చరిత్రను ఓ సారి పరికిస్తే... హిందూ సంస్కృతి ఆనవాళ్ళు విశ్వవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఉన్నట్టు ఇప్పటికే రుజువులు ఉన్నాయి. వందల వేల ఏళ్ల క్రితమే మన హిందూ సంస్కృతి ప్రపంచం నలుమూలలకు విస్తరించింది. దీనికి నిదర్శనం కంబోడియాలో కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించిన విష్ణు దేవుని ఆలయం.
హిందూ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెబుతున్న ఈ దేవాలయానికి సంబంధించిన కొన్ని రహస్యాలను నాసా బయటి ప్రపంచానికి అందించింది. అక్కడ దాదాపు ప్రపంచానికి తెలియకుండా దాగిన 200 అద్భుతమైన నాగరికతా పెయింటింగ్ చిత్రాలను కనుగొన్నది. ఆంగ్‌కోర్ వాట్ దేవాలయంలో దాగిన రహస్యాలపై స్పెషల్ స్టోరి.
వేయి సంవత్సరాల ఆ గుడిలో అన్ని మిస్టరీ వింతలే
1) ఆంగ్‌కోర్ వాట్ దేవాలయం కంబోడియాలోని సీమ్ రీప్ పట్టణానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. హిందూ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించే అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో ఆ దేశ జాతీయ పతాకంలో స్థానం సంపాదించుకుంది.
2) ఈ ఆలయానికి కొన్ని దశాబ్దాల చరిత్ర ఉంది. ఖ్మేర్ సామ్రాజ్యంలో ఈ అద్భుత కట్టడానికి అంకురార్పణ జరిగిందని, క్రీశ 12వ శతాబ్దకాలంలో ఆంగ్ కోర్ వాట్‌ను రాజధానిగా చేసుకుని పాలించిన రెండవ సూర్యవర్మన్ కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు చరిత్ర చెబుతోంది. దీన్ని నిర్మించడానికి సుమారు 30 సంవత్సరాలు పట్టిందట.
3) ఈ దేవాలయ నిర్మాణం మన దేశంలోని తమిళనాడు దేవాలయాలను పోలి వుంటాయి. ఈ దేవాలయాలన్నీ మిగతా వాటికి భిన్నంగా పశ్చిమ ముఖద్వారాన్ని కలిగి ఉన్నాయి. టోనెల్ సాస్ సరస్సు తీరాన సుమారు 200 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో అద్భుతమైన ఆర్కిటెక్చర్‌తో ఈ దేవాలయాన్ని రూపొందించారు.
4) కులేన్ పర్వత శ్రేణుల పాదాల చెంత నిర్మించబడ్డ ఈ దేవాలయం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా, విష్ణు మూర్తి ఆలయంగా వెలుగొందుతోంది. భారతదేశంలో కూడా ఇంత పెద్ద దేవాలయం లేదు.
5) ఆనాటి ఖ్మేర్ సామ్రాజ్యంలో నీటిని నిల్వ చేసుకునేందుకు వాడిన టెక్నాలజీని చూస్తే ఎవరికైనా దిమ్మతిరగాల్సిందే. ఇక్కడి నీరు పల్లం నుండి ఎత్తుకు ప్రవహించే విధంగా అద్భుతమైన టెక్నాలజీని వాడారు. ఆ అద్భుత టెక్నాలజీని ఆంగ్ కోర్ వాట్ దేవాలయంలో కూడా వాడటంతో ఆ దేవాలయం ఇప్పటికీ దేదీప్యమానంగా వెలుగొందుతోంది.
Also Read : తులసి_చెట్టు మారే స్థితిని బట్టి ఆ ఇంట్లో ఏం జరుగుతుందో ముందే చెప్పవచ్చట
6) ఇది అప్పట్లోనే ఎలా సాధ్యమయ్యిందనే విషయం అర్కియాల జస్టులనే కాక అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఐదు మైళ్ల పొడవు, ఒకటిన్నర మైలు వెడల్పు తో విశాలమైన రిజర్వాయర్లు నిర్మించడం ఆనాటి ఇంజనీర్ల ప్రతిభకు నిదర్శనం.
7) ముందుగా ఆలయంలోని నీటిమట్టాన్ని నియంత్రించేందుకు రిజర్వాయర్ నిర్మించారు. దీని ద్వారా కరువు, వరద వంటి ప్రకృతి విపత్తులను నియంత్రించగలిగారు. ఒకదానికొకటి అనుసంధానమైన 1,500 కిలోమీటర్ల పొడవునా కాలువలు నిర్మించారు.
8) ఇనుము, అల్యూమినియం వంటి నిర్మాణ సామగ్రి రవాణా కోసం ఈ కాలువలను ఉపయోగించుకున్నారు. ఆలయ నిర్మాణానికి నీటిపై తేలియాడే ‘లాటరైట్' రాళ్లను ఎంపిక చేశారు. అది నాసా తీసిన ఫోటోల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
9) వాటిపై సియాన్‌రీవ్‌లోని కులేన్ పర్వతాల నుంచి తెచ్చిన ఇసుక శిలలను అతికించి, శిల్పాలు చెక్కారు. వాటిని అంత దూరం నుంచి ఇక్కడకు తరలించేందుకు ఏనుగులను, తేలియాడే బల్లకట్లను వాడారు.
10) పలు దేశాల శిల్పులు, సుమారు ఐదువేల మంది కార్మికులు రాత్రింబవళ్లు ఈ నిర్మాణం కోసం శ్రమించారు. ఈ రిజర్వాయర్లను వ్యవసాయ అవసరాలకు కూడా ఉపయోగించేవారట. ఫ్రెంచ్ ఆర్కియాలజిస్ట్ ఫిలిప్ గ్లోసియర్ ఈ రిజర్వాయర్లపై పరిశోధన జరిపి ఈ విషయాన్ని ధృవపరిచారు.
11) నాసా చిత్రీకరించిన ఉపగ్రహ చిత్రాల ఆధారంగా పరిశోధనలు జరిపిన సిడ్నీ యూనివర్శిటీ ఆర్కియాలజిస్టుల పరిశోధన కూడా ఫిలిప్స్ అభిప్రాయాన్ని బలపరుస్తోంది. ఉపగ్రహ చిత్రాల్లో అప్పటి మానవ నిర్మితమైన నీటి ట్యాంకులు, కాలువలు, డ్యాములు చాలా స్పష్టంగా కనిపించాయి.
12) ఇక ఈ దేవాలయంలో దాగి ఉన్న అద్భుతమైన పెయింటింగ్స్ ను నాసా లేజర్ టెక్నాలజీ సాయంతో బయటపెట్టింది. గోడలపై ఏనుగులు అలాగే దేవుడి బొమ్మలు అలాగే టవర్స్ వంటి చిత్రాలను గీసారు. ఈ చిత్రాలను చూస్తే భవిష్యత్ టెక్నాలజీకి వారు ముందు అంకురార్పణ చేశారని అనిపిస్తుంది.
13) సంగీతానికి సంబంధించిన అనేక పరికరాలు ఈ చిత్రాల్లో దాగి ఉన్నాయి. అలాగే ఆ కాలంలోనే వాడిన బోట్ల టెక్నాలజీని చూసిన శాస్ర్తవేత్తలు ఆశ్చర్యపోతున్నారు వారి తెలివికి సలాం చెబుతున్నారు.
14) వీటితో పాటు రామయణానికి సంబంధించిన పెయింటింగ్స్ గోడలపై అబ్బురపరుస్తున్నాయి. సింహాలు, కోతులు, అలాగే ఆంజనేయస్వామి వంటి చిత్రాలను నాసా తన కెమెరాలో బంధించింది.
15) మొత్తం 500 ఎకరాల్లో దాదాపు 200 పెయింటింగ్ చిత్రాలను ఆస్ట్రేలియన్ అర్కియాలజిస్ట్ సేకరించారు. చీకటి ప్రపంచంలో దాగిన ఈ కళాఖండాలను వెలుగు ప్రపంచంలోకి తీసుకువచ్చిన ఘనత ఆయనకే దక్కింది.
16) ఇంకా ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఇక్కడ ఉన్న పెయింటింగ్ చిత్రాల్లో గుర్రపు స్వారీ చేస్తున్న చిత్రాలు. ఆ కాలంలోనే గుర్రపు స్వారీల్లో ఆరితేరిపోయినట్లుగా కనపడుతున్నాయి. అంతే కాకుండా భవిష్యత్ లో ఈ నాగరికత గురించి తెలుసుకునేందుకు వారు ముందుగానే అక్కడ ఈ పెయింటిగ్ చిత్రాలు వేశారని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.
17) మొత్తం అయిదు శిఖరాలు ఉంటాయి. సువిశాలమైన నీటి కొలను మధ్య భూమిని చదును చేసి, ఇసుక రాళ్లను, ఇసుకను పొరలు పొరలుగా పేర్చి, హిమాలయాల్లోని కైలాసం సహా ఐదు దివ్య శిఖరాలకు ప్రతీకగా ఐదు శిఖరాలతో ఈ ఆలయాన్ని నిర్మించారని ప్రసిద్ధి.
18) ఈ ఆలయంలో 1,352 స్తంభాలు ఉన్నాయి. పైకప్పు రాళ్లను ‘కోబ్లింగ్' పద్ధతిలో అతికారు. తేలికైన లాటరైట్ రాళ్లు కదిలి, శిలలను ముందుకు తోసివేయకుండా మెట్లు కట్టారు. ఉషోదయ వేళ గోపురం వెనుక నుండి ఉదయ భానుడు మెల్లిగా నులి వెచ్చని లేలేత కిరణాల్ని ప్రసరింపజేస్తున్నప్పుడు గుడి గోపురాన్ని చూస్తే ఎంతసేపైనా ఆ దృశ్యాన్ని అలాగే చూస్తూ ఉండి పోవాలనిపిస్తుంది.
19) అసలు విషయానికొస్తే పూర్వకాలంలో ‘కాంబోజ దేశం' అని పిలిచేవారు. సంస్కృత పదాలను సరిగ్గా ఉచ్ఛరించలేని యూరోపియన్లు, కాంబోజదేశాన్ని కంబోడియాగా మార్చేశారు. చైనా రికార్డుల ప్రకారం ఈ ప్రాంతంమంతా హిందూ రాజుల పాలనలో ఉంది. భారతీయ పురాతన సంస్కృత గ్రంథాలు కూడా ఈ విషయాన్ని రూఢి చేస్తున్నాయి.
20) అప్పట్లో రారాజుగా.. వేద భూమిగా మన్ననలు పొందిన ఈ దేవాలయం ఆ తర్వాతి కాలంలో తన ఉనికి కోల్పోయి అడవులలో కప్పబడిపోయింది. కొన్ని ఏళ్ల తరువాత కంబోడియా ఫ్రెంచి ప్రభుత్వ అధీనంలోకి వచ్చాక ఆ ఆలయం తిరిగి వెలుగు చూసింది.
21) భువిలో వైకుంఠాన్ని తలపించే ఈ ఆలయాన్ని ప్రతి ఒక్కరూ జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిందే. హిందూ సాంప్రదాయన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఈ ఆలయం విశిష్టతను తెలుసుకోవాల్సిందే.
Famous Temple :
> ఒక స్త్రీ పురుషుని నుండి ఏమి కోరుకుంటుంది..?
> పెళ్లి కావట్లేదా అయితే ఒక్క సారి ఈగుడిని దర్శించండి..
> శయనిస్తున్నశివుడు ప్రపంచంలో ఏకైక_ఆలయం
> ఈ స్తోత్రమును శివుడు పార్వతికి చెప్పెను | ధన దేవతా స్తోత్రం
> శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం..శనివారం మహిమ.
> దేవుడిని ఇలా కోరుకోండి.. తప్పక మీ కోరిక తీరుస్తాడు..!
> సోమవారం ఇలా చేయండి రుణ బాధలు వదిలిపోతాయ్
hidden secrets of angkor wat, who built angkor wat, angkor wat facts, angkor wat built by tamil king, angkor wat temple history in tamil, angkor wat discovery, angkor wat shape, angkor wat today, angkor wat temple history in telugu