పూర్వజన్మ కర్మ...
బిల్వమంగళుడు, గురూరమ్మ , వారి ఇంటికి నిత్యం శ్రీ కృష్ణుడే వచ్చి విందుభోజనం చేసి వెళ్ళే భాగ్యాన్ని పొందారు....
బిల్వమంగళుడు.. ఏకాదశీ , దశమి మరియు శ్రవణ నక్షత్రం రోజులలో తులసి తీర్ధం మాత్ర పుచ్చుకుని ఉపవసించడం ఆచారంగా అనుసరిస్తూ వచ్చాడు.
కాని ఈ రోజులలో చక్కెర పొంగలి, పాల పాయసం మాత్రం అడిగి చేయమని చెప్పి ప్రియంగా తినే వాడు కృష్ణపరమాత్మ.
ఒకనాడు బిల్వమంగళుని
ఇంటికి అతని స్నేహితుడు వచ్చాడు.
కడుపునొప్పి తో తాను బాధపడుతున్నానని చెప్పిన స్నేహితుడు, భగవాన్ కృష్ణుని అడిగి
తన బాధను తీర్చమని కోరాడు....
పిదప భగవంతుని దర్శించిన బిల్వమంగళుడు" తన స్నేహితుడు కడుపు నొప్పితో బాధపడుతున్నాడు , మీతో మొరపెట్టమని చెప్పాడు." ఆని అన్నాడు.
తక్షణమే శ్రీ కృష్ణుడు " ఇది పూర్వ జన్మ కర్మ ఫలితం. నేనేమి చేయలేను అన్నాడు.
ఈ బదులే తన మిత్రునికి తెలిపాడు బిల్వమంగళుడు.
మనసు బాధ పడగా ఆ మిత్రుడు, గురూరమ్మని
కలుసుకున్నాడు. తన కడుపు నెప్పి బాధను తీర్చమని భగవంతుని ప్రార్ధించమని ఆమెను కూడా వేడుకున్నాడు....
ఆ తరువాత , ప్రతిరోజూ
వస్తున్నట్టే తమ ఇంటికి
వచ్చిన శ్రీకృష్ణుని ప్రేమగా ఆహారం వడ్డించింది గురూరమ్మ, పిదప మిత్రుని కడుపు నెప్పి బాధ చెప్పి , నీవల్లనే అతని బాధ తగ్గించబడుతుంది" అని
భక్తితో ప్రార్ధించినది....
ఆమె ప్రార్ధనను స్వీకరించిన శ్రీ కృష్ణుడు
మిత్రుని కడుపునెప్పి తగ్గించి కటాక్షించాడు.
ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు మిత్రుడు. బిల్వమంగళుని వద్దకు వెళ్ళాడు. గురూరమ్మ ప్రార్ధనతో తన ఉదర బాధ తీరినట్టు చెప్పాడు.
బిల్వమంగళునికి కోపం, తను వేడుకొన్నప్పుడు భగవంతుడు తన మాట వినిపించుకోలేదే ' అనే చింత అతనిక, భగవంతుని అడగనే అడిగాడు.
వెంటనే " బిల్వమంగళా !
మిత్రుని ఉదరబాధను గురించి నీవు చెప్పడం ఏదో విషయం చెప్పినట్లు
మాత్రమే వున్నది. అందుకే ఉదర బాధ వచ్చిన కారణం మాత్రమే నీకు తెలిపాను కాని
గురూరమ్మ ప్రార్ధన మాతృప్రేమ నిండి వున్నది. ఆత్మార్ధమైన పవిత్ర భక్తి , ప్రేమలతో వేడుకునే భక్తుల కోరికలు నేను తప్పక నెరవేరుస్తాను. " అని విశిద పరిచాడు.....
సత్యం గ్రహించిన బిల్వమంగళుడు.
కన్నీటితో భగవాన్ శ్రీ కృష్ణునికి
వందనాలు సమర్పించాడు.
Famous Posts:
> ఉదయం నిద్రలేవగానే వేటిని చూడకూడదో, వేటిని చూడాలో మీకు తెలుసా..?
> పిల్లల కోసం శ్లోకాలు - స్తోత్రాలు
> గ్రహదోషాల నుండి విముక్తి కలగాలంటే
> పూజ గదిలో చనిపోయిన వారి ఫోటోలు ఉండవచ్చా?
> నక్షత్ర దోషాలంటే ఏమిటి..?ఏ ఏ నక్షత్రవాళ్లకు దోషాలుంటాయి.?
> మీ ఇంటిలోని దుష్టశక్తులను నివారించడానికి పూజ గదిలో ఇలా చేయండి
> అన్నం తినే ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాలి..
> నవగ్రహాలను పూజిస్తే బాధలు తీరుతాయా ?
పూర్వజన్మ కర్మ, Sanatana Dharma Telugu, shri krishna cast, krishna images, krishna story, lord krishna wife, jai shri krishna, lord krishna images, lord krishna stories, krishna cartoon