మూడు జన్మల బిచ్చగాడు
ఓ ఊళ్ళోని కామందు అనే వ్యాపారికి నిత్యం, తన దుకాణానికి వచ్చే బిచ్చగాళ్ళకి గుప్పెడు బియ్యమో, పండో, దమ్మిడీ కాసో ఇవ్వడం అలవాటు. ఏ బిచ్చగాడికీ లేదనకుండా ఏదో ఒకటి ఇచ్చి పంపేవాడతను.
ఒక బిచ్చగాడు ఆయన దానం చేసిన మొత్తాన్ని తనే అనుభవించక, అందులోని కొంత తోటి బిచ్చగాళ్ళకి దానమివ్వడం చూసానని ఓ రోజు ఆ కామందు దగ్గర పనిచేసే గుమాస్తా చెప్పాడు.
కామందుకి అదెంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. అందులోని నిజం తెలుసుకోడానికి మర్నాడు కామందు ఆ బిచ్చగాడికి దానం చేసాక అతన్ని రహస్యంగా ఎంబడించాడు.
బిచ్చగాడు తనకు దానంగా వచ్చిన బియ్యంలోంచి కొంత తోటి బిచ్చగాళ్ళకి ఇవ్వడం ఆయన గమనించాడు. ఐతే ఆయన అనుమాన పడ్డట్లుగా అందుకు ప్రతిగా అతను ఏమీ తీసుకోలేదు. ఉచితంగానే ఇచ్చాడు.
మరునాడు తన దుకాణానికి వచ్చిన ఆ బిచ్చగాడికి యధావిధిగా ఒక అరటి పండు దానం చేసి ఇలా అడిగాడు.
“దీన్నేం చేస్తావు?”
“సగం నేను తింటాను. సగం ఇంకెవరికైనా ఇస్తాను.”
| “అందుకు ఎంత డబ్బు ముడుతుంది నీకు?”
“డబ్బా? ఈ రోజు భిక్షకు రాలేని, రోగంతో వున్న ఇంకో బిచ్చగాడికి ఉచితంగా ఇస్తాను తప్ప అలా డబ్బుకి అమ్మను.” చెప్పాడా బిచ్చగాడు.
“నీ కడుపుకీ పండు సరిపోదుగా?” మళ్ళీ అడిగాడు కామందు.
“నేను అర్ధాకలితో ఉన్నాసరే, నాకు లభించిన దాట్లోంచి సగ భాగం దానం చేయకుండా వుండను.”
“ఎందుకు?” కామందు ఆశ్చర్యం రెట్టింపైంది.
చిన్నగా నవ్వాడా బిచ్చగాడు.
“ఓరోజు నేను ఓ రామభక్తుడి ఇంటికి అడుక్కోడానికి వెళ్ళాను. ఆ ఇంటాయన నా కేక విని “ఏమేవ్! మూడు జన్మల బిచ్చగాడొచ్చాడు. కాస్తంత ఏదైనా పెట్టి పంపు' అని అరవడం విన్నాను. ఆయన మాటల్లోని మర్మం ఎంత ఆలోచించినా నాకర్థం కాలేదు.
మర్నాడు వారింటికి వెళ్ళి ఆయన్నిఅడీగాను, మూడు జన్మల బిచ్చగాడని ఎందుకు పిలిచారని.
దానికాయన 'క్రితం జన్మలో నువ్వు బిచ్చగాడివి కనుకే ఎవరికీ బిచ్చం పెట్టి పుణ్యం సంపాదించలేదు. కాబట్టే, ఈ జన్మలోనూ బిచ్చగాడిగా పుట్టావు. ఈ జన్మలో కూడా క్రితం జన్మలోలాగా ఎటూ నీకు బిచ్చం ఇచ్చే స్థోమత లేదు. కనుక వచ్చే జన్మలో కూడా నువ్వు బిచ్చగాడిగానే పుడతావు. అందుకే నిన్నా పేరుతో పిలిచాను' అన్నాడు.
"అప్పటినించి నేను నాకు లభించిన దాట్లోంచి సగం ఇతరులకి భిక్ష వేస్తున్నాను.” చెప్పాడా భిక్షగాడు.
Famous Posts:
> అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం
> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి
> 100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం
> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం
> అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం
> ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే
> గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?
> శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి
devotional stories in Telugu PDF, devudu kathalu in Telugu, Telugu mythology stories in Telugu, mythological stories in Telugu PDF, Indian mythological stories in Telugu, god stories in Telugu, spiritual stories in Telugu, lord Shiva stories in Telugu