అంతర్వేది ఘటన పై ఏలూరు డి. ఐ.జి ప్రెస్ మీట్ | Antarvedi Updates

 అంతర్వేది ఘటనా పై ఏలూరు డి. ఐ.జి ప్రెస్ మీట్

antarvedi issue


ఏలూరు రేంజి ఏలూరు డి. ఐ.జి శ్రీ కె.వి. మోహన్ రావు ఐపిఎస్ వారు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ శ్రీ కె నారాయణ్ నాయక్ ఐపీఎస్ వారు ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయం నందు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి సదరు సమావేశంలో డి. ఐ.జి గారు మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం లో ఉన్న రథమును ది 05.09.2020 వ తేదీన రథము అగ్నిప్రమాదం లో దగ్ధం అయినటువంటి విషయముపై వెంటనే పోలీస్ వారు త్వరితగతిన స్పందించి, సదరు కేసులో దర్యాప్తును ప్రారంభించినట్లు, సదరు కేసు దర్యాప్తు సందర్భంగా డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం, సైంటిఫిక్ అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించినట్లు ఈ కేసులో ఇప్పటి వరకు చాలా మంది సాక్షులను విచారించి నట్లు, సదరు కేసును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు సిబిఐకి వసిపరిచినట్లు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు వెంటనే స్పందించి భక్తుల మనోభావాలు దెబ్బతిన కూడదని లక్ష్యంతో 95 లక్షల రూపాయలు వ్యయముతో కొత్త రథము నిర్మించుట కొరకు, 95 లక్షల రూపాయలను ప్రభుత్వం గ్రాంటు చేసి కొత్త రథము నిర్మాణం ప్రారంభించినట్లు, అంతర్వేది సంఘటనలో అరెస్టు చేసిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను ఇప్పటికే బెయిల్ పై విడుదల చేయడం జరిగిందని . కొంతమంది సోషల్ మీడియాలో చలో అమలాపురం, చలో అంతర్వేది కార్యక్రమములను నిర్వహించడానికి సన్నద్ధం అవుతూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు, కోనసీమ ఎంతో ప్రశాంతమైన ఏరియాని , అక్కడ ప్రశాంతతను చెడగొట్ట వద్దు అని డీఐజీ గారు ప్రజలకు మనవి చేసారు , తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికే 30 పోలీస్ యాక్ట్, 144 సెక్షన్ అమలులో ఉన్నట్లు, చలో అమలాపురం చలో అంతర్వేది కార్యక్రమమునకు పోలీసు వారు ఎవరికీ పర్మిషన్ ఇవ్వలేదని అసాంఘిక, అరాచక శక్తుల పట్ల చట్టప్రకారం కఠినంగా వ్యవహరిస్తామని, ప్రజలు ఎవరు ఇటువంటి కార్యక్రమంలో పాల్గొన్న కూడదని,పోలీసు వారు శాంతిభద్రతలను కాపాడడం కొరకు తీసుకునే చర్యలకు ప్రజలు అందరూ సహకరించాలని డి ఐ జి గారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Related Postings : 
antarvedi updates, antarvedi pressmet, hindu temples guide, temples information, antarvedi issues.

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS