జాతక ఫలితాలు తెలియని వారి కోసం | పుట్టిన సమయం లేని వారి కోసం | Telugu Horoscope - Jatakam

జాతక ఫలితాలు తెలియని వారి కోసం

జాతకం లేని వారికి ఈ పోస్ట్ చాలా ఉపయోగపడుతుంది... 

అంటే పుట్టిన సమయం లేని వారికే కాదు..

జాతకం ఉన్న వాళ్ళుకూడా చేసుకోవచ్చును.

ఆదిత్య హృదయం:

ఇది సూర్యునికి సంభందించినది. 

ఈ ఆదిత్య హృదయం రామ రావణ యుద్ధ సమయంలో అగస్త్య మహర్షి రామునికి ఉపదేసించినాడు. 

దీనిని రోజూ ప్రాతః సమయమున పఠించుట వలన ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను పొందుతారు. మరియూ మనిషిలో దాగిఉన్న కామ,క్రోధాది అంతః శత్రువులను నాశనం చేస్తుంది...పాపాలను నాశనం చేస్తుంది. 

చింతల నుండి, దుఃఖముల నుండి ఉపశమనం కలిగిస్తుంది... ప్రతి నిత్యం జపిస్తే విజయం తప్పక లభిస్తుంది. ఇది పఠించిన పిదపనే రాముడు రావణుని పై విజయం సాదించాడు.

ఋణ విమోచక అంగారక(కుజ) స్తోత్రం

జీవితంలో మనకు ఎదురైన అనేక ఇబ్బందులకు అప్పులు చేస్తూ ఉంటారు. 

వాటిని తీర్చలేక ఇబ్బందులు పడుతుంటే 

"ఋణ విమోచక అంగారక (కుజ) స్తోత్రం" 

నలబై ఒక్క రోజులు పారాయణ చేస్తూ ,

నవగ్రహాలకు రోజూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చెయ్యాలి. చివరి రోజు కందులు, ఎర్ర బట్ట దక్షిణగా పెట్టి, కుజునకు మీ పేరు మీద అష్టోత్తరం చేయించండి. మీ అప్పులు తప్పక తీరుతాయి.

మీకు వ్యాపారంలో తరచూ నష్టాలు వస్తూ, అప్పులు వసూలు కాకుండా ఉండటం జరుగుతోందా?

అయితే మీరు "విష్ణు సహస్ర నామ స్తోత్రం" 

నలుబై ఒక్క రోజులు పారాయణ చెయ్యండి. 

సాయంత్రం వేళ రోజూ చేస్తే ఇంకా మంచిది. 

చివరి రోజు విష్ణు ఆలయానికి వెళ్లి గోత్ర నామాలతో స్వామికి అష్టోత్తరం చేయించండి. 

మీ భాదలు తగ్గి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది.

మీకు వివాహమై ఎంతో కాలమైనా సంతానము లేదా?

అయితే మీరు ఒకసారి కాళహస్తి వెళ్లి రాహు, కేతు, కుజ గ్రహాలకు "సర్ప దోష నివారణ పూజ" చేయిన్చండి. 

" సంతాన గోపాలకృష్ణ వ్రతం" నియమ నిబంధనలతో ఒకసారి మీ ఇంటిలో చెయ్యండి... వీలుంటే రెండు శాంతి ప్రక్రియలు చేస్తే ఇంకా మంచిది.. తప్పక సంతానం కలుగుతుంది.

Also Readసంతానం కోరుకునే వారికీ కచ్చితమైన పరిష్కార మార్గం 

వివాహం ఆలస్య మవుతోందా?

అయితే మీరు "రుక్మిణి కళ్యాణం" పారాయణ చెయ్యండి. (లేదా) నలుభై ఒక్క రోజులు ,

రోజుకి నలుభై ఒక్క ప్రదక్షిణలు నవగ్రహాలకు చేసి, చివరి రోజు నవగ్రహాలకు పూజ చెయ్యండి.

ఐతే నవగ్రహాలకు తిరిగే మొదటి రోజు మీ కోరిక చెప్పుకొని మొదలు పెట్టండి. తప్పక వివాహము జరుగుతుంది.

ధనమునకు ఇబ్బంది పడుతున్నారా? 

ప్రతి నెలలో ఒక మాస శివరాత్రి వస్తుంది. 

ఆ మాస శివరాత్రి రోజున శివునకు 

"ఏకన్యాస రుద్రాభిషేకం" చెయ్యండి. 

అలా ఎనిమిది మాస శివరాత్రులు శివునకు రుద్రాభిషేకాలు చేయించండి.. మీ ధన ఇబ్బందులు తప్పక తొలిగి పోతాయి.

ధనము బాగా సంపాదించాలి అనుకున్న నిత్యమూ  "శ్రీ సూక్తము" పారాయణ చేయవలెను.

హనుమాన్ చాలీసా :

హనుమంతుడు కల్పవృక్షం లాంటి వాడు. 

కల్పవృక్షాన్ని ఆశ్రయించిన అన్ని కోరికలు 

క్షణంలో నెరవేరుతవి. అటువంటి కల్పవృక్షం దరికి చేర్చగల చక్కని సులభమైన మార్గం "హనుమాన్ చాలీసా". 

ఈ హనుమాన్ చాలీసాను సాక్షాత్తు పరమేశ్వరుని ఆదేశానుసారం శ్రీ గోస్వామి తులసీదాసు గారు రచించిరి. 

ఈ హనుమాన్ చాలీసాను దినమునకు పదకొండు పర్యాయములు చొప్పున మండలం (నలుభై రోజులు) పారాయణం చేసిన సర్వ కార్యసిద్ధి కలుగును.

ఒకే ఆసనమున కూర్చుని నూట ఎనిమిది పర్యాయములు పటించిన విశేష కార్యసిద్ధి కలుగును.

నిత్యమూ మూడు వేళలా ఒక పర్యాయము చదివిన వారి యోగక్షేమములు భక్త రక్షకుడగు శ్రీ హనుమంతుడు తాను స్వయంగా చూచుకొనును..

Famou Posts:

సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు


ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు.


ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే


అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం


> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి


100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం


> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం


అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం


ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే


గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?


శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి

Telugu Astrology, జాతకం & రాశి ఫలాలు, Telugu Horoscope, telugu poorthi jathakam, date of birth, telugu jathakam for marriage, na jathakam cheppandi, telugu jathakam 2020

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS