తిరువీథుల మెఱసీ దేవదేవుడు | Annamayya Keerthanalu | Hindu Temples Guide


అన్నమయ్య కీర్తనలు :

తిరువీథుల మెఱసీ దేవదేవుడు
గరిమల మించిన సింగారములతోడను ||

తిరుదండేలపై నేగీ దేవుడిదె తొలునాడు
సిరుల రెండవనాడు శేషునిమీద |
మురిపేన మూడోనాడు ముత్యాల పందిరి క్రింద
పొరినాలుగోనాడు పువు గోవిలలోను ||

గ్రక్కున నైదవనాడు గరుడునిమీద
యెక్కను ఆరవనాడు యేనుగుమీద ||
చొక్కమై యేడవనాడు సూర్యప్రభలోనను
యిక్కువ దేరును గుర్రమెనిమిదోనాడు ||

కనకపుటందలము కదిపి తొమ్మిదోనాడు
పెనచి పదోనాడు పెండ్లిపీట |
యెనసి శ్రీ వేంకటేశు డింతి యలమేల్మంగతో
వనితల నడుమను వాహనాలమీదను ||


మరికొన్ని అన్నమయ్య కీర్తనల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 

Related Postings :



keywords : Annayyamayya Keerthanlu , annamayya history, annamayya lyrics, annamayya keerthanas pdf , annamayya telugu lyrics, keerthanalu, Hindu Temples Guide

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS