నాగుల చవితి పూజ విధానం - ఇలా చేస్తే సంతాన ప్రాప్తి | Nagula Chavithi Pooja Vidhanam in Telugu - Nagula Chavithi

 

దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీకశుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగా జరుపుకోవడం మన సంప్రదాయం. మరికొందరు శ్రావణ శుద్ధ చతుర్థి నాడు జరుపుకుంటుంటారు.

నాగులచవితి రోజున ఉదయాన్నే లేచి తలంటు పోసుకొని ఇంట్లో దేవుని వద్ద దీపారాధన చేయాలి. ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజామందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి. పూజా మందిరంలో కలశమును ఏర్పాటు చేసి దానిపై ఎరుపు వస్త్రాన్ని పరుచుకోవాలి.

నాగేంద్రస్వామి (పాముపడగ) ప్రతిమను గానీ, లేదా ఫోటోను గానీ పూజకు ఉపయోగించాలి. పూజకు మందార పూలు - ఎర్రటి పువ్వులు – కనకాంబరములు, నైవేద్యమునకు చిన్నచిన్న ఉండ్రాళ్ళు, వడపప్పు, అరటిపండ్లు, చలిమిడిలను సిద్ధం చేసుకోవాలి. ఉదయం 9 గంటలలోపు పూజను పూర్తి చేయాలి. పూజకు ముందు నాగేంద్ర అష్టోత్తరము, నాగేంద్ర స్తోత్రము, నాగస్తుతి, నాగేంద్ర అష్టోత్తరము, నాగేంద్ర సహస్రనామములను పఠించడం ద్వారా సకల సంతోషాలు ప్రాప్తిస్తాయని పెద్దల విశ్వాసం.

స్తోత్రములు పఠించేందుకు వీలుకాని పక్షములో ఓం నాగేంద్ర స్వామినే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. దీపారాధనకు నువ్వుల నూనె వాడాలి. 7 దూది వత్తులు, ఆవు నేతితో సిద్ధం చేసుకున్న దీపంతో హారతి ఇచ్చి నైవేద్యమును సమర్పించుకోవాలి. పూజ ముగిసాక నాగేంద్రస్వామి నిత్య పూజ అనే పుస్తకమును తాంబూలముతో చేర్చి, ముత్తైదువులకు అందజేయాలి.

అనంతరం దగ్గరలో ఉన్న పుట్టవద్దకు పోయి దీపం వెలిగించి పుట్టలో పాలుపోసి పూజ చేయాలి. నాగులచవితి రోజున ఆవు పాలు పుట్టలో పోసి, నాగపూజ చేసి చలిమిడి, చిమ్మిరి ఉండలు (నువ్వులతో చేస్తారు), అరటిపళ్ళు, తాటి బుర్ర గుజ్జు, తేగలు మున్నగునవి స్వామికి నివేదించాలి. నాగరాజుకు హారతి పట్టడం గాని, వేడి పదార్థాల ఆరగింపు గాని పనికి రాదు. పూజ అయిన తరువాత నైవేద్యం పెట్టి ఆ రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేయాలి. పాలను పుట్టలో పోస్తూ “నన్నేలు నాగన్న నాకులము నేలు నాకన్న వారల నాయింటి వారల ఆప్తుల మిత్రుల నందరను నేలు పడగ త్రొక్కిన పగ వాడనుకోకూ నడుము త్రొక్కిన నా వాడనుకొనుమూ తోక త్రొక్కిన తొలగుచు పొమ్ము ఇదిగో! నూకనిచ్చెదను మూకను నాకిమ్ము పిల్లల మూకను నాకిమ్ము” అంటూ ఈ విధంగా ప్రార్థిస్తారు.

నాగుల చవితి రోజున నాగదేవతలకు పంచామృతములతో అభిషేకం చేయిస్తే సర్వం సిద్ధిస్తుందని నమ్మకం. దేవాలయాల్లో నాగేంద్ర అష్టోత్తర పూజ, నాగేంద్ర సహస్రనామపూజలు చేయించుకుంటే శుభదాయకం. ఇంకా మోపిదేవి ఆలయం, నాగేంద్రస్వామి పుట్టలను నాగుల చవితి రోజున సందర్శించేవారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని ప్రగాఢ నమ్మకం. చెవిబాధలు, కంటిబాధలు ఉన్నవాళ్ళు చవితి నాడు ఉపవాసం ఉంటే మంచిది. నాగ వస్త్రాలు పుట్టమీద పెట్టి తీసి ధరిస్తే కోరికలు తీరతాయని కూడా కొందరి నమ్మకం.

పుట్టకు సంసారంకు సంబంధం ఏంటి.?

ఎవరైనా పుట్టకు కోడి గుడ్డు సమర్పించాలనుకునే వారు పుట్టపై పెట్టాలి తప్ప పుట్ట రంద్రాలలో వేయకూడదు. పాము పుట్టలోకి వెళ్ళె మార్గానికి అంతరాయం కలిగించకూడదు. పుట్టపై బియ్యం పిండిలో చక్కర కలిపి పుట్టపై చల్లాలి, దీని వలన పుట్టను అభివృద్ధి చేసే చీమలకు ఆహారం సమృద్ధిగా లభించడం వలన పుట్ట పెరుగుతుంది ఆ పుణ్య ఫలంతో సంసారం అభివృద్ధి చెందుతుంది. ఇక పూజకోరకు తీసుకువెళ్ళిన పసుపు, కుంకుమ పూలతో అలంకరణ చేసుకుని బెల్లంతో వండిన పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి. మీ కోరికలు తీరడానికి బంగరం, వెండితో చేసిన ఐదు నాగపడిగేలను పుట్టలో వేసి దూప, దీప, నైవెద్యాలు సమర్పరించిన తర్వత కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్ళను పుట్టపై చల్లాలి.

చివరగా అక్షితలు చేతిలోపట్టుకుని మనస్సులో దాగిఉన్న కోరికలను నాగాదేవతకు విన్నవించుకుంటూ పుట్టచుట్టూ మూడు ప్రదక్షిణలు భక్తిశ్రద్ధలతో చేయాలి. హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి. ఇక్కడ మగవారు సాష్టాంగ ,ఆడవారు మోకాలి పై వంగి , గర్భిని స్థ్రీలు నిలబడి నమస్కారం చేసుకోవాలి. సంతాన సమస్యలు ఉన్న స్త్రీలు పుట్టపై ఉన్న తడి మట్టిని కొంత తన చేతితో తీసుకుని పొట్ట భాగంలో రాసుకోవాలి. ఇలా చేస్తే పిల్లలు కాని వారికి గర్భ సంబంధమైన దోషాలకు చక్కటి తరునోపాయం. భక్తితో ఈ నాగదేవత పూజ చేస్తే సమస్త దోషాలకు చక్కటి నివారణ మార్గం అని చెప్పవచ్చు ..

Famous Posts:

భర్త భార్య మాట వినాలంటే ఏమి చేయాలి ? 

వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.

శివుడు చెప్పిన ‘ఆదివిద్య’లు

శివ గుణాలు లోకానికి సందేశాలు

భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?

కూతురా కోడలా ఎవరు ప్రధానం...? 

సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు?

కాకికి అన్నం ఎందుకు పెట్టడం ?

మీకు ఏదైనా సమస్య ఉందా అయితే వెంటనే ఈ స్వామి వారికి ఉత్తరం రాయండి

Nagula Chavithi, nagula chavithi date 2021, nagula chavithi 2020 date in telugu, nagula chavithi 2020 date in ap, nagula chavithi 2020 in ap, nagula chavithi 2020 telugu calendar, nagula chavithi telugu, nagula chavithi 2021, నాగుల చవితి, నాగుల పంచమి

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS