మీ చావును ముందుగా తెలిపే దేవాలయం ఇదే | Pashupatinath Temple Of Life and Death

హిందువులకు అత్యంత పవిత్రమైన దేవాలయాల్లో పశుపతినాథ దేవాలయం కూడా ఒకటి. ఈ దేవాలయం హిమాలయ పర్వతాల్లో ఉంది. ఇక్కడ పరమశివుడు పశుపతినాథ రూపంలో కొలువై ఉన్నాడు. జీవిత చరమాంకంలోనైనా ఈ క్షేత్రాన్ని సందర్శించడం వల్ల చేసిన పాపాలన్నీ పోయి తప్పక మోక్షం లభిస్తుందని చెబుతారు.
మరికొంత మంది ముసలివారు జీవిత చరమాంకంలో ఇక్కడే ఆశ్రయం పొందుతూ తమ ప్రాణాలను వదిలివేస్తుంటారు. ఇంతటి విశిష్టత వెనుక ఉన్న కారణాలన్నీ మీ కోసం...

అనేకమంది హిందువులు తమ జీవన యాత్ర చివరి దశలో ఈ పశుపతినాథ దేవాలయాన్ని చేరుకొంటారు. ఈ పశుపతినాథ దేవాలయంలో ప్రాణాలు వదిలిన వారు తమ జీవితంలో చేసిన పాపాలననీ పోగొట్టుకొని పునీతులవుతారని విశ్వసిస్తారు. తద్వార జన్మరాహిత్యం పొందుతామనేది వారి నమ్మకం.

జ్యోతిష్యాలు :
సాధారణంగా పుట్టుక మరణాలు ఎవరూ అంచనా వేయలేరు. అయితే ఈ పశుపతినాథ దేవాలయంలో ప్రధాన అర్చకులు భక్తుల మరణానికి సంబంధించిన రోజు, సమయాన్ని ఖచ్చితంగా తెలియజేస్తారు. ఈ జగత్తులో వాటి గురించి ఖచ్చితంగా చెప్పగలిగేవారు కేవలం ఆ దైవమే. ఇక్కడి వాతావరణంలో మరణ దేవత ఉండటమే ఇందుకు కారణమని చెబుతారు.
దే హిమాలయ పర్వతాల్లో ఉన్న పశుపతినాథ దేవాలయం.ఇక్కడ పరమశివుడు పశుపతినాథ రూపంలో కొలువై ఉన్నాడు. ఆ ఆలయ విశిష్టత ఏంటో మనం చూద్దాం.

ప్రధాన దైవాలయం:
పశుపతినాథ దేవాలయం బంగార శిఖరంతో అత్యంత అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ దేవాలయం భగవతి నది తీరంలో, పశ్చిమ దిశలో ఉంది. ఈ దేవాలయంతోపాటు పరిసర ప్రాంతాల్లో జరిగే వైదిక కార్యక్రమాలు కొన్ని ఆశ్చార్యానికి గురిచేస్తాయి. ఈ దేవాలయ ప్రధాన శిఖరాల పై బంగారు కళశాలను అమర్చారు.ఆ సూర్య కిరణాలు వీటి పై పడినప్పుడు ఇవి మెరిసిపోతు కనులకు విందును చేస్తాయి. ఇక్కడి శిల్ప సౌదర్యం ఎంత ముచ్చట గొలిపిస్తుందో పూజాది కార్యక్రమాలు అంతే ఆశ్చర్యానికి గురిచేస్తాయి. కొన్ని కార్యక్రమాలు భయంకరంగా కూడా ఉంటాయి.
ఈ దేవాలయం గర్భగుడిలోకి మాత్రం కేవలం హిందువులకు మాత్రమే అనుమతి.మిగిలిన దేవాలయ ప్రాంగణం మొత్తం ఎవరైనా తిరుగవచ్చు.
శిల్పాలు :
ఈ దేవాలయం అద్భుత శిల్పకళకు నిలయం. ఆ శిల్పాలను చూస్తున్నంత సేపు మనం నిజమైన దేవతలను, నాట్యగత్తలను చూస్తున్నామేమో అన్న అనుభూతిని కలిగిస్తుంది. అందువల్లే భారతీయ శిల్పకళ పై పరిశోధన చేసేవారు ఎక్కువగా ఈ దేవాలయాన్ని సందర్శిస్తుంటారు.
పెద్ద నంది :
వీటన్నింటితో పాటు ఈ దేవాలయంలో బ`హత్ నంది భక్తులను ప్రధానంగా ఆకర్షిస్తుంది. ఈ దేవాలయం గర్భగుడిలోకి మాత్రం కేవలం హిందువులకు మాత్రమే అనుమతి. మిగిలిన దేవాలయ ప్రాంగణం మొత్తం ఎవరైనా తిరుగవచ్చు.
విదేశీయులు :
ఈ దేవాలయాన్ని సందర్శించే పర్యాటకుల్లో దాదాపు 30 శాతం విదేశీయులే ఉండటం గమనార్హం. ఈ దేవలయం గర్భగుడిలోకి తప్ప మిగిలిన ప్రాంతమంతా వీరిని తిరడగానికి అనుమతిస్తారు. భాగమతి తూర్పు దిశ నుంచి చూస్తే ఈ దేవాలయం ఎంతో అందంగా కనిపిస్తుంది.
అనాథలకు ఆశ్రమం :
పశ్చిమ తీరంలో పశుపతినాథ దేవలయంతో పాటు పంచ దేవాలయాలు కూడా ఉన్నాయి. అంటే ఐదు పుణ్య దేవాలయాలన్నమాట. ఈ ఐదు పుణ్య దేవాలయాల్లో ఒక్కప్పుడు దూప దీప నైవేద్యాలు జరిగేవి. ప్రస్తుతం ముసలివారికి ఆ్రయం కల్పిస్తున్నాయి.
అంత్యక్రియలు:
ఈ నదీ తీరంలో ఎక్కడ చూసిన శివలింగాలే దర్శనమిస్తాయి. దీంతో ఈ ప్రదేశంలో అణువణువునా ఆ పరమశివుడు ఉన్నాడని భావిస్తారు. ఇక ఈ భాగమతి నది ఎడమవైన అంత్యక్రియలు నిర్వహించడానికి అనేక వేదికలు ఉన్నాయి. ప్రతి వేదిక వద్ద ప్రతి రెండుగంటలకు ఒకసారైన అంత్యక్రియల కార్యక్రమం జరుగుతూ ఉంటుంది.

ప్రతి జీవిలోనూ దైవత్యం :
ఇక్కడ ఉన్న ప్రతి జీవిలోనూ ఆ పరమశివుడు ఉన్నాడని భావించి మహిళలు ఇక్కడ కనబడిన ప్రతి జీవికి ఏదో ఒక ఆహారం అందజేస్తుంటారు. తద్వారా పుణ్యం వస్తుందని భావిస్తుంటారు.
ఫొటోల కోసం ఫోజులు :
ఈ దేవాలయంలో సాధువులు ఎక్కువగా కనిపిస్తుంటారు. పర్యాటకులు, భక్తులతో చాలా స్నేహంగా కూడా మెలుగుతూ ఉంటారు. ఫొటోలకు ఫోజులు కూడా ఇస్తారు. అయితే ఇందు కోసం కొంత మొత్తాన్ని ఛార్జ్ చేస్తుంటారు.
అలాగే పశుపతినాథ్ ఆలయంలో ఇంకా ఎన్నో దర్శనీయ స్థలాలున్నాయి. బంగారు తాపడం చేసిన దేవతామూర్తులు, చతుర్ముఖ విగ్రహం, ఏడవ శతాబ్ధికి చెందిన చండకేశ్వరుడు, బ్రహ్మదేవాలయం, ఆర్యఘాట్. గౌరీ ఘాట్ లు ఎంతో ప్రముఖమైనవి. శివుడు స్మశాన సంచారి. ఆర్యఘాట్ లో స్మశానం కూడా వుంది.
కొన్ని ప్రత్యేక దినాల్లో పశుపతినాథ్ దేవాలయాన్ని  వేలాది భక్తులు దర్శిస్తారు.
సంక్రాంతి, మహాశివరాత్రి, రాఖీ పౌర్ణమి రోజుల్లో పశుపతినాథుని దర్శనం కోసం.. భక్తులు అపరమిత సంఖ్యలో వస్తారు. ముఖ్యంగా గ్రహణం రోజున ఇక్కడి పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ముఖ్యంగా మహాశివరాత్రి రోజున పశుపతినాథ్ ఆలయం నేతిదీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతూ కనిపిస్తుంది. మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో ఇక్కడి భాగమతిలో స్నానం చేసి పశుపతినాథుడ్ని దర్శించుకుంటే పుణ్యమని భావిస్తారు.
Address: Pashupati Nath Road 44621, 
Kathmandu 44600, Nepal

Famous Temples :
సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు

ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు

ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే

అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం

> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి

100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం

> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం
pashupatinath temple history telugu, pashupatinath temple story, pashupatinath temple in india, pashupatinath temple photos, pashupatinath temple rules, how to reach pashupatinath temple, Nepal Pasupati temple, pashupatinath temple timings, pashupatinath temple shivling, Kathmandu, Nepal

4 Comments

  1. How to reach pasupathi nath temple and free shelter for long time

    ReplyDelete
  2. except the heading details, so many things were put up

    ReplyDelete
  3. Nepal Muktinath Pashupatinath Yatra Call/Whatsapp +91-9198595775

    ReplyDelete
Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS