Hindu Temple Guide Quiz 2nd answer

Hindu Temple Guide Quiz 2nd answer 

2. గౌహతి అస్సాం: 

మీరు చెప్పిన సమాధానం సరియైనది కాదు. 
కారణం అష్టాదశ శక్తిపీఠాలలో 13 వ శక్తీ పీఠం శ్రీ కామఖ్యదేవి శక్తిపీఠం. మనదేశంలోని అస్సాం నందలి గౌహతి నగర పశ్చిమ భాగంలోని నీలాచల కొండల వద్ద ,బ్రహ్మపుత్రా నదీ తీరంలో ఈ కామఖ్య అమ్మవారు వెలసినది. ఈ అమ్మవారిని  కామరూపాదేవి అని కూడా పిలుస్తారు. పూర్వం ఈ ఆలయాన్ని రాజవంశులు నిర్మించారు. ఆలయం లోపల అంత  పెద్ద గుహ,ఆ గుహలోకి వెళ్లాక ఇంకా లోపలికి వెళ్ళినట్లైతే భూగర్భంలోనికి మెట్లు ఉంటాయి.
గర్భాలయంలోని మూడు అడుగుల చదరంగాను,ఒకటిన్నర అడుగులోతున గుంట ఉన్నది. ఈ గుంట లోపల ఉన్న రాతి నేలపై యోని ముద్ర కనిపిస్తుంది. అదే అమ్మవారి రూపం ఈ రూపం నుంచి నీరు ఊరుతూ ఉంటుంది. ఈ నీరు ఎక్కడ నుండి వస్తుందో ఎవరికీ తెలియదు. దీనినే తీర్థంగా సేవిస్తారు.


 
తిరిగి ప్రయత్నించడం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS