ఆర్థిక ఇబ్బందులున్నాయా? ఎంత డబ్బు సంపాదించినా చేతిలో నిలవట్లేదా..? ఈతిబాధలు తొలగిపోవాలంటే.. వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని చిన్ని చిన్ని మార్పులు చేసి చూడండి. అవేంటంటే..? ఎరుపు, వంకాయ రంగు, పచ్చరంగుల్ని వాస్తు రంగులంటారు. ఈ రంగుల్లో ఇంట్లో వస్తువులును అమర్చుకోండి. సోఫాలు, కర్టెన్లు ఎరుపు రంగుల్లో ఎంచుకోండి. ఇలా చేస్తే ఆర్థిక పరంగా ఇబ్బందులను దూరం చేసుకోవచ్చునని వాస్తు నిపుణులు సలహా ఇస్తున్నారు.
నీటి ట్యాంక్‌లో శంఖం గుండ్లు, వెండి నాణేలు లేదా వెండి తాబేళ్లు ఉంచండి. ముఖ్యంగా నీటిని వృధా చేయకండి. నీటిని వృధా చేస్తే ఆ ఇంట డబ్బు నిలవదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. మీరెంత నీటిని వృధా చేస్తున్నారో.. అంతగా డబ్బును కూడా వృధా అవుతుందని గమనించాలి. ట్యాప్‌ల్లో ఎప్పుడూ నీటిని వృధా కాకుండా చూడాలి. నీటి వినియోగంలోను పొదుపు పాటించాలి. అశుభ్రమైన నీటిని బకెట్లలో వుంచకుండా అప్పటికప్పుడే పారబోయాలి. ఇంట్లో నీటి ప్రాంతం కూడా ఉత్తరం భాగంలోనే ఉండాలి.
Also Read : మీ పుట్టిన తేది ప్రకారం ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంచితే శుభం
తూర్పు-ఉత్తర మూలలో గణేశ, లక్ష్మీ విగ్రహాలను ఆరాధించండి. బుద్ధుని బొమ్మలు బంగారు వర్ణంలో తెచ్చుకుని ఇంట వుంచితే.. ఆర్థిక ఇబ్బందులు వుండవు. అలాగే కిచెన్‌ను ఎప్పుడూ శుభ్రంగా వుంచుకోవాలి.
Also Read : మంగళ, శుక్రవారాల్లో ఎవరికీ డబ్బు ఇవ్వకూడదా?
తులసి, ఉసిరి మొక్కను ఇంటికి ఉత్తరం దిక్కు అమర్చుకోవాలి. అలాగే మీ ఇంట మనీ ప్లాంట్‌ను పెంచుకోండి. ఆ మొక్కల సంరక్షణ ద్వారా ఆ ఇంట సంతోషంతో పాటు ఆర్థిక సమస్యలుండవని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. చాలాకాలం పాటు ఉపయోగించే వస్తువులు ఇంట వుండకుండా చూసుకోవాలి. ఉపయోగం లేని వస్తువులు ఇంట వుండకూడదు. ఈ చిట్కాలు పాటిస్తే.. ఆ ఇంట ఈతిబాధలు, ఆర్థిక ఇబ్బందులంటూ వుండవని వాస్తు నిపుణులు సలహా ఇస్తున్నారు.
ఇంటికి ఉత్తరం వైపు నగదు, బంగారం దాచుకుంటే.. వారికి లక్ష్మీదేవి కలిసి వస్తుంది. ఎక్వేరియం, డెకరేటివ్ వస్తువులన్నీ కూడా ఇంటికి ఉత్తరం వైపే ఉండాలి.
Related Posts:
> శ్రీలక్ష్మీపూజ ఇలా చేస్తే ధనమే ధనం
> యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించాలని ఉంటే, ఈ విధంగా చెయ్యండి
> బియ్యపు గింజతో ఇలా చేస్తే ధన లాభం కలుగుతుంది ఎలాగో తెలుసా ?
వాస్తు, వంట గది, వాస్తు టిప్స్ , Vastu Shastra for Home, vastu shastra for home, free vastu tips for home, vastu tips home telugu, Vastu Shastra In Telugu, vastu sandehalu in telugu, vastu directions in telugu,
Tags
interesting facts