భోగి అంటే ఏమిటి ? భోగి విశిష్టత ఏమిటి ? ఈ భోగి పండుగ ఎలా వచ్చింది ? importance of bhogi festival - Sankranthi Festival

 

భోగి లేదా భోగి పండుగ అనునది ఆంధ్రులు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. ఆంధ్రులు పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటిరోజును భోగి అంటారు. భోగి పండుగ సాధారణంగా జనవరి 13 లేదా జనవరి 14 తేదిలలో వస్తుంది. దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవుట వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది.

Also Read : సంక్రాంతి రోజున ఈ పనులు చేస్తే సకల సంపదలు మీ సొంతం...!

ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగ భగ మండే చలి మంటలు వేసుకునేవారు, ఉత్తరాయణం ముందురోజుకి చలి విపరీతంగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు భగ భగ మండే మంటలు అందరు వేయటం వలన ఈ రోజుకు భోగి అనే పేరు వచ్చింది.

సంక్రమణ మహాపర్వానికి ముందు రోజుకి ఒక ప్రాధాన్యం ఉంది. దీనికి భోగిపర్వం అని పేరు. అయితే భోగము అనే మాటకు అర్థం ఏమిటంటే అనుభవము అని. ఆనందంగా దేనిని అనుభవిస్తామో లేదా దేనిని అనుభవించడం వల్ల ఆనందం పొండుతామో దానిని భోగము అనాలి. అలాంటి భోగములు అనుభవించవలసిన రోజుని భోగి అంటారు. నిజమైన ఆనందాన్ని అనుభవించడమే నిజమైన భోగం. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఆనందం. సామాన్యుల ఆనందాలు వేరు. వాళ్ళకి లౌకిక విషయాలు దొరికితే అది భోగం. ఆ విషయంతో విసుగు కలిగితే మరో విషయం లభించాలని. కానీ ఏది లభిస్తే మరి ఇంకేదీ కావాలని అనిపించదో, ఏది పరిపూర్ణమైన ఆనందమో అదే నిజమైన భోగం. అలాంటి భోగం యోగం వల్లనే లభ్యం అవుతుంది. అందుకే యోగులే భోగులు కాగలరు. అలాంటి దివ్య భోగం ఈరోజున అమ్మ గోదాదేవి ఆండాళ్ళమ్మ పొందినది. అదేమిటంటే పరమాత్మ ప్రాప్తి. రంగనాథుని చేపట్టినది. రంగనాథుని అనుగ్రహాన్ని పొందినది. రంగనాథుని సాంగత్యం అనబడేటటువంటి ఆ కైవల్యానందం అనే భోగాన్ని అమ్మ పొందినది కనుక ఈరోజు భోగి అనే పేరు భక్తి సాంప్రదాయం పరంగా నిర్వచించేవారు చెబుతారు. సరిగ్గా ఈ రోజుతో ధనుర్మాసం పూర్తి అవుతున్నది. తర్వాతు రీహ్య్ నుంచి మకర మాసం వస్తున్నది సౌరమానం ప్రకారంగా. ఈ ధనుర్మాస వ్రతమంతా ఈరోజు పూర్తీ జరిగి దాని ఫలితంగా అమ్మవారు స్వామియొక్క అనుగ్రహాన్ని పొందినది.

Also Readఇంట్లో పూజ ఎవరు చేయాలి? 

భోగి మంటలు

చలికాలంలో అత్యంత చలిగా ఉండే రోజు భోగి. ఈ రోజున ఆంధ్రులు మంటలు వేసి చలికాచుకుంటారు, ఈ మంటలనే భోగి మంటలు అంటారు. భోగిమంటలకు ఎక్కువగా తాటిఆకులను ఉపయోగిస్తారు. ఈ ఆకులను భోగికి కొన్ని రోజుల ముందే కొట్టుకొని తెచ్చి భోగిమంటల కొరకు సిద్ధం చేసుకుంటారు. అనేక ప్రాంతాలలో ప్రత్యేకంగా భోగిమంటల కొరకు తాటాకు మోపులను ఇళ్ళవద్దకే తెచ్చి విక్రయిస్తున్నారు. వీటితో పాటు మంటలలో మండగల పనికిరాని పాత వస్తువులను ముందురోజు రాత్రికి సిద్ధం చేసుకుంటారు. తెల్లవారుజామున సాధారణంగా 3 గంటల నుంచి 5 గంటల మధ్యన ఎవరి ఇంటి ముందువారు ఈ మంటలు వేయడం ప్రారంభిస్తారు.

కొత్త బట్టలు

ఈ పండుగనాడు ఆంధ్రులు కొత్తబట్టలు ధరించడం ఒక సంప్రదాయంగా ఉంది. తెల్లవారుజామున భోగిమంటల వద్ద చలికాచుకున్న చిన్నా పెద్దలు భోగిమంటల సెగతో కాచుకున్న వేడినీటితో లేదా మామూలు నీటితో తలస్నానం చేసి కొత్తబట్టలు ధరిస్తారు.

ముగ్గులు

పండుగ నెలలో ముగ్గులు ప్రతిరోజు వేస్తారు, కాని భోగి రోజు ముగ్గు ఒక ప్రత్యేకత, ముగ్గువేసే వారికి ఇష్టం కూడిన మరింత కష్టం, సాధారణంగా ముగ్గు వేసే చోటనే భోగి మంటలు వేస్తారు, భోగి మంటల వలన చాలా కసువు తయారవుతుంది. ఆ కసువు అంతా పారబోసి కడిగి ముగ్గువేయడం కొంచెం కష్టంతో కూడుకొన్నప్పటికి ఇష్టమైన పనులు కాబట్టి చాలా ఆనందంగా చేస్తారు, రోజు వేసే ముగ్గుల కన్నా ఈ రోజు మరింత అందంగా రంగు రంగుల రంగవల్లికలేస్తారు.

భోగి పళ్ళు

భోగి పండుగ రోజు పిల్లలపై రేగు పండ్లు పోసి ఆశీర్వదిస్తారు, అందుచేత ఈ పళ్ళను భోగి పళ్ళు అంటారు, భోగి పళ్ళ ఆశీర్వాదాన్నీ శ్రీమన్నారాయణుడి ఆశీస్సులుగా భావిస్తారు.

Also Readఅమ్మాయి పుష్పావతి అయిన సమయములో చేయవలసినవి 

భోగి పులక

కొన్ని ప్రాంతాలలో భోగి రోజున రైతులు తమ సాగుభూమికి ఆనవాయితీగా కొంతమేర సాగునీరు పారించి తడి చేస్తారు, ఒక పంట పూర్తయిన తదుపరి మళ్ళీ పంట కొరకు సాగుభూమిలో నీరు పారించడాన్ని పులకేయడం అంటారు, ఆనవాయితీగా భోగి రోజున పులకేయడాన్ని భోగి పులక అంటారు.

Famous Posts:

భారతీయులు ప్రతి ఒక్కరూ  తెలుసుకోదగినవి అద్భుతమైన దేవాలయలు 

ఈ స్తోత్రం ప్రతిరోజూ చదివితే ఆర్ధిక సమస్యలు సమసిపోతాయి 

దేవుడికి ఏ పుష్పాన్ని అర్పింస్తే ఎలాంటి ఫలితం లభిస్తుంది

భార్య మంగళసూత్రాన్ని అలా వేసుకుంటే భర్త వందేళ్లు జీవిస్తాడు.

ప్రతి తండ్రి అదృష్టంలో కూతురు ఉండదు

చాలామందికి  తెలియని గాయత్రీ మంత్రం రహస్యం

ప్రకారం ఇలాంటి వారు ఎప్పటికీ ధనవంతులు కాలేరు

ఇంటి ముందు ముగ్గులు ఎందుకు వెయ్యాలి ?

anusankranti , bhogi , bhogi pratyekata, bhogi importane in telugu, bhogi meaning in telugu, bhogi festival, temple information in telugu, bhogi wiki.

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS