ఇకపై గూగుల్ పే లో అప్పులు ఇచ్చేందుకు సిద్ధం | Google pay News - Latest google pay News

భారతీయులు ప్రపంచంలోని ఎటువంటి విషయాన్ని అయినా శోధించడానికి మొదటిగా ఆలోచించే సాధనం గూగుల్.అయితే తాజాగా గూగుల్ పే క్రెడిట్ బిజినెస్ లోకి అడుగు పెట్టబోతోంది. 

‘గూగుల్ పే’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశ వ్యాప్తంగా కోట్ల మంది ఈ గుగూల్ పేను ఉపయోగిస్తున్నారు. బిల్స్, రీచార్జులు, పేమెంట్స్, మనీ ట్రాన్స్‌ఫర్‌ లాంటి ఎన్నో సేవల్ని గూగుల్ పే అందిస్తోంది. తాజాగా ఈ సంస్థ క్రెడిట్ బిజినెస్‌లో అడుగుపెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అప్పులు ఇచ్చే ఆలోచన చేస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశమున్నట్లు గూగుల్ పే యాజమాన్యం పేర్కొంది. ఇందు కోసం ఈ సంస్థ ఇండియాలోని టాప్ లెండర్స్‌తో ఒప్పందం కుదుర్చుకోనుంది.

ఎవరైనా సరే వారి కొత్త కొత్త ఆలోచనలకు రూపం దాల్చే విషయంగా చిన్న చిన్న పరిశ్రమలు నెలకొల్పేందుకు సహాయం చేయాలని గూగుల్ యజమాన్యం ఆలోచన చేస్తోంది.ఎవరికైతే డబ్బు సహాయం ఉందో వారికి వెంటనే అప్పు ఇచ్చే విధంగా ప్రణాళికలను సిద్ధం చేస్తోంది గూగుల్.

గుగూల్ పే ఫ్లాట్ ఫామ్‌ ద్వారా తక్కువ వడ్డీకి మొదట ఓ 30 లక్షల మంది వరకూ ఇన్‌స్టంట్ క్రెడిట్ అంటే తక్షణమే అప్పు ఇచ్చే సదుపాయాన్ని ప్రారంభించనుందట. ఇప్పటికే కన్స్యూమర్ లోన్స్ ఇచ్చేందుకు యాక్సిస్, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఫెడరల్, కోటక్ మహీంద్రా బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంది గూగుల్. మరి చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఇవ్వాలనుకునే రుణాల కోసం.. ఏయే బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకోనుందో ఇంకా తెలియాల్సి ఉంది.

ఇకపోతే ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ పై వ్యాపారులకు పూర్తి నియంత్రణ ఉండేలా చూస్తామని తెలియజేశారు.అయితే ఈ ఫీచర్ ఈ సంవత్సరం చివరి నాటికి అందుబాటులోకి తెచ్చేటట్లు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు.
Famous Temples:









గూగుల్ పే, Gpay, google pay latest news, google pay hack news, google pay latest news in hindi, google pay not working, google pay customer care number, google pay twitter, google pay new updates, google news,  phonepe news

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS