జ్యోతిషశాస్త్రంలో రత్నాల్లో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రత్నాలు జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. అంతేకాకుండా జాతకంలో బలహీనంగా ఉన్న బలపరుస్తాయి. మీరు ఎంచుకున్న రంగంలో విజయం సాధించాలంటే తగిన రత్నాలు ధరించాలని శాస్త్రాల్లో పేర్కొన్నారు.
జీవితంలో ఉన్నత స్థానంలో ఉండాలని ప్రతి ఒక్కరూ ఆశపడుతుంటారు.అందుకు తగ్గట్టుగానే నిరంతరం కష్టపడుతూ విజయాన్ని అందుకోవాలని ఎంతో మంది ప్రయత్నిస్తుంటారు. కానీ కొందరిలో ఎంత కష్టపడ్డా విజయాన్ని చేరుకోలేరు.మరి కొందరిలో తక్కువగా కష్టపడిన విజయాన్ని అందుకుంటారు.
Also Read : ఉపయోగం ఉత్తమ పరిహారాలు - చిట్టి తంత్రాలు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జీవితంలో ఉన్నత స్థానాన్ని సాధించాలంటే రత్నాలకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు.వివిధ రంగాలలో రాణించాలనుకునే వారు వివిధ రకాల రత్నాలను ధరించడం వల్ల అనుకున్న విజయాలను సాధిస్తారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.అయితే ఏ రత్నం ధరించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం..
పుఖ్రాజ్ రత్నం:
రాజకీయ రంగంలో రాణించాలనుకునే వారు ఈ వజ్రాన్ని ధరించడం వల్ల ఈ రంగంలో రాణిస్తారు.ఈ వజ్రం బృహస్పతి అనుకూలంగా పరిగణిస్తారు.దీనిని ధరించడం ద్వారా బృహస్పతి స్థానాన్ని బలపరుస్తుంది.అంతే కాకుండా సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇది గౌరవంతో పాటు కీర్తిని పెంచుతుంది. అంతేకాకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తిని పెంచుతుంది. జీవితంలో ఆర్థిక సమస్యల కూడా అంతమవుతాయి.
మాణిక్యం :
ఉద్యోగంలో పదోన్నతి పొందాలని భావించేవారు మాణిక్యాన్ని ధరించాలి.మాణిక్యం సూర్యుని రత్నం.ఈ రత్నాన్ని ధరించడం ద్వారా సూర్యుని వలె ఎంతో ప్రకాశవంతంగా, ధైర్యంతో ముందుకు వెళ్తారు.ఈ రత్నం ఎరుపు రంగులో ఉండటం వల్ల రక్తాన్ని సూచిస్తుంది దీనిని ధరించిన వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు కూడా ఉండవు. అంటే వ్యాధులను తొలగిస్తుంది. మీరు పరిపాలక ప్రాంతానికి వెళ్లాలనుకుంటే ఈ రత్నాన్ని ధరిస్తే అంతా మంచే జరుగుతుంది.పచ్చ :
జ్యోతిషశాస్త్రం ప్రకారం మీరు విద్య విభాగం, బ్యాంకు, వ్యాపారవేత్త లేదా ఉపన్యాసం మొదలైన వాటికోసం ఈ పచ్చ రత్నాన్ని ధరించగలుగుతారు. ఫలితంగా మీ ఆదాయపు పన్ను, వైద్యులు, ఛార్టర్డ్ అకౌంటెంట్లు మొదలైన రంగాల్లో ఆటంకాలు కలిగి ఉంటే పచ్చను ధరించవచ్చు. ఇది బుధ గ్రహాన్ని సూచిస్తుంది. ఫలితంగా దీన్ని ధరించడం ద్వారా జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అంతేకాకుండా జీవితంలో విజయాన్ని సాధిస్తారు.వజ్రం:
సినీరంగానికి కళారంగానికి సంబంధించిన వారు ఈ వజ్రాన్ని ధరించడం ద్వారా ఆ రంగంలో ఉన్నత స్థానాన్ని సంపాదిస్తారు.ఈ వజ్రం ధరించడం వల్ల ఎల్లప్పుడు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తులతూగుతారు. దీంతో పాటు మీకు ప్రేమ, వైవాహిక జీవితంలో ఆనందంలో పెంపొందుతుంది. జీవితంలో ఎలాంటి సమస్యలున్నా చివరకు అధిగమిస్తారు.పగడం:
న్యాయవాది, జడ్జీలు, పరిపాలన రంగంలో విజయం సాధించాలని కొనేవారు పగడాన్ని ధరించాలి.ఈ పగడాన్ని కేవలం మంగళవారం రోజున మాత్రమే ధరించాలి. అంతేకాకుండా పోలీసు శాఖ లేదా సైనిక రంగాలలో చేరాలనుకునే వారు పగడం కచ్చితంగా ధరించాలి. దీనిని ధరించడం ద్వారా మనోధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జీవితంలో కష్టాలు వచ్చినా వాటిని సమర్థవంతంగా అధిగమిస్తారు.టాంజనిట్ రత్నాలు:
మీరు ఆకర్షితులుగా ఉండాలనుకుంటే టాంజనిట్ రత్నాలను ధరించడం వల్ల మంచి జరుగుతుంది. టాంజనిట్ నీల రత్నానికి ఉప రత్నం గా భావిస్తారు.ఈ రత్నాన్ని ధరించడం వల్ల శని దేవుడి అనుగ్రహం మన మీద కలిగే ఎటువంటి శని బాధలు లేకుండా సుఖ సంతోషాలతో గడుపుతారు. దీని ద్వారా అనుకున్న పనులు పూర్తవుతాయి. అందువల్ల జీవితంలో విజయాన్ని అందుకుంటారు. కాబట్టి టాంజనిట్ వల్ల ఆనందం ఉంటుంది.
సలహా లేకుండా రత్నాలు ధరించవద్దు..
ఏదైనా రత్నం ధరించే ముందు జ్యోతిష్కుడిని ఓ సారి సంప్రదించండి. సలహా లేకుండా రత్నాలు ధరించడం కూడా హాని కలిగిస్తుంది. చాలా మంది రత్నం తెలియకుండానే ధరిస్తారు. దీని వల్ల నష్టాలు సంభవిస్తాయి. కాబట్టి రత్నాలు తెలుసుకోకుండా ధరించకపోవడం ఉత్తమం. అలా కాకుండా ఏ రత్నం పడితే ఆ రత్నం ధరించడం వల్ల మన జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి.Famous Posts:
> అప్పులకు స్వస్తి చెప్పే ఐశ్వర్య దీపం.. ఎలా వెలిగించాలి?
> కొత్త కోడలు రాగానే సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారు?
> మంగళ, శుక్రవారాల్లో ఎవరికీ డబ్బు ఇవ్వకూడదా?
> భర్త భార్య మాట వినాలంటే ఏమి చేయాలి ?
> వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.
> శివ గుణాలు లోకానికి సందేశాలు
> భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?
> కూతురా కోడలా ఎవరు ప్రధానం...?
> సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు?
రత్నాలు, stones for rings in telugu, types of stones for rings, stones for rings as per astrology, stones for rings according to horoscope, stones for rings names, types of stones for rings in hindi, ring stone price, stone ring design for female