ఏ దేవాలయంలో ఎన్ని ప్రదక్షిణలు చేయాలో మీకు తెలుసా ? How many Pradakshina are there in Hanuman Temple?

pradakshina temple

సహజంగా హిందువులు దేవాలయంలోని దేవుని చుట్టూ ప్రదక్షిణం చేస్తారు. సహజంగా మనము దేవాలయాన్ని దర్శించినప్పుడు ప్రార్ధన, పూజ అనంతరము గుడి యొక్క గర్భాలయము చుట్టూ కుడి చేతి వేపుగా తిరగడమే ప్రదక్షణము అంటారు.
దైవ ప్రదక్షిణములో మెల్లగా నడచుట, చేతులు జోడించుట మరియు దేవుని ధ్యానించుట అనేవి ముఖ్యమైన భాగాలు. భగవదుపచారాల్లో ప్రదక్షిణ నమస్కారం చివరిది, పరిపూర్ణమైనది. ఏవైనా గ్రహాచారాలు బాగలేకపోయినా, అరిష్టాలేర్పడినా ఆలయాల్లో నియమిత సంఖ్యలతో ప్రదక్షిణ చేస్తే వాటి పరిహారం జరుగుతుందని హిందూ ధర్మ శాస్త్రాలు సూచిస్తాయి.

ప్రదక్షిణ అనే పదంలోని ప్రతి అక్షరానికి భావార్థం ఉంది. ‘ప్ర' అనగా పాప నాశనమని, ‘ద' అనగా కోరికలను నెరవేర్చుట అని, ‘క్ష' అనగా భవిష్యత్తు జన్మల నుండి విమోచనం అని ‘ణ' అనగా జ్ఞానం ద్వారా ముక్తిని ప్రసాదించునదని అర్థం.
ప్రదక్షిణము ఎందుకు చేస్తాము?
ఒక కేంద్ర బిందువు లేనిదే మనము ఒక వృత్తాన్ని చిత్రీకరించలేము. భగవంతుడు మన జీవితాలకు కేంద్రము, ఆధారము మరియు సారము. మనము ఆయనను కేంద్రముగా చేసికొని మన జీవిత కార్య కలాపాలు సాగిస్తాము. ఈ ప్రాముఖ్యతను తెలిపేదే ప్రదక్షిణము.

ఒక వృత్తానికి దాని పరిధి లోని ప్రతి బిందువు కేంద్ర స్థానము నుంచీ సమానమైన దూరంలోనే ఉంటుంది. అనగా మనమెక్కడ ఉన్నప్పటికీ, ఎవరమయినప్పటికీ, భగవంతునికి అందరమూ సమానమైన సన్నిహితులమే. పక్షపాత రహితముగా ఆయన కరుణ అందరి వైపు ఒకేలాగా ప్రవహిస్తూ ఉంటుంది.

ప్రదక్షిణ ఎడమ నుండి కుడికి గుండ్రగానే ఎందుకు చేయబడుతుంది?
ప్రదక్షిణ చేసేటప్పుడు భగవంతుడు మనకు కుడివైపు ఉంటాడు. అందుకని కుడి వైపు నుంచి ప్రదక్షిణము చేస్తాము. భారత దేశములో కుడి వైపు అనేది శుభ ప్రదతను తెలుపుతుంది. అందువలన గర్భాలయంను కుడి వైపుగా ఉంచి ప్రదక్షిణము చేసేటప్పుడు మనకు అన్ని వేళలా సహాయము, శక్తిని ఇచ్చి, మార్గ దర్శకత్వము అయి మన జీవితాన్ని ధర్మము వైపు నడిపించే వాడయిన భగవంతునితో బాటు ఋజు వర్తనము కలిగి శుభప్రదమైన జీవితాన్ని గడపాలని గుర్తు చేసికోవాలి. మనము అత్యంత ప్రాముఖ్యం ఇచ్చే వాటిని కుడి వైపున అంత కన్నా తక్కువ ప్రాధ్యాన్యత ఇచ్చే వాటిని వెడమ వైపున ఉంచడము మన సాంప్రదాయం. ఈ విధముగా చేయడము వలన అధర్మ ప్రవృత్తుల నుంచి బయట పడి మళ్ళీ మళ్ళీ తప్పులు చేయకుండా సవ్య మార్గములో నిలబడతాము.
భారతీయ వేద గ్రంధాలు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిధి దేవో భవ అని శాసిస్తాయి. నువ్వు నీ తల్లిదండ్రులను మరియు గురువులని భగవత్స్వరూపులుగా భావించుదువు గాక! ఈ భావముతో మనము మన తల్లి దండ్రులకు మరియు మహాత్ములకి కూడా ప్రదక్షిణ చేస్తాము. తన తల్లి దండ్రులకి గణపతి దేవుడు ప్రదక్షిణ చేసినట్లు చెప్పే కధ అందరికీ తెలిసినదే.

సాధారణంగా మూడు, అయిదు లేదా పదకొండుసార్లు ప్రదక్షిణ చేస్తుంటాం. అయితే, వివిధ దేవుళ్ళకు ఎన్ని ప్రదక్షిణలు చేయాలో పెద్దలు నిర్దేశించారు.
ఏయే దేవాలయాల్లో ఎన్ని ప్రదక్షిణలు చేయాలి?
ఏ దేవాలయంలోనైనా కనీసం మూడు తప్పనిసరి.
నవగ్రహాలకు కనీసం మూడు. దోషాలు పోవడానికి కనీసం తొమ్మిది. ఇక ప్రదక్షిణం చేసేవారి జాతక/గోచార పరంగా ఆయా గ్రహాల స్థితిని బట్టి 9, 11, 21, 27, 54 ఇలా ప్రదక్షిణలు చేయాలి.
ఆంజనేయస్వామి దేవాలయంలో సాధారణంగా మూడు. గ్రహదోషాలు పోవాలనుకుంటే కనీసం 9/11, భయం, రోగం, పీడలు, దుష్టశక్తుల బాధలు పోవాలంటే కనీసం 21/40 లేదా 108 ప్రదక్షిణలు చేయాలి.
శివాలయంలో సాధారణ ప్రదక్షిణలు చేయకూడదు. చండీశ్వరప్రదక్షిణ చేయాలి.
అమ్మవారి దేవాలయంలో కనీసం మూడు/తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి.
వేంకటేశ్వరస్వామి/బాబా, గణపతి దేవాలయాల్లో కనీసం మూడు/ఐదు, తొమ్మిది, పదకొండు ప్రదక్షిణలు చేయాలి.
ప్రదక్షిణలు చేసినా ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. మనసు ధ్యాస అంతా లోపల ఉన్న భగవంతునిమీద మాత్రమే తప్ప కోరిక/ఇతరత్రా విషయాలపై ఉండకూడదు.
సాధరణమైన, పరిశుభ్రమైన వస్త్రధారణతో దేవాలయంలో ప్రదక్షిణలు చేయాలి.
వేగంగా, పరుగు పరుగున ప్రదక్షిణ చేయకూడదు.

చాలా నెమ్మదిగా దైవనామ/ఓం కారం లేదా ఆయా దేవాలయంలో ఉన్న మూల విరాట్ నామస్మరణతో (మనసులో) పక్కవారిని తాకకుండా, వేరే ముచ్చట్లు పెట్టకుండా ప్రదక్షిణలు చేయాలి.
ఇక ఆలస్యం ఎందుకు ఆయా కామితార్థాలను పొందడానికి భగవంతున్ని భక్తితో ప్రదక్షిణలు చేయండి.
Famous Posts:
సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు

ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు

ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే

అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం

> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి

100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం

> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?


దేవాలయం, ప్రదక్షిణలు, pradakshina, pradakshina meaning, pradakshina in temple, how many pradakshina in temple, anticlockwise pradakshina, anti-clockwise pradakshina, pradakshina patha stupa, pradakshina in english, how many pradakshina in hanuman temple

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS