శ్రీ గురుదత్త రాఘవేంద్ర స్వామికి గురువారం అత్యంత ప్రీతికరమైన రోజు. కర్నూలు జిల్లా మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినది.
గురువారం రోజున ఇక్కడ స్వామివారికి ప్రత్యేక పూజా అలంకారాలు నిర్వహిస్తారు. రాఘవేంద్ర స్వామి బృందావనం లోకి ప్రవేశించినది గురువారమే కాబట్టి, గురువారం స్వామివారికి ఎంతో విలువైనది.
ఒక్క మంత్రాలయం లోనే కాకుండా, మైసూరు లో కూడా స్వామివారికి విశేషపూజలు జరుగుతాయి. రాఘవేంద్ర స్వామి ఎన్నో మహిమలను కలిగాడు. స్వామి వారిని పూజించడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. స్వామివారికి ఏడు వారాలు పూజలు చేయడం ద్వారా ఎలాంటి ఫలితాలు కలుగుతాయి తెలుసుకుందాం..
రాఘవేంద్ర స్వామి ఎంతో మహిమగల దేవుడని అందరి విశ్వాసం. స్వామివారిని ఏడు వారాల పాటు నియమనిష్టలతో పూజించి, కఠిన ఉపవాస దీక్షలు చేయడం ద్వారా మనం అనుకున్న ఎటువంటి కార్యక్రమాలు అయినా నెరవేరుతాయి. అయితే స్వామివారిని ఏ విధంగా పూజించాలో తెలుసుకుందాం.
గురువారం ఉదయం మన ఇంటిని శుభ్రపరచుకుని, స్నానమాచరించి మన పూజగదిని శుభ్రం చేసుకుని స్వామివారి ఫోటోకి ప్రత్యేక అలంకరణ చేసి, పూజను నిర్వహించాలి. స్వామివారికి ఎర్రని పుష్పాలతో పూజ చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. ప్రతి గురువారం స్వామివారి మంత్రాన్ని 11 సార్లు పట్టిస్తూ కఠిన ఉపవాస దీక్షలతో పూజలు నిర్వహించాలి.
ఆరు వారాలు ఈ విధంగానే పూజలు నిర్వహించాలి.
ఏడవ వారం స్వామి వారికి ప్రత్యేక పూజ నిర్వహించాలి.
స్వామివారిని పూజించడానికి ముందుగా వినాయకుడికి పూజ నిర్వహించి కొబ్బరి కాయలను సమర్పించాలి.తరువాత రాఘవేంద్ర స్వామి కి తులసి మాలలను సమర్పించి పూజా విధానాన్ని మొదలుపెట్టాలి.
స్వామివారికి ఏడవ వారం నైవేద్యంగా బెల్లంతో చేసిన పాయసం స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి.తులసి ఆకులను మన చేతిలో పెట్టుకుని స్వామివారి మంత్రాన్ని పఠిస్తూ 11 సార్లు ప్రదక్షణలు చేసిన తరువాత తులసి ఆకులను స్వామివారికి సమర్పించాలి.
ఉపవాసం చేసే వారు రాత్రిపూట కేవలం పాలు ,పండ్లు మాత్రమే సేవించాలి.ఉపవాస దీక్ష చేసే వారు ఎప్పుడు కూడా మంచం మీద పడుకోకూడదు.
కటిక నేల పైన పడుకోవడం వల్ల మనం చేసిన ఏడువారాల వ్రతానికి ఫలితం లభిస్తుంది.ఈ విధంగా 7 వారాలు నియమనిష్టలతో స్వామి వారిని పూజించడం వల్ల మన ఇంట్లో సిరిసంపదలకు లోటు ఉండదు. మనం తలపెట్టిన ఎటువంటి కార్యక్రమాలైన సకాలంలో పూర్తి అవుతాయి.
Famous Posts:
> చండీ హోమం ఎందుకు చేస్తారు? చండీ హోమము విశిష్టత ఏమిటి?
> ఒక స్త్రీ పురుషుని నుండి ఏమి కోరుకుంటుంది..?
> పెళ్లి కావట్లేదా అయితే ఒక్క సారి ఈగుడిని దర్శించండి...
> శయనిస్తున్నశివుడు ప్రపంచంలో ఏకైక_ఆలయం
> ఈ స్తోత్రమును శివుడు పార్వతికి చెప్పెను | ధన దేవతా స్తోత్రం
> శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం..శనివారం మహిమ.
> దేవుడిని ఇలా కోరుకోండి.. తప్పక మీ కోరిక తీరుస్తాడు..!
> సోమవారం ఇలా చేయండి రుణ బాధలు వదిలిపోతాయ్
రాఘవేంద్ర స్వామి, Mantralayam Raghavendra Swamy, Raghavendra Swamy, raghavendra swamy miracles, raghavendra swamy powerful mantra, raghavendra swamy pooja at home, thursday fasting raghavendra swamy, seva for raghavendra swamy mantralaya, Thursday