జాతక పరంగా దంపతులకు సంతానం కలగక పోవటానికి కారణాలు ఇవే | Reasons for Not Getting Pregnant When Everything


జాతక పరంగా దంపతులకు సంతానం కలగక పోవటానికి కారణాలు వివిధ రకాలుగా ఉంటాయి. వాటి గురించి కొంచం క్లుప్తంగా తెలుసుకుందాము.

సంతానం ఆలస్యంగా కలగటానికి, కలగక పోవటానికి లేదా సంతాన నష్టం కలగటానికి జాతకరీత్యా భార్యా భర్తల ఇరువురి జాతకాలనూ పరిశీలిస్తే సాధారణంగా ఇరువురి దాంట్లోనూ ఈ క్రింది కారణాలలో ఏదో ఒక కారణం తప్పకుండా వుంటుంది.

Also Readతల్లితండ్రుల గొప్పదనం గురించి  శాస్త్రాలలో చెప్పబడిన విధానం

రవి స్థితి వలన:

సంతాన సంబంధంగా జాతకంలో సూర్యుడి స్థితి బాగుండక పొతే.. దానికి కారణము ఈశ్వర ద్రోహము చేయడం వలన, గరుడ ద్రోహము వలన, పితృ దేవతల కోపం మొదలైన కారణాల వలన సంతతి ఆలస్యం అవడం, కలగక పోవడం లేదా సంతాన నష్టం ఉంటాయి.

చంద్ర స్థితి వలన:

సంతాన సంబంధంగా జాతకంలో చంద్రుడు స్థితి బాగుండక పోతే మాతృ క్లేశము వలన, మాతృ శాపము వలన, సుమంగళీ శాపము వలన, లేదా ఇతర పూజనీయ మైన స్త్రీల శాపం మొదలైన కారణాల వలన సంతానం ఆలస్యం అవడం, కలగక పోవడం లేదా సంతాన నష్టం ఉంటాయి.

కుజ స్థితి వలన :

సంతాన సంబంధంగా జాతకంలో కుజుడి స్థితి బాగుండక పోతే గ్రామదేవత ఆగ్రహము వలన, సుబ్రహ్మణ్య కార్తికేయుల అనుగ్రహము లేక పోవడం వలన, శత్రువుల, జ్ఞాతుల వలన, సోదర సోదరీల వలన కలిగిన శాపం మొదలైన కారణాల వలన సంతానం ఆలస్యం అవడం, కలగక పోవడం లేదా సంతాన నష్టం ఉంటాయి.

బుధ స్థితి వలన :

సంతాన సంబంధంగా జాతకంలో బుధుడి స్థితి బాగుండక పోతే బాలవ్యధ, అంటే.. ఇతరుల పిల్లల్ని బాధించడం వలన, పక్షుల గుడ్లను పోడుచుటవలన, విష్ణు దేవుని కోపం మొదలైన కారణాల వలన సంతానం ఆలస్యం అవడం, కలగక పోవడం లేదా సంతాన నష్టం ఉంటాయి.

గురుస్థితి వలన :

సంతాన సంబంధంగా జాతకంలో గురువు స్థితి బాగుండక పోతే వంశ మరియు ఆస్థాన, లేదా ఇంటి పురోహితుల శాపము వలన, బ్రాహ్మణ శాపము వలన, దైవనింద వలన, గురువు శాపము వలన, అనవసరంగా ఫల వృక్షాలు నరకడం మొదలైన కారణాల వలన సంతానం ఆలస్యం అవడం, కలగక పోవడం లేదా సంతాన నష్టం ఉంటాయి.

శుక్ర స్థితి వలన:

సంతాన సంబంధంగా జాతకంలో శుక్రుడి స్థితి బాగుండక పోతే శుక్ర దోషం మూలంగా సంతతి కలగదు. అంతే కాకుండా జాతకులు స్త్రీ లైనా పురుషులైనా సరే పుష్ప భరిత మైన చెట్లను నరకటం వలన, పవిత్రురాలైన స్త్రీకి ఏదో రకంగా హాని చెయ్యడం వలన, పశుసంతతిని నిర్లక్ష్యము చెయ్యడం వలన, గౌరవంగా సంసారం చేసుకొనే స్త్రీలకు హాని చెయ్యడం మొదలైన కారణాల వలన సంతానం ఆలస్యం అవడం, కలగక పోవడం లేదా సంతాన నష్టం కలగటం ఉంటాయి.

శని స్థితి వలన:

సంతాన సంబంధంగా జాతకంలో శని స్థితి బాగుండక పోతే అశ్వద్ద వృక్షాన్ని నిష్కారణంగా నరకటం వలన, యమధర్మరాజు శాపము వలన, పేద పిల్లలను పీడించటం వలన, పిశాచ పీడలు మొదలైన కారణాల వలన సంతానం ఆలస్యం అవడం, కలగక పోవడం లేదా సంతాన నష్టం ఉంటాయి.

రాహువు స్థితి వలన:

సంతాన సంబంధంగా జాతకంలో రాహువు స్థితి ననుసరించి సర్పకోపము వలన, మాతామహుల [ తల్లి వైపు పెద్దలు] శాపాలు మొదలైన కారణాల వలన సంతానం కలగక పోవడం లేదా నష్టం ఉంటాయి.

కేతువు స్థితి వలన:

కేతువు స్థితి ననుసరించి పితామహుల [ తండ్రి వైపు పెద్దలు] శాపం మొదలైన వాటి వలన సంతానం కలగక పోవడం లేదా సంతాన నష్టం ఉంటాయి.

Also Readవాస్తురిత్య మనీ ప్లాంట్‌ను ఏ దిశలో పెంచాలి ?

పైన చెప్పిన శాపాలు- ఆయా కర్మలు గత జన్మల్లో చేసినవి గనకా..ఈ జన్మలో వాటి ఫలితాల మూలంగా సంతానం ఆలస్యం అవడం, కలగక పోవడం లేదా సంతాన నష్టం జరగవచ్చు. కాబట్టి భార్యా భర్తల జాతకాల పరంగా ఏయే గ్రహాల దోషాలచేత సంతాన సంబంధ సమస్య ఉందో తెలుసుకుని ..ఆయా గ్రహదోష పరిహారార్ధం ఆయా గ్రహాలకి సరైన రీతిలో జపం దానము మొదలైనవి తమ యధాశక్తి చేసుకోవాలి.

అయితే కేవలం ఆయా గ్రహసంబంధ జపదానాలు, హోమాలు, యజ్ఞ యాగాలు, తీర్ధయాత్రలు చేస్తే సరిపోదు.. వాటితో పాటు అతి ముఖ్యంగా ఏయే పనులు చెయ్యడం వలన వాళ్లకి ఆ విధమైన సంతాన దోషం సంక్రమించిందో తెలుసుకుని ఆయా పనుల పట్ల పశ్చాత్తాపం కలిగి ఈ జన్మలో యధాశక్తి ఆయా తప్పులని సరిద్దిద్దు కోవాలి. అలా చెయ్యకుండా కేవలం జప, దానాలు, యజ్ఞాలు, యాగాలు, తీర్ధయాత్రలు చెయ్యడం వలన ఫలితం ఉంటుందని ఆశించకూడదు.

ముఖ్యంగా ఏ స్త్రీ అయితే సంతాన లేమితో బాధపడుతుందో ఆ స్త్రీ తన చుట్టుపక్కల ఉన్న అందరూ తన పిల్లలే అనే భావాన్ని కలిగించుకోవడం, వాళ్ళు తన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ అల్లరిని విసుక్కోకుండా కాస్త ప్రేమతో దగ్గరికి తియ్యడం, ముఖ్యంగా ఏ విధమైన కల్మషం లేకుండా అంటే వాళ్ళ పట్ల అసూయ భావం అనేది లేకుండా కేవలం స్వచ్చమైన వాత్సల్యంతో మాత్రమే ఉండటం అన్నది చాలా ముఖ్యం. అలాగే తన ఇంట్లో వాళ్ళైనా, చుట్టాలు పక్కాలు ఎవరైనా గర్భిణి స్త్రీలుగానీ, బాలింతలు గానీ ఉంటే వాళ్లకి అవసరం అయినంత వరకూ కాస్త సహాయ పడటం అన్నది కాస్త ఓర్పుగా చెయ్యాలి. అవి మాతృత్వం కావాలి అనుకునే స్త్రీ కి ముందుగా ఉండవలసిన ప్రధాన లక్షణం.

ఇంకా ఇప్పటి వరకూ పిల్లలు లేని వాళ్ళు పిల్లల కోసం తపించే వాళ్ళు ముఖ్యంగా తెలుసుకోవలసింది ఏంటంటే, తమకి పిల్లలు పుట్టలేదు అన్న దిగులు పక్కన పెట్టి, శాస్త్రం పై నమ్మకం ఉన్న వాళ్ళు దాని సహాయంతో తమ సంతాన లేమికి వెనుక ఉన్న కారణాలు శాస్త్ర ప్రకారం కూడా తెలుసుకుని, కారణాలు అవగాహన చేసుకుని దానికి సంబంధించిన దోషాలు నివారణలు చేసుకునే ప్రయత్నం చెయ్యాలి.

అంతే కాకుండా ఆ ప్రయత్నంలో భాగంగా వాళ్ళకి పిల్లలు పుట్టే వరకూ [ పుట్టక పోయినా కూడా ] తమ చుట్టుపక్కల ఉన్న పేద ధనిక అనే తారతమ్యం లేకుండా అందరి పిల్లల్ని ప్రేమతో ఆదరించడం అనేది చెయ్యాలి. తమకే గనక పిల్లలు పుడితే వాళ్ళపై నెలకి ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేసి ఆ డబ్బుని మంచి మనసుతో, ఒక సద్భావంతో పక్కకి తీసి పెట్టి ఆ డబ్బుతో అనాధ పిల్లల శరణాలయాలకి వెళ్లి అక్కడ ఉన్న వాళ్లకి తగిన వసతులు కల్పించడం, అలాగే రోగగ్రస్తులైన పసిపిల్లలకి వైద్య సౌకర్యం కల్పించడం, పేద పిల్లలకి చదువుకి తగిన సహాయ సహకారాలు అందించడం, వాళ్లకి బట్టలు పుస్తకాలు, తగిన ఆహార సౌకర్యాలు అందించడం అన్నది పాప పరిహారార్ధం పని గట్టుకుని వెళ్లి మరీ చెయ్యాలి.

Also Readకాలుకి నల్ల దారం కట్టుకోవడం వెనక రహస్యమేంటి?

అలాగే తమ బంధువర్గంలో ఆర్ధిక స్థితి బాగాలేని కుటుంబాల పిల్లలకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు వాళ్లకి తగిన విధంగా సహాయం చేసి ఆదుకోవాలి. అలాంటి అవకాశం వచ్చినప్పుడు లేదా అలాంటి పిల్లలు తమ కళ్ళ ముందు కనపడినప్పుడు తప్పకుండా తగిన విధంగా తాము చెయ్యగలిగిన విధంగా స్పందిచాలి. ఆ విధంగా పిల్లలు పుట్టే వరకూ [వాళ్ళు పుట్టక పోయినా సరే] తమకు పిలల్లు ఉన్నారు అనే భావన తోనే వాళ్ళ పేరు చెప్పి మంచి పనులు చేస్తూనే ఉండాలి. వాళ్ళందరూ కూడా తమ పిల్లలే అన్న భావన కలిగి ఉండాలి. అలా చెయ్యడం వలన ఎన్నో దోషాలు తొలగిపోతాయి. అటువంటి పనులు చెయ్యడం వలన ఫలితం వృధాగా ఎన్నటికీ పోదు. మనిషి తాను చేసిన సమస్తమైన పాపాలని కడుక్కోడానికి ఎక్కడైనా ముక్కు మూసుకుని తపస్సు చేసుకోవడం లేదా అలా వీలుకాని పక్షంలో తనది అనుకున్నది నిష్కామ బుద్ధితో త్యాగం చెయ్యడం తప్ప వేరే దారి లేదు. అందువలన పిల్లలు పుట్టలేదని బాధపడకుండా తమ చుట్టూ అవసరంలో ఉన్న పిల్లల్ని తమ పిల్లలుగా భావించి వాళ్ల పట్ల సరైన రీతిలో స్పందించి తగిన ప్రేమని చూపించే దంపతులే సంతానాన్ని కోరుకోవడానికి నిజంగా అర్హులు అవుతారు.

స్త్రీ కి మాతృత్వం అనేది ఒక వరం. అలాగే మాతృమూర్తి అనిపించుకోవడం కూడా ఇంకా గొప్ప వరం. అది ఎలా అంటే.. ఏ తల్లి అయితే తనమన అనే బేధం లేకుండా తన సమస్త బందువర్గంతో పాటు, ఇరుగు పొరుగు వారిని,వారి పిల్లలని, అతిధి అభ్యాగతులని, ఇంకా తన ఇంట పనిచేసే వాళ్ళందరినీ కూడా కన్నా తల్లి లాగా సమభావంతో చూస్తూ, వాళ్లకి కష్టం వచ్చినప్పుడు అండగా నిలిచి వాళ్ళని తగిన విధంగా ఆదరిస్తూ ఇతర స్త్రీలకూ ఆదర్శవంతురాలిగా నిలుస్తుందో ఆ స్త్రీ మాత్రమే నిజమైన మాతృమూర్తి అని పిలవబడుతుంది. అయితే అలాంటి మాతృ మూర్తులు ఈ కాలంలో చాలా అరుదుగా ఉంటారని చెప్పచ్చు.

Famous Posts:

భర్త భార్యను ఇలా పిలవడం మానేయండి.


తుల‌సి_చెట్టు మారే స్థితిని బ‌ట్టి ఆ ఇంట్లో ఏం జ‌రుగుతుందో ముందే చెప్ప‌వ‌చ్చ‌ట‌


చండీ హోమం ఎందుకు చేస్తారు? చండీ హోమము విశిష్టత ఏమిటి?


ఇంట్లో పూజ ఎవరు చేయాలి? 


ఒక స్త్రీ పురుషుని నుండి ఏమి కోరుకుంటుంది..?


పెళ్లి కావట్లేదా అయితే ఒక్క సారి ఈగుడిని దర్శించండి...

pregnant, wife , husband, relations, సంతానం , children's, 

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS