ఆకాశదీపం ఎందుకు వెలిగించాలి?
ఆకాశదీపం ప్రాముఖ్యత ఏమిటి తెలుసుకుందాం
శివ కేశవులకి ఎంతో ప్రియమైనది కార్తీకమాసం. ఈ మాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజ స్తంభానికి ‘ఆకాశ దీపం’ వెళ్లాడ దీస్తుంటారు. చిన్న చిన్న రంధ్రాలు చేయబడిన ఓ గుండ్రని ఇత్తడి పాత్రలో నూనెపోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు.
Also Read : కార్తీక పౌర్ణమి ఏరోజు వచ్చింది ? కార్తీక పౌర్ణమి రోజు ఇలా చేస్తే.. జీవితంలో పొందే అత్యంత గొప్ప ఫలితాలు..
ఆకాశదీపం పితృదేవతలకు మార్గాన్ని చూపుతుంది
తాడు సాయంతో ఈ పాత్రను పైకి పంపించి, ధ్వజస్తంభం పైభాగాన వేలాడదీస్తారు. అయితే దీనిని ఆకాశ దీపం అని పిలవడానికి … ధ్వజ స్తంభానికి వేలాడదీయడానికి ఓ కారణం వుంది. ఆకాశ మార్గాన ప్రయాణించే పితృదేవతల కోసమని కార్తీకపురాణం చెబుతోంది. కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి పితృ దేవతలంతా ఆకాశమార్గాన తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తుంటారు. ఈ సమయంలో వారికి త్రోవ సరిగ్గా కనిపించడం కోసం ఆలయాలలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తుంటారు.
ఆకాశదీపం శివ కేశవుల తేజస్సు జగత్తుకు అందిస్తుంది
ఆకాశదీపం మరో ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే శివ కేశవుల శక్తితో ఈ దీపం ధ్వజస్తభం పైనుండి జగత్తుకు అంతా వెలుతురు ఇస్తుంది, ఇవ్వాలి అని వెలిగిస్తారు. దీపాన్ని వెలిగిస్తూ ‘‘దామోదరమావాహయామి’’ అని‘‘త్రయంబకమావాహయామి’’ అని శివకేశవులను ఆహ్వానిస్తూ వెలిగిస్తారు. ఒక్కో చోట రెండు దీపాలు శివకేశవుల పేరుతో వెలిస్తారు. లేదా ఒక దీపం పెట్టి శివకేశవుల్లో ఏవరో ఒకరిని దీపంలోకి ఆహ్వానిచాలి. ఇలా శివకేశవుల తెజస్సుతో ఈ దీపం జగత్తుకు వెలుగునందిస్తుంది. అంటే…
సమాజంలో అజ్ఞానపు చీకట్లు తొలిపోతాయి. కాంతి వలే మనలో ఆధ్యాత్మిక జ్యోతి ప్రజ్వలనం అవుతుంది అని అర్థం. దీపానికి ఎంతో ప్రాధాన్యత ఉన్న కార్తీకమాసం ప్రారంభం కూడా ఆశాశదీపంతోనే జరుగుతుంది.
Also Read : కార్తీక మాసంలో ఇవి తీసుకోకూడదు..
ఆకాశదీపం ప్రాధాన్యత
ఆకాశదీపం వెలిగించినా, దీపంలో నూనె పోసినా, ఈ దీపాన్ని దర్శించుకుని నమస్కరించుకున్నా పుణ్యప్రాప్తి కలుగుతుంది. మనలోని అజ్ఞాన అవివేకాలు తొలగిపోతాయి… అంతేకాకుండా పితృదేవతలు కూడా సంతుష్టులవుతారు.
దేవాలయాల్లోనే కాకుండా ప్రతి ఇంట్లో కూడా ఆకాశదీపం వెలిగించ వచ్చు. దీపానికి పూజచేసి దీప, ధూప నైవేద్యాలు సమర్పించి శివకేశవులను స్మరిస్తూ నమస్కరిస్తూ ఆకాశదీరం వెలిగించి ఎత్తుగా ఒక కర్రకట్టి దానికి వేలాడదీయ వచ్చు.
దీపం జ్యోతిః పరం బ్రహ్మ
దీపం సర్వతమోపహమ్ |
దీపేన సాధ్యతే సర్వమ్
దీప లక్ష్మీ నమోస్తు తే ||
శివయ్య అందరిని చల్లగా చూడు తండ్రి
Famous Posts:
ఆకాశదీపం, Karthika Masam, Akasha Deepam, Akasha Deepam importance in telugu, Kartik Poornima, kartik month 2020