శయనిస్తున్నశివుడు ప్రపంచంలోఏకైక_ఆలయం | Pallikondeswara Temple, Chittoor, Andhra Pradesh

శయనిస్తున్నశివుడు ప్రపంచంలోఏకైక_ఆలయం

క్షీరసాగర మథనంలో హాలాహలం పుట్టుకు వచ్చినప్పుడు భీతావహులైన సురాసురులు లోకాలను కాపాడాలంటూ పరమేశ్వరుడికి మొరపెట్టుకున్నారు. త్రిలోక రక్షణాదక్షుడైన శివుడు ఆ హాలాహలాన్ని స్వీకరించే ముందు జరిగిన దృశ్యం ఇలా ఉంది ... 

Also Readభార్య, భర్తల మధ్య మనస్పర్థలు వచ్చినప్పుడు ఈ స్తోత్రం పఠించండి. 

కంటే జగముల దు:ఖము 

వింటే జలజనిత విషము వేడిమి, ప్రభువై 

యుంటకు నార్తుల యాపద

గెంటించుట ఫలము, దాన కీర్తి మృగాక్షీ

శివుడు పార్వతితో ఇలా అన్నాడు : లోకాల ఆర్తిని చూసేవు కదా ?

పాల సముద్రం నుండి పుట్టిన విషం ఎంత వేడిమి గలదో విన్నావు కదా ? రాజైనందుకు ప్రజలను వారి ఆపదలలో ఆదుకోవాలి. 

అది నా కర్తవ్యము . పార్వతి తన పెనిమిటి లోక రక్షణార్ధం కాలకూటాన్ని భుజించడానికి సిద్ధ పడితే పంతోషంగా అంగీకరించింది.

మ్రింగెడు వాడు విభుండని

మ్రింగుడిది గరళ మనియు మేలని ప్రజకున్

మ్రింగు మనె సర్వ మంగళ,

మంగళ సూత్రంబు నెంత మది నమ్మినదో !

Also Readతుల‌సి_చెట్టు మారే స్థితిని బ‌ట్టి ఆ ఇంట్లో ఏం జ‌రుగుతుందో ముందే చెప్ప‌వ‌చ్చ‌ట‌

ఆహా ! గరళాన్ని మ్రింగే వాడు లోకప్రభువైన తన భర్త. మ్రింగేది కాలకూటం. అలా చేయడం వల్ల లోకాలకు మేలు కలుగు తుంది అని తలచి సర్వ శుభప్రదాయిని పార్వతి సరే విషాన్ని తినమని భర్తతో పలికిందిట. 

ఆ పతివ్రత తన మంగళ సూత్రాన్ని ఎంతగా నమ్ముకున్నదో కదా. 

పరమ శివుడు హాలాహలాన్ని భక్షించే టప్పటి దృశ్యాన్ని పోతన గారు ఎంత గొప్పగా కళ్ళకు కట్టేలా చిత్రించారో చూడండి ... 

గరళం కడుపులోకి వెళ్లకుండా శ్రీ మహా విష్ణువు సుక్ష్మ శరీరంతో గొంతులో ఉండిపోయాడు.దీంతో ఆ విషం గొంతులోనే ఉండిపోయి ఆ భాగమంతా నీలిరంగులోకి మారింది. అప్పటి నుండే శివుడు నీల కంటుడిగాను,శ్రీ మహా విష్ణువు నీలిమేఘ శ్యామునిగాను ప్రఖ్యాతి చెందారు.విషప్రభావంతో సొమ్మసిల్లిన శివుడు పార్వతీ దేవి ఒడిలో శయనించాడు.

నారదుడు ముల్లోకాలకూ ఈ సమాచారం చేరవేశాడు. అన్ని సురగణాలకూ ఆ దృశ్యం సురటపల్లిలో కనిపించింది. నీలకంఠుడికి స్వస్థత చేకూర్చాలని సురగణమంతా సురటపల్లికి చేరింది. అలా తరలి వచ్చిన దేవగణాన్ని పరమేశ్వరుడు విశ్రాంతి తీసుకుంటున్నాడని నందీశ్వరుడు నిలువరించాడు. విషయం తెలుసుకున్న శివుడు మేలుకుని దేవతలకు దర్శనభాగ్యం కలిగించాడు. దేవతలంతా ఆనందంతో నృత్యాలు చేశారు. సప్తరుషులు, దేవతలు పరమేశ్వరుణ్ణి కృష్ణ పక్ష త్రయోదశి నాడు దర్శించుకున్నార ని… ఈ కథనాన్ని శివపురాణం చెబుతోంది.

Also Readఒక స్త్రీ పురుషుని నుండి ఏమి కోరుకుంటుంది..?

కృష్ణ పక్ష త్రయోదశి శనివారం మహాప్రదోష వేళలో దేవతలు పళ్లికొండేశ్వర స్వామి దర్శనానికి వస్తారని, ఆరోజు దర్శనానికి వెళితే చాలు సమస్త దేవతల కరుణాకటాక్షాలను అందుకోవచ్చని భక్తుల నమ్మకం. శివుడు హాలాహలాన్ని మింగి సొమ్మసిల్లిన వేళ పదిహేనువేల మంది దేవతలు ఈ స్థలానికి వేంచేసినట్లు శివపురాణం చెబుతోంది. ఇక్కడ పరమేశ్వరుడిని నీలకంఠుడిగా, శ్రీ కంఠ, నంజుండస్వామిగానూ ఈ పళ్లికొండేశ్వర స్వామిగా భక్తులు స్తుతిస్తారు. 

సర్వమంగళాదేవి ఒడిలో తలపెట్టుకుని శయనిస్తూన్న శివుని అరుదైన దేవాలయం.

పరమశివుడు కొలువైన క్షేత్రం .. ఆయన లీలా విశేషాలకి నిలయమైన క్షేత్రం ‘సురుటుపల్లి’. మహిమాన్వితమైన ఈ క్షేత్రం చిత్తూరు జిల్లా నాగలాపురం మండలంలో విలసిల్లుతోంది. సాధారణంగా కొన్ని వైష్ణవ క్షేత్రాల్లో శ్రీమహా విష్ణువు మాత్రమే శయనభంగిమలో దర్శనమిస్తుంటాడు. శివుడు మాత్రం లింగరూపంలో పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు.

Also Readఅన్నం తినే ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాలి.. 

సదాశివుడు కూడా శ్రీమహా విష్ణువు మాదిరిగానే శయన రూపంలో కనిపించే అరుదైన క్షేత్రమే ‘సురుటు పల్లి’. లోకకల్యాణం కోసం హాలాహలాన్ని మింగిన శివుడు, ఆ విష ప్రభావం కారణంగా అమ్మవారి ఒడిలో సొమ్మసిల్లి .. ఆ తరువాత సేదదీరిన క్షేత్రం ఇది. ఈ సంఘటన కారణంగా కోటి మంది దేవతలు అక్కడికి చేరుకున్నారు.

ఆశలు తీర్చే అభిషేకం..!!

పంచామృతంతో అభిషేకం.. ఆరోగ్య ప్రాప్తి. పాలతో అభిషేకం.. దీర్ఘాయు ప్రాప్తి. 

పెరుగుతో అభిషేకం.. సత్సంతాన ప్రాప్తి. గంధంతో అభిషేకం.. లక్ష్మీకటాక్ష ప్రాప్తి.

స్వామి దర్శనం చేతనే వివాహయోగం. వివాహమైన వారికి దాంపత్య జీవితం సుఖసంతోషాలమయం. పదిహేనువేల మంది దేవతలు తరలి వచ్చి ఆరాధించిన స్వామి పల్లికొండేశ్వరుడు. కొలువుదీరిన నేల సురుటపల్లి. ఇక్కడ శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి వారు కొలువై ఉన్నారు . ఆయన్ని ఆరాధించడం వలన విశేషమైన విద్యా ప్రాప్తి కలుగుతుంది.ప్రదోష వేళలో శ్రీ నందీశ్వరుని ఆరాధనకూ ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది.

Also Readచండీ హోమం ఎందుకు చేస్తారు? చండీ హోమము విశిష్టత ఏమిటి?

సాధారణంగా దాదాపు అన్ని శివాలయాల్లోనూ శివుడు లింగాకారంలో దర్శనమిస్తాడు. కొన్నిచోట్ల ధ్యానముద్రలో ప్రశాంతంగా కూర్చున్న భంగిమలో శివయ్యను దర్శించుకుంటాం. కానీ, పార్వతీదేవి ఒడిలో ఆదమరచి నిద్రిస్తున్న భంగిమలో ఉన్న శివుడి విగ్రహాన్ని భక్తజనం ఎక్కడా చూసి ఉండరు.

పద్నాలుగు అడుగుల ఎత్తులో ఈ అరుదైన శయన శివుడి దర్శనం మనకు చిత్తూరు జిల్లాలోని సురుటపల్లి గ్రామంలోని పల్లికొండేశ్వర ఆలయంలో లభిస్తుంది. చుట్టూ బ్రహ్మ విష్ణువులు, సూర్యచంద్రాదులు, నారద తుంబురులు, ఇంద్రుడు, కుబేరుడు, మార్కండేయుడు, అగస్త్య, పులస్త్య, వాల్మీకి, విశ్వామిత్రాది మహర్షులు కొలువు తీరి ఉండగా శివుడు సర్వమంగళాదేవి (పార్వతీదేవి) ఒడిలో తలపెట్టుకుని నిద్రిస్తున్న భంగిమలో భక్తులకు దర్శనమిచ్చే దృశ్యం కన్నులపండుగగా ఉంటుంది.

Also Readమరణం తరువాత ఏం  జరుగుతుంది?  

బుక్కరాయలు నిర్మించిన ఆలయం:..!!

తిరుపతి- చెన్నై జాతీయు రహదారిలో అరుణానది ఒడ్డున ఈ ఆలయుం కొలువుదీరి ఉంది. భక్తుల పాలిట కల్పతరువుగా భావించే ఈ ఆలయూన్ని 1344-47 మధ్యకాలంలో విజయునగరాధీశుడైన హరిహర బుక్కరాయులు నిర్మింపజేశారు. 1833లో శ్రీకాళహస్తి సంస్థానాధీశులైన రాజావారు జీర్ణోద్ధరణ చేసినట్లు ఆలయు కుడ్యాలపై శాసనాలు ఉన్నాయి. ఈ ఆలయు ప్రాశస్త్యాన్ని గుర్తించిన శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర చంద్రశేఖర సరస్వతి స్వామి వారు 1979లో ఇక్కడ వుహాకుంభాభిషేకం నిర్వహించారు. ఆ సందర్భంలో చంద్రశేఖర సరస్వతి స్వాముల వారికి పరవుశివుడు దర్శన భాగ్యం కలిగించడంతో ఆయన ఈ ఆలయంలోనే గడిపినట్లు స్వయంగా పేర్కొన్నా

అందరం భక్తితో " అరుణాచల శివ " అని వ్రాసి స్వామి వారి అనుగ్రహం పొందుదాం ... ఎన్ని సార్లు స్మరిస్తే అంత మేలు చేస్తాడు ఆ భగవంతుడు

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ

Famous Posts:

ప్రతి తండ్రి అదృష్టంలో కూతురు ఉండదు


చాలామందికి  తెలియని గాయత్రీ మంత్రం రహస్యం


ప్రకారం ఇలాంటి వారు ఎప్పటికీ ధనవంతులు కాలేరు


ఇంటి ముందు ముగ్గులు ఎందుకు వెయ్యాలి ?


మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి


నక్షత్ర దోషాలంటే ఏమిటి..?ఏ ఏ నక్షత్రవాళ్లకు దోషాలుంటాయి..? 


అనుకున్న పనులన్నీ నెరవేరడం కోసం.. చక్కని పరిష్కారం..!!


భార్యాభర్తల అనుబంధం గురించి కొన్ని అమృత వాక్యాలు మీకోసం 


హిందూ సాంప్రదాయం ప్రకారం శుభ_అశుభశకునాలు –వాటి ఫలితాలు


ఉద‌యం నిద్ర‌లేవ‌గానే వేటిని చూడ‌కూడదో, వేటిని చూడాలో మీకు తెలుసా..?  

pallikondeswara temple timings, chennai to surutapalli temple distance, surutapalli temple history in telugu, surutapalli shiva temple images, surutapalli temple contact number, surutapalli sivan temple history in tamil, suruttapalli sivan temple dinamalar, surutapalli dakshinamurthy temple, sayana shiva temple, lord shiva, శయనిస్తున్నశివుడు

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS