మన రెండు చేతులతో దోసెడు నీళ్ళు తీస్కుని "ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః" అని నీళ్లను సూర్యుని చూస్తూ విడిచి పెట్టాలి.

కొద్దిసేపు సూర్యునికి నమస్కారం చేసుకుని, పూజ గదిలో స్వామి వారి మూర్తికి దీపారాధన చేయటం ముఖ్యం, నమస్కారం చేస్తే చాలు సర్వ సౌఖ్యాలు ఇస్తాడు. అటువంటిది మనం ఇంకా శ్రద్ధగా సూర్య దీక్ష చేస్తే మనకు వచ్చే ఫలితం ఎంతో ఉంటుంది.

తూర్పు తిరిగి దణ్ణం పెట్టు అని సరదాగా అంటాం. ఏదో విధంగా మనలను సూర్యునికి నమస్కారం చేయమని ఎంతో ఉపకారం అని మన పెద్దలు చెప్తున్నారు. ఇక సూర్య దీక్షలో కెంపు రంగు బట్టలను ధరించాలి. సర్వ దేవతల స్వరూపమైన సూర్య భగవానుని ప్రీతి అయిన ఎర్ర చందనంతో చేసిన స్పటిక లాకెట్ పై సూర్యుని ముద్రా ఉండాలి. నుదిట భస్మ ధారణ చేసి తరువాత ఎర్ర చందనం తిలక ధారణ చేయాలి. ఎర్రని పూలతో పూజ, అందువలన అనారోగ్యం ఉండదు.

దీక్షలో ప్రతీ ఆదివారం స్వామి వారికి ఆవుపాలతో చేయబడిన పాయశాన్ని నివేదెన చేసి ఆదిత్య హృదయం చదువుకోవాలి. ఈ దీక్షకు ముఖ్యంగా ఆహార నియమాలు తప్పని సారి. నూనె పదార్ధములు తీసుకోరాదు . మితాహారం మంచిది.

బయటి ఆహారం ముట్టరాదు

సూర్య దీక్ష చివరి రోజున తల్లి గాని, భార్య గాని, దీక్ష చేసిన వారైనా గాని, ఒక తెల్లని వస్త్రంలో బియ్యం ( 1 1/4 కేజీ ) ఆవునెయ్యి (పావు కేజీ ) బెల్లం ( అర కేజీ ) పాయసన్నం సంబంధీచి వస్తువులు, శ్రీ ఉషా పద్మిని అమ్మ వారాలకు

రెండు రవికెలు , పసుపు కుంకుమ, తెల్ల వస్త్రంలో కట్టి , తలపై పెట్టి, శ్రీ హనుమత్ క్షేత్రం నందు మన కోసం శ్రీ ఉషా పద్మిని సమేత శ్రీ సూర్య భగవానునికి వారికి ఈ ముడుపు మూటను అందజేసి స్వామి వారి ప్రసాదం స్వీకరించాలి.

తరువాత దీక్ష విరమణ చేసుకోవాలి దీని వలన స్వామి వారికి కృపాకు పాత్రులవుదాం

27 నక్షత్రములు, 12 రాశులు, 9 గ్రహాలకు అధిపతియాయిన సూర్యుని దీక్ష వలన అన్నీ రాశుల వారికి గ్రహ శాంతి కలుగుతుంది. శని యొక్క పీడ ఉండదు. కార్తీక, ధనుర్మాసం, మాఘం, ఎంతో విశేషమైనది. ముఖ్యంగా అయ్యప్ప స్వామి దీక్షతో పాటు సూర్య దీక్ష చేయటం ఎంతో ఫలితం.

హనుమంతుడి గురువు శ్రీ సూర్య దీక్ష వలన శత్రుభయం తొలగి అన్నిటా విజయం . శ్రీ క్షేత్రం లో మహా గణపతిని కూడి సూర్యుడు ఉండటం వలన విగ్నములు ఉండవు. ఈ సూర్య దీక్ష ఎక్కడ పాటించినా, చిక్కవరం గ్రామంలో వెలసిన హనుమత్ క్షేత్రంలో శ్రీ ఉషా పద్మిని, సమేత శ్రీ సూర్య భగవానుని సన్నిధిలో సూర్య దీక్ష విరమణ పొంది, సూర్యుని అనుగ్రహ ఆశీస్సులు పొందండి. 

ఓం శ్రీ ఉషా పద్మిని సమేత శ్రీ శ్రీ శ్రీ సూర్య నారాయణ స్వామినే నమః

Famous Posts:

గుడికి ఎందుకు వెళ్ళాలి? దాని వెనక రహస్యాలు


ఉపయోగం ఉత్తమ పరిహారాలు - చిట్టి తంత్రాలు

 

తిరుమల వెళ్ళే ప్రతి ఒక్కరు చేయవలసిన పనులు


ఎవరితో పెళ్లి జరగాలో ఈ స్వామి వారు నిర్ణయిస్తాడు

 

మీరు పడుకునే విధానం బట్టి మీ గత జన్మ ఎలాంటిదో తెలుసుకోవచ్చు?


విగ్రహానికి చర్మం, స్వేదం, వెంట్రుకలు...ప్రపంచంలో ఏకైక విగ్రహం


పాపాలను, శాపాలను పోగొట్టి, కష్టాలను తీర్చి, ఆయుష్షును పెంచే ఆదిత్య హృదయం

Sri Suryanarayana Swamy, suryanarayana swamy images, suryanarayana swamy matrasm telugu, suryanarayana temple, amarkantak sun temple, arasavalli suryanarayana photos, suryanarayana swamy temple, arasavalli temple history in telugu, arasavalli temple timings,

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS